ఉమాంగ్ యాప్ ని ఉపయోగించి పీఎఫ్ అడ్వాన్స్ పొందడం ఎలా?

పీఎఫ్ అడ్వాన్స్ ఉపసంహరణ అభ్యర్థనను ఉమాంగ్ యాప్ ని ఉపయోగించి కూడా చేయవచ్చు

ఉమాంగ్ యాప్ ని ఉపయోగించి పీఎఫ్ అడ్వాన్స్ పొందడం ఎలా?

కోవిడ్ -19 సంక్షోభం కారణంగా నగదు సంక్షోభం నుంచి బయటపడటానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) నుంచి నగదు ఉపసంహరించుకోవడానికి ఉద్యోగులను అనుమతించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఉద్యోగి, మూడు నెలల జీతం (ప్రాథమిక వేతనం, డీఏ) లేదా పీఎఫ్ ఖాతా నుంచి 75 శాతం బ్యాలన్స్, ఇందులో ఏది తక్కువ ఉంటే దానిని ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ​​ప్రకారం, కోవిడ్-19 కారణంగా తలెత్తిన ఆర్థిక సమస్యలను తీర్చడానికి పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి ఎలాంటి గడువు లేదు, మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ఇది అందుబాటులో ఉంటుంది.

పీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయడానికి, ఈపీఎఫ్‌ఓ యూనిఫైడ్ పోర్టల్‌కు లాగిన్ అయ్యి, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్), పాస్‌వర్డ్ ను ఉపయోగించి పీఎఫ్ అడ్వాన్స్ కోసం అభ్యర్థన చేయాలి. ప్రత్యామ్నాయంగా, పీఎఫ్ అడ్వాన్స్ ఉపసంహరణ అభ్యర్థనను ఉమాంగ్ యాప్ ని ఉపయోగించి కూడా చేయవచ్చు.

ఉమాంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్) యాప్ అనేది ప్రాథమికంగా భారతీయ పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి స్థానిక ప్రభుత్వ సంస్థల వరకు ఈ-గోవ్ సేవలను, ప్రావిడెంట్ ఫండ్ సేవలతో సహా ఇతర పౌరుల కేంద్రీకృత సేవలను పొందటానికి ఒక వేదిక. మీరు 9718397183 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఉమాంగ్ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ని ఉమాంగ్ వెబ్‌సైట్ నుంచి లేదా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఉమాంగ్ యాప్ ని ఉపయోగించి పీఎఫ్ ని ఉపసంహరించుకునే ప్రక్రియ :

స్టెప్ 1: ఉమాంగ్ యాప్ ని ఓపెన్ చేయండి

స్టెప్ 2: ఈపీఎఫ్ఓ​​ని సెలెక్ట్ చేయండి

స్టెప్ 3: “రిక్వెస్ట్ ఫర్ అడ్వాన్స్ (కోవిడ్-19)” ఎంచుకోండి

స్టెప్ 4: మీ యూఏఎన్ వివరాలను నమోదు చేసి, వన్-టైమ్ పాస్వర్డ్ పొందడానికి ‘Get OTP’ పై క్లిక్ చేయండి. మీ ఖాతాలో లాగిన్ అవ్వడానికి ఈ ఓటీపీ ని ఉపయోగించండి.

స్టెప్ 5: ఓటీపీ ని ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి. మీరు లాగిన్ అయిన తర్వాత మీ బ్యాంకు ఖాతా చివరి నాలుగు అంకెలను నమోదు చేసి, డ్రాప్-డౌన్ మెను నుంచి మెంబర్ ఐడీని ఎంచుకోవాలి.

“ప్రొసీడ్ ఫర్ క్లెయిమ్” పై క్లిక్ చేయండి

స్టెప్ 6: మీ చిరునామాను నమోదు చేసి, ‘నెక్స్ట్’ పై క్లిక్ చేయండి.

స్టెప్ 7: మీ ఖాతా నంబర్, పేరు ముద్రించిన చెక్కు ఇమేజ్‌ను అప్‌లోడ్ చేయండి. అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత, మీ క్లెయిమ్ విజయవంతంగా దాఖలు అవుతుంది.

ఒకవేళ మీకు రెండు యూఏఎన్ ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే, మునుపటి అన్ని పీఎఫ్ నంబర్లను, ప్రస్తుత యూఏఎన్ కి లింక్ చేసిన పీఎఫ్ ఖాతాకు బదిలీ చేయడం మంచిది. దాని కోసం, మీరు మొదట బదిలీ క్లెయిమ్ దాఖలు చేసి, ఆపై పీఎఫ్ అడ్వాన్స్ పొందాలి. అధిక మొత్తంలో పీఎఫ్ అడ్వాన్స్ పొందటానికి ఇది మీకు సహాయం చేస్తుంది.

ఒకవేళ వివరాలు మ్యాచ్ అవ్వకపోవడం వలన మీరు క్లెయిమ్ ను ఫైల్ చేయలేకపోతే, మీరు మెంబర్ యూనిఫైడ్ పోర్టల్‌కు లాగిన్ అయ్యి, క్లెయిమ్ ను దాఖలు చేయడానికి ముందు వాటిని సరిచేయాలి. ప్రస్తుత కోవిడ్-19 సంక్షోభంలో ఎవరైనా ఉద్యోగం కోల్పోయినప్పటికీ, పీఎఫ్ అడ్వాన్స్‌ను సభ్యుడు పొందవచ్చు.

గరిష్ట ఉపసంహరణ పరిమితి :

మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉన్నప్పటికీ, ఈపీఎఫ్ అడ్వాన్స్ కోసం గరిష్ట పరిమితి వర్తిస్తుంది. ఉదాహరణకు, A అనే వ్యక్తికి నెలవారీ వేతనం రూ. 20000 ఉన్నట్లయితే, అర్హత ఉన్న అడ్వాన్స్ మొత్తం రూ. 60000. ఒకవేళ A అనే వ్యక్తికి నెలవారీ వేతనం రూ. 30000 ఉన్నట్లయితే, అడ్వాన్స్ మొత్తం రూ. 75000 లకు పరిమితం అవుతుంది.

క్లెయిమ్ స్టేటస్ తనిఖీ :

క్లెయిమ్ ను దాఖలు చేసిన తరువాత, మీరు ఈపీఎఫ్ఓలోకి లాగిన్ అయ్యి ఆన్‌లైన్ సేవలను యాక్సెస్ చేయడం ద్వారా క్లెయిమ్ స్టేటస్ ను తనిఖీ చేయవచ్చు. ఈపీఎఫ్ఓ ప్రకారం, కోవిడ్-19 మహమ్మారిపై పోరాడటానికి ముందస్తు ప్రయోజనం కోసం ఈపీఎఫ్ఓ ​​క్లెయిమ్లను మూడు పని దినాలలోగా పరిష్కరిస్తోంది. క్లెయిమ్లను ప్రాసెస్ చేసిన తరువాత, ఈపీఎఫ్ఓ ​​ఈ మొత్తాన్ని హక్కుదారుడి బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly