పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ ఆన్‌లైన్ లో ఎలా చేయాలి?

ఐపీపీబీ ద్వారా మీ పోస్ట్ ఆఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాలోకి డబ్బును బదిలీ చేయడానికి దశల వారీగా ఇప్పుడు చూద్దాం.

పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ ఆన్‌లైన్ లో ఎలా చేయాలి?

పోస్టాఫీసు అందించే ప‌థ‌కాల్లో రిక‌రింగ్ డిపాజిట్ పొదుపు పధకంతో మ‌దుప‌ర్లు ప్రతి నెల స్థిర మొత్తాన్ని పొదుపు చేసేందుకు సహాయపడుతుంది. మీరు బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ లో రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాను తెరవవచ్చు. పోస్ట్ ఆఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ ను ప్రారంభించటానికి అవసరమైన కనీస మొత్తం నెలకు రూ.10 లేదా 5 గుణిజాలలో ఏ మొత్తం అయినా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. పెట్టుబడి కాలం ఐదు సంవత్సరాలు. సమీప పోస్టాఫీసుని సందర్శించడం ద్వారా రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాను తెరవవచ్చు. పోస్ట్ ఆఫీస్లో రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాను నగదు ద్వారా తెర‌వాలి. అయితే ఇప్పుడు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) రాక‌తో రిక‌రింగ్ డిపాజిట్ నెలసరి విడత ఆన్లైన్లో బదిలీ చేసుకోవ‌చ్చు. మొబైల్ లో ఐపీపీబీ యాప్ ద్వారా ప్రతిదీ నిర్వహించవచ్చు. వినియోగ‌దారులు ఖాతా తెరవడానికి ఒకసారి పోస్ట్ ఆఫీస్ వెళ్తే చాలు మిగిలిన ప‌నుల‌న్నీ ఆన్లైన్ లో చేసుకునేందుకు వీలుంది.

ఐపీపీబీ ద్వారా మీ పోస్ట్ ఆఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాలోకి డబ్బును బదిలీ చేయడానికి దశల వారీగా ఇప్పుడు చూద్దాం.

 1. మీ బ్యాంకు ఖాతా నుంచి ఐపీపీబీ ఖాతాకు న‌గ‌దు పంపించాలి.
 1. పోస్టాఫీసు అందించే డీఓపీ ప్రొడ‌క్ట్స్ కు వెళ్ళండి, అక్కడ రిక‌రింగ్ డిపాజిట్ ఎంచుకోవాలి.

 2. మీ రిక‌రింగ్ డిపాజిట్ ఖాతా నంబరు, డీఓపీ కస్టమర్ ఐడీ ని రాయాలి.

 3. వాయిదా వ్యవధి, మొత్తం ఎంచుకోవాలి.

 4. ఐపీపీబీ మొబైల్ అప్లికేషన్ ద్వారా చేసిన విజయవంతమైన చెల్లింపు బదిలీ వివ‌రాలు మీకు తెలియజేస్తాయి.

ఐపీపీబీ తో మీ పోస్ట్ ఆఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాను లింక్ చేయ‌డం ద్వారా మీ పీపీఎఫ్‌ మొత్తాన్ని ఐపీపీబీ యాప్ ద్వారా జమ చెయ్యవచ్చు. సుకన్య స‌మృద్ధి ఖాతాకు కూడా ఈ అప్లికేషన్ ద్వారా చేయవచ్చు.

ఇండియా పోస్ట్ అందించే వివిధ ర‌కాల‌ పోస్ట్ ఆఫీస్ పెట్టుబడులను ఎంపిక చేసుకోవచ్చు. ఐపీపీబీ ప్రాథమిక పొదుపు ఖాతా ద్వారా రెగ్యులర్ చెల్లింపులు చేసుకోవచ్చు.

ఇతర బ్యాంకు ఖాతాల నుంచి ఐపీపీబీ కు బదిలీ చేయవచ్చు. డబ్బును పంపడానికి ముందు, మీరు వ్యక్తి ఖాతా సంఖ్య, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ జోడించాలి.

ఐపీపీబీ ఖాతా తెరవడం ఎలా:

 1. మీ స్మార్ట్ఫోన్లో, యాప్ స్టోర్కు వెళ్లి, ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ కోసం చూడండి.

 2. ‘‘Open your account now!’ లింక్ ను క్లిక్ చేయ‌డం ద్వారా డిజిటల్ సేవింగ్స్ ఖాతా కోసం సైన్ అప్ చేయాలి.

 3. ‘basic information’ లో పాన్, ఖాతాను లింక్ చేయాలనుకునే ఫోన్ నంబర్తో పాటు ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి.

 4. తరువాతి పేజీలో మీ ఆధార్ నంబర్ నమోదు చేయాలి.

 5. మీరు సైన్ అప్ చేసిన తర్వాత, ప్రధాన పేజీలో ఫోన్ నంబర్తో సహా మీ ఇతర వివ‌రాల‌ను నమోదు చేయండి.

 6. ధ్రువీకరణకు అందించిన ఫోన్ నంబర్ కు ఒక ఒటీపీ అందుంతుంది.

 7. ఇప్పుడు, మీరు ఖాతాను తెరించేందుకు ఒక ఎమ్‌పిన్ ను ఏర్పాటు చేసుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly