య‌జ‌మాని ఎన్ఆర్ఐ అయితే టీడీఎస్ చెల్లింపు ఎలా?

గడువులోగా ఎన్ఆర్ఐ య‌జ‌మాని నుంచి టీడీఎస్ ప్ర‌భుత్వానికి చేర‌క‌పోతే అంతే స‌మానంగా జ‌రిమానా ప‌డుతుంది.

య‌జ‌మాని ఎన్ఆర్ఐ అయితే టీడీఎస్ చెల్లింపు ఎలా?

సాధార‌ణంగా ఎన్ఆర్ఐలు దేశంలో రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డులు పెడుతుంటారు. ఇళ్లు నిర్మించి అద్దెకిస్తుంటారు. మీ ఇంటి య‌జ‌మాని ఎన్ఆర్ఐ అయితే ప్ర‌తి నెల చెల్లించే అద్దె నుంచి టీడీఎస్ మిన‌హాయిస్తున్నారో లేదా తెలుసుకోవాలి. సాధార‌ణంగా అద్దెలో టీడీఎస్ 31.2 శాతంగా ఉంటుంది. అయితే ఎన్ఆర్ఐ య‌జ‌మాని భార‌త్‌లో ప‌న్నుకు మించిన ఆదాయం లేద‌ని స‌ర్టిఫికెట్ చూపిస్తే త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. టీడీఎస్ మిన‌హాయించేంద‌కు క‌నీస ప‌రిమితి లేదు. ఉదాహ‌ర‌ణ‌కు, నెల‌కు ఇంటి అద్దె రూ.5 వేలు అయిన‌ప్ప‌టికీ అద్దెదారులు టీడీఎస్ మిన‌హాయించాల్సి ఉంటుంది. ఇంటి య‌జ‌మాని ఎన్ఆర్ఐ అయితే టీడీఎస్ స‌మ‌యానికి చెల్లించాల్సిన‌ బాధ్య‌త అద్దెకుండేవారికే ఉంటుంది.

టీడీఎస్ ఎలా మిన‌హాయించాలి?
అద్దెదారుడు ముందు ట్యాన్ నంబ‌ర్‌ను పొందాలి. ఆన్‌లైన్‌లో ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్ ద్వారా తీసుకోవ‌చ్చు. ట్యాన్ నంబ‌ర్ వ‌చ్చిన త‌ర్వాత అద్దెకు ఉండేవారు ప్ర‌తి నెల ఆన్‌లైన్ ద్వారా టీడీఎస్ చెల్లించ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు, అద్దె రూ.5 వేలు అయితే, అందులో రూ.1,570 అంటే 31.2 శాత‌తం టీడీఎస్ మిన‌హాయించాలి. మిగ‌తా బ్యాలెన్స్ య‌జ‌మానికి చెల్లించాలి.
టీడీఎస్ ప్ర‌తి నెల ఏడో తేదీ లోపు అద్దెదారుడు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు, జూన్ 5 న అద్దె చెల్లించి టీడీఎస్ మిన‌హాయిస్తే జులై 7 లోపు టీడీఎస్ ప్ర‌భుత్వానికి చేరాలి. గ‌డువు పూర్త‌య్యేలోపు టీడీఎస్ ప్ర‌భుత్వానికి చెల్లించ‌డం చాలా ముఖ్యం. ఒకవేళ చెల్లించ‌క‌పోతే ఆదాయ ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 267బీ ప్ర‌కారం మూడు నెల‌ల నుంచి ఏడేళ్ల వ‌ర‌కు కూడా శిక్ష ప‌డే అవ‌కాశం ఉంటుంది. అదేవిధంగా జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ య‌జ‌మాని నుంచి టీడీఎస్ మిన‌హాయించ‌క‌పోతే ఆదాయ ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 271C ప్ర‌కారం ప‌న్నుకు స‌మానంగా జ‌రిమానా ఉంటుంది.

రిట‌ర్నుల‌ను ఎలా దాఖ‌లు చేయాలి?
ప్ర‌తీ త్రైమాసికం ముగిసిన నెల లోపే అద్దెదారుడు టీడీఎస్ రిట‌ర్నులు దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు, ఏప్రిల్‌-జూన్ త్రైమాసికానికి టీడీఎస్ జులై 31 లోగా చేయాలి. అయితే జ‌న‌వ‌రి-మార్చి త్రైమాసికానికి సంబందించిన టీడీఓస్ మే 31 లోపు దాఖ‌లు చేయ‌వ‌చ్చు. టీడీఎస్‌ రిట‌ర్నులు దాఖలు చేసిన త‌ర్వాత అద్దెదారులు 15 రోజుల్లో ఫార్ం 16A లో టీడీఎస్ స‌ర్టిఫికెట్ య‌జ‌మానికి అందించాలి. ప్ర‌తిసారి అద్దె చెల్లించే స‌మ‌యంలో ఆదాయ ప‌న్ను వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌లో ఫారం 15CA లో వివ‌రాలు అందించాలి . సంవ‌త్స‌రానికి రూ.5 ల‌క్ష‌ల కంటే ఎక్కువ అద్దె చెల్లిస్తే చార్ట‌ర్డ్ అకౌంటెంట్ (సీఏ) నుంచి ఫారం 15CB పొందాల్సి ఉంటుంది

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly