పాన్ కార్డ్ లో వివరాలు అప్‌డేట్ చేసుకోవ‌డం ఎలా?

పాన్ కార్డ్‌లో ఏమైనా త‌ప్పులు ఉంటే ఎలా స‌రిచేసుకోవాలో తెలుసుకోండి

పాన్ కార్డ్ లో వివరాలు అప్‌డేట్ చేసుకోవ‌డం ఎలా?

ఆదాయ ప‌న్ను చెల్లించేవారికి పాన్ నంబ‌ర్ త‌ప్ప‌నిస‌రి అన్న సంగ‌తి తెలిసిందే. అయితే మీ పాన్ కార్డులో వివ‌రాలు త‌ప్పుగా ఉన్నాయా? తిరిగి స‌రిచేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే అది ఎలాగో తెలుసుకోండి.

ఆన్‌లైన్ ద్వారా పాన్ అప్‌డేట్ చేసుకునే విధానం:

 1. onlineservices.nsdl.com’ ద్వారా పాన్ అప్‌డేట్ చేసుకునే అవ‌కాశం ఉంది.
 2. వెబ్‌సైట్‌లోకి వెళ్లిన త‌ర్వాత ‘application type’ ను క్లిక్ చేసి ‘Changes or correction in existing PAN data’ అనే ఆప్ష‌న్ ఎంచుకోవాలి.
 3. ఇక్క‌డ అన్ని వ్య‌క్తిగ‌త‌ వివ‌రాల‌ను పూర్తి చేసి స‌బ్‌మిట్ చేయాలి.
 4. స‌బ్‌మిట్ చేసిన త‌ర్వాత ఒక‌ కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. టోకెన్ నెంబ‌ర్ జ‌న‌రేట్ అవుతుంది. ఇది మీ ఈ-మెయిల్‌కు కూడా వ‌స్తుంది.
 5. ఇప్పుడు ‘Submit scanned images through e-Sign’ అనే ఆప్ష‌న్ చెక్ చేసుకోవాలి.
 6. పాన్ నెంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి.
 7. అప్లికేష‌న్‌లో మీరు స‌రిచేయాల‌నుకునే వివ‌రాలను ఎంచుకోవాలి. అదేవిధంగా మీరు అందించిన చిరునామా నివ‌సిస్తున్న ఇంటి చిరునామా లేదా ఆఫీస్ చిరునామా అన్న‌ది సూచించాలి.
 8. చిరునామాలో కూడా ఏమైనా వివ‌రాలు అప్‌డేట్ చేయాల‌నుకుంటే అక్కేడే చేసుకునే అవ‌కాశం ఉంది.
 9. ఇందులో మీరు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న చిరునామాను ఇవ్వ‌డం త‌ప్ప‌నిసరి.
 10. అప్‌డేట్ చేయ‌డం పూర్తైన త‌ర్వాత ర‌సీదు (అక్‌నాలెడ్జ్‌మెంట్) వ‌స్తుంది.
 11. దీనిని ప్రింట్ తీసి, పాన్‌కు అవ‌స‌ర‌మైన‌ ఇత‌ర డాక్యుమెంట్స్‌తో క‌లిపి ఈ కింది చిరునామాకి పంపించాలి.
  Income Tax PAN Services Unit
  (Managed by NSDL e-Governance Infrastructure Limited)
  5th Floor, Mantri Sterling, Plot No. 341,
  Survey No. 997/8, Model Colony,
  Near Deep Bungalow Chowk,
  Pune - 411 016

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly