ఈపీఎఫ్ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో బ‌దిలీ చేయ‌డం ఎలా?

ఉద్యోగం మారిన‌న‌ప్పుడు సంస్థ కొత్త ఈపీఎఫ్ ఖాతాను తెరిచిన‌ప్ప‌టికీ యూఏఎన్ నెంబ‌రులో మార్పు ఉండ‌దు

ఈపీఎఫ్ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో బ‌దిలీ చేయ‌డం ఎలా?

ఉద్యోగి భవిష్య నిధి(ఈపీఎఫ్‌) అనేది పొదుపు ప‌థ‌కం, ప‌న్ను మిన‌హాయింపుతో కూడిన రాబ‌డిని అందిస్తుంది. మీరు ఈపీఎఫ్ ఖాతాదారులా? ఉద్యోగం మారుతున్నారా? మీ పాత ఈపీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్సు, ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న సంస్థ కొత్త ఖాతాలోకి బ‌దిలీ చేసుకోవ‌చ్చు. మీరు ఉద్యోగం మారిన‌ప్పుడు కొత్త సంస్థ‌లో కొత్త ఈపీఎఫ్ ఖాతా తెరుస్తారు. అయితే యూనివ‌ర్స‌ల్ అక్కౌంట్ నెంబ‌ర్‌(యూఏఎన్‌)లో మార్పు ఉండ‌దు. 1952లో ప్ర‌భుత్వం ఈపీఎఫ్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఇందులో పొదుపు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి చేసింది. ఉద్యోగి, సంస్థ‌లు రెండు క్ర‌మానుగుణంగా ఈపీఎఫ్‌కి కాంట్రీబ్యూట్ చేయాలి. ఈ ప‌థ‌కం కింద కొన్ని కంపెనీలు వాటి సొంత పీఎఫ్ ట్ర‌స్ట్‌లు న‌డుపుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించింది. ఒక‌వేళ మీ సంస్థ కూడా సొంతంగా పీఎఫ్ ట్ర‌స్టును నిర్వ‌హిస్తుంటే పాత సంస్థ‌లో పీఎఫ్ బ్యాలెన్సును కొత్త సంస్థ‌కు మార్చుకోవ‌డం సాధ్యంకాదు.

పాత సంస్థ నుంచి కొత్త సంస్థ‌కు ఆన్‌లైన్ ద్వారా ఈపీఎఫ్‌ను బ‌దిలీ చేసుకునే విధానం:

  1. ముందుగా మీ యూఏఎన్ నెంబ‌రు పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఉప‌యోగించి ఈపీఎఫ్ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
  2. ఎడ‌మ వైపున ఉన్న ఆన్‌లైన్ స‌ర్వీసెస్‌కు వెళ్ళాలి
  3. అందులో ఒన్ మెంబ‌ర్ - ఒన్ ఈపీఎఫ్ ఖాతా బ‌దిలీ అభ్య‌ర్థ‌న‌ను ఎంచుకోవాలి.
  4. మీ యూఏఎన్ లేదా పాత ఈపీఎఫ్ స‌భ్య‌త్వ ఐడీని మ‌రొక‌సారి ఎంట‌ర్ చేస్తే, మీ ఖాతా వివ‌రాలు క‌నిపిస్తాయి.
  5. మీ ప్ర‌స్తుత‌, పాత సంస్థ‌ల‌లో దేని నుంచి బ‌దిలీ చేయాల‌నుకుంటున్నారో తెలియ‌జేయాలి.
  6. ఇందులో నుంచి పాత ఖాతాను ఎంచుకుంటే ఓటీపీ(ఒన్‌టైమ్ పాస్‌వ‌ర్డ్‌) జ‌న‌రేట్ అవుతుంది.
  7. ఒక‌సారి మీరు ఓటీపీ ఎంట‌ర్ చేసిన త‌రువాత‌, ఆన్‌లైన్‌ ద్వారా బ‌దిలీ ప్రాసెస్ అభ్య‌ర్థ‌న మీ సంస్థ‌కు చేరుతుంది.
  8. ఆన్‌లైన్ స‌ర్వీసెస్ మెనూలోని ‘ట్రాక్ క్లెయిమ్ స్టేట‌స్’ ఆప్ష‌న్ ద్వారా మీ ఈపీఎఫ్ బ‌దిలీ స్థితిని తెలుసుకోవ‌చ్చు.
  9. ఆఫ్‌లైన్ ద్వారా బ‌దిలీ చేసేందుకు పాత లేదా ప్ర‌స్తుత సంస్థ‌కు ఫార‌మ్‌13ను స‌బ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  10. ఈపీఎఫ్ఓ అందించే ఆన్‌లైన్ సౌక‌ర్యం ద్వారా స‌భ్యులు పీఎఫ్ చివ‌రి సెటిల్‌మెంటు, పెన్ష‌న్ విత్‌డ్రా, పీఎఫ్ పాక్షిక విత్‌డ్రాల‌కు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly