వడ్డీ ఆదాయాన్ని ఐటీఆర్ ఫైల్ చేయడం ఎలా?
సీనియర్ సిటిజన్లకు వడ్డీ ఆదాయంపై సెక్షన్80 టీటీబీ కింద గరిష్టంగా రూ.50 వేల వరకు మినహాయింపు లభిస్తుంది
మనలో చాలా మంది బ్యాంకు డిపాజిట్లు లేదా పోస్టాఫీసు డిపాజిట్లపై కొంత వడ్డీని పొందుతుంటారు. 2019-20 అసెస్మెంట్ సంవత్సరానికి గానూ పన్ను చెల్లింపుదారులు ఎక్కడ నుంచి ఎంత వడ్డీ ఆదాయం వచ్చింది అనే విషయాన్ని ఐటీఆర్ ఫారమ్‌లలో విడివిడిగా నమోదు చేయాలి. ఇంతకు ముందు అన్ని వనరుల నుంచి వచ్చిన వడ్డీ ఆదాయాన్ని ఏకమొత్తంగా తెలిపితే సరిపోయేది. ఆదాయపు పన్ను నియమాల ప్రకారం ఒక బ్యాంక్ లేదా కో-ఆపరేటీవ్ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పొదుపు ఖాతాల డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం వార్షికంగా రూ.10 వేల లోపు ఉంటే సెక్షన్ 80టీటీఏ కింద మినహాయింపు లభిస్తుంది.
సీనియర్ సిటిజన్లకు సెక్షన్80 టీటీబీ కింద బ్యాంకు, కో-ఆపరేటీవ్ బ్యాంకు, పోస్టాఫీసు ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై గరిష్టంగా రూ.50 వేల వరకు మినహాయింపు పొందేందుకు అర్హత ఉంటుంది. సెక్షన్80టీటీఏ కింద మినహాయింపులు సీనియర్ సిటిజన్లకు వర్తించవు.
మరోవైపు పీపీఎఫ్, ఈపీఎఫ్ వంటి పథకాల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై పూర్తి మినహాయింపు లభిస్తుంది.
ఆదాయపు పన్ను శాఖ వడ్డీఆదాయం, మినహాయింపులు వంటి వివరాలతో ముందుగా ఫిల్ చేసిన ఐటీర్ ఫారమ్‌లను అందించడం ప్రారంభించింది. ఈ ఫారమ్‌లను ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైల్లింగ్ వైబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఫారమ్‌లను సమర్పించే ముందు, పన్ను చెల్లింపుదారుడు వివరాలను ధృవీకరించాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు.
వడ్డీ ఆదాయాన్ని, ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయంష కింద నివేదించాలి. వీటిలో బ్యాంకు పొదుపు ఖాతా నుంచి వడ్డీ, బ్యాంకు / పోస్టాఫీసు / కో-ఆపరేటివ్ సొసైటీ డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ, ఆదాయపు పన్ను వాపసు, కుటుంబ పెన్షన్ నుంచి వడ్డీ ఉంటాయి. ఉదాహరణకు, ఐటీఆర్ -1లో, పన్ను చెల్లింపుదారుడు ఆదాయ స్వభావాన్ని ఎంచుకుని ఆదాయ మొత్తాన్ని నమోదు చేయాలి. ఒకవేళ వివిధ వనరుల నుంచి వచ్చిన ఆదాయాన్ని తెలియజేయాల్సి వస్తే, ప్రతీ ఒక్క ఆదాయ వివరాలను ప్రత్యేక లైన్ ఐటెమ్‌గా నివేదించాలి.
ఐటిఆర్ -2 ని దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులు, వడ్డీ ఆదాయాన్ని 'షెడ్యూల్ ఓఎస్’లో నివేదించవలసి ఉంటుంది. ఇందులో వడ్డీ ఆదాయాన్ని వెల్లడించడానికి అనేక హెడ్లు అందుబాటులో ఉంటాయి. లేదా ఐటిఆర్ -1 లో ఎక్కడ ఫైల్ చేయాలో నివేదించాలని అశోక్ మహేశ్వరి & అసోసియేట్స్ ఎల్ఎల్పిలో ట్యాక్స్ అండ్ రెగ్యూలేటరీ డైరెక్టర్ సందీప్ సెహగల్ తెలిపారు.
పన్ను చెల్లింపుదారులు, బ్యాంకు వారు అందజేసిన స్టేట్మెంట్లు, ఆదాయ సర్టిఫికేట్లలో వడ్డీ ఆదాయాన్ని తనిఖీ చేసుకుని, ఫారమ్ 26ఏఎస్‌తో సరిచూసుకువాలి. అంతేకాకుండా, మినహాయింపు ఉన్న వడ్డీని కూడా తెలియచేయాలి. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్పీఎస్(పాక్షిక) నుంచి వచ్చే వడ్డీ ఆదాయాన్ని మినహాయింపు ఆదాయం కింద నివేదించాలి.
Comments
0