ఏడాదిలో ల‌క్షాధికారి కావండిలా

ఈ ప్ర‌ణాళికను పాటిస్తే ఏడాదిలో ల‌క్షరూపాయ‌లు సుల‌భంగా సంపాదించ‌వ‌చ్చు

ఏడాదిలో ల‌క్షాధికారి కావండిలా

యువ‌త‌రం సంపాద‌న ప్రారంభించిన తొలినాళ్ల‌లో మ‌దుపు చేసేందుకు చ‌క్క‌ని ప్ర‌ణాళిక‌. ఉద్యోగమో లేదా వ్యాపార‌మో చేయ‌డం ద్వారా సంపాద‌న‌ ప్రారంభించిన యువ‌త త‌మ తొలి ల‌క్ష రూపాయ‌ల‌ను ఎలా సంపాదించాలో ఆర్థిక ప్ర‌ణాళిక ఎలా వేయాలో చూద్దామా. సాధార‌ణంగా యువ‌త‌కు పొదుపు చేయాల‌నే ఆలోచ‌న ఉన్న‌ప్ప‌టికీ ఏవిధంగా చేయాలి అనే విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు. ప్ర‌స్తుతం వివిధ ర‌కాల పెట్టుబ‌డి సాధ‌నాలు ఉన్నాయి. యువ‌తరం ఆదాయం పొందే తొలినాళ్ల‌లో పెట్టుబ‌డి చేసి కొంత మొత్తాన్ని సంపాదించిన త‌రువాత వారిలో ఒక విశ్వాసం ఏర్ప‌డుతుంది. నెల‌కు కొంచెం కొంచెం పెట్టుబ‌డి చేస్తూ కొంత మొత్తాన్ని పొందేవిధానం ఇప్పుడు చూద్దాం. ఆర్థిక ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చుకునేందుకు ఒక ప్ర‌ణాళిక వేసుకుని క్ర‌మంగా మ‌దుపు చేయాలి. కొన్ని ఉదాహ‌ర‌ణ‌లతో ప్ర‌ణాళిక ఎలా వేయాలో తెలుసుకుందాం.

నెల‌వారీ సిప్: ప్ర‌తీ నెల మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో చేసే పెట్టుబ‌డి.
కాల‌ప‌రిమితి: ఈ ఉదాహ‌ర‌ణ‌లో కాల‌వ్య‌వ‌ధి ఏడాది.
రాబ‌డి శాతం ఆయా పెట్టుబ‌డి సాధ‌నాలు,ఫండ్లు ఆధారంగా ఉంటుంది. ఈ ఉదాహ‌ర‌ణ‌లో 7%, 7.5%, 8 % చొప్పున‌ అంచ‌నా తీసుకున్నాం. ల‌భించే మొత్తం అస‌లు, పెట్టుబ‌డి క‌లిపి ఎంత అనేది చూపిస్తుంది. పెట్టుబ‌డి ఈ ఏడాది వ్య‌వ‌ధిలో ఎంత డ‌బ్బు మ‌దుపు చేశాం అనేది చూపిస్తుంది.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిప్ విధానంలో పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా ఎలా సంపాదించాలో కింది ప‌ట్టిక‌ల్లో వివ‌రంగా తెలిపాం.

గ‌మ‌నిక‌: ఒక సంవ‌త్స‌రం అంటే త‌క్కువ కాల‌ప‌రిమితి పెట్టుబ‌డి చేసేందుకు స్థిరాదాయ సాధ‌నాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబ‌ట్టి రాబ‌డి అంచ‌నాలు ఒక మోస్త‌రు ప‌రిధిలో తీసుకున్నాం. లిక్విడ్ ఫండ్లు, డెట్ ఫండ్లు ఈ కేట‌గిరీలోకి వ‌స్తాయి.

ఇక్క‌డ మూడు సంద‌ర్భాల‌ను ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుని గ‌ణించాం. నెల‌వారీ సిప్ అంటే ప్ర‌తీ నెల మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుప‌రి చేసే పెట్టుబ‌డి రూ. 8,000 నుంచి రూ. 9,500 గా తీసుకున్నాం. వార్షిక రాబ‌డి 7 శాతం, 7.5శాతం, 8 శాతం అంచ‌నా .

bi.png

ప‌ట్టిక‌లో పేర్కొన్న గ‌ణాంకాల‌ను చూస్తే…

కొన్ని సంద‌ర్భాల్లో రూ.ల‌క్ష‌కు ద‌గ్గ‌ర‌గా వ‌స్తే కొన్ని సంద‌ర్భాల్లో రూ.ల‌క్ష‌కు మించి వ‌చ్చాయి.

  • వార్షిక రాబ‌డి 0.5, 1 శాతం పెరిగిన ప్ర‌భావం స్ప‌ల్పంగానే ఉండేందుకు కార‌ణం త‌క్కువ కాల‌వ్య‌వ‌ధి ఉండ‌టం.
  • వార్షిక రాబ‌డి 7 శాతం, 7.5శాతంలో కూడా క‌నీసం రూ.8,500 పెట్టుబ‌డి చేస్తే రూ. ల‌క్ష‌కు మించి ఆర్జించ‌డం అవుతుంది.
  • వార్షిక రాబ‌డి 8 శాతం చొప్పున నెల‌కు రూ. 8,000 మ‌దుపు చేయ‌డం ద్వారా ఏడాదిలో రూ. 1,00,263  ఆర్జించ‌వ‌చ్చు.
  • ఇక్క‌డ వీటిలో రూ. 1 ల‌క్ష దాటిన సంద‌ర్భాలను చూస్తే క‌నీసం 8,000 పెట్టుబ‌డి చేయాల‌ని తెలుస్తోంది.
  • మార్కెట్లు అనుకూలించి రాబ‌డి ఎక్కువ వ‌స్తే ఏడాది చివ‌ర్లో ల‌భించేమొత్తం ల‌క్ష రూపాయ‌ల కంటే ఎక్క‌వొస్తుంది.
  • రూ.9,500 శాతం రాబ‌డి చొప్పున 12 నెల‌ల పాటు సిప్ విధానంలో మ‌దుపు చేస్తే రూ. 1,19,063 గ‌రిష్టంగా పొందొచ్చు.

మొత్తం మీద కాస్త అటూఇటూగా నెల‌కు రూ. 8 వేలు స్థిరాదాయం ఇచ్చే పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపు చేయ‌డం ద్వారా ఏడాదిలో రూ. ల‌క్ష పొంద‌వ‌చ్చు. త‌క్కువ కాల‌ప‌రిమితి కాబ‌ట్టి ఈ ప్ర‌ణాళిలో న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉన్న స్థిరాదాయ మార్గాల‌ను తీసుకున్నాం. ఈక్విటీ సంబంధిత పెట్టుబ‌డి సాధ‌నాలు ఎక్కువ రాబ‌డి ఇచ్చే అవ‌కాశం ఉన్నా అదే స్థాయి న‌ష్టం క‌లిగే అవ‌కాశం లేక‌పోలేదు.

ఈ ప్ర‌ణాళిక ఉద్దేశ్యం ఏంటంటే…

కొత్త‌గా మ‌దుపు చేయ‌డం ప్రారంభించే వారికి త‌క్కువ న‌ష్ట‌భ‌యంతో ఒక మోస్త‌రు రాబ‌డి శాతం క‌లిగే విధంగా ప్ర‌ణాళిక ఉంటుంది. వార్షిక రాబ‌డి శాతాల‌ను కూడా త‌క్కువ‌గా తీసుకున్నాం. సంపాదించే ప్రారంభంలోనే ఒక ల‌క్ష రూపాయ‌లు సంపాదించ‌డం నేర్చుకుంటే త‌ర్వాత మీకు కావ‌ల్సిన డ‌బ్బును సంపాదించ‌డం సుల‌భంగా ఉంటుందని చెప్ప‌డం ప్ర‌ధాన ఉద్దేశ్యం.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly