పెరిగిన వేత‌నంతో ఏం చేస్తున్నారు?

మీరు ప‌నిచేసే రంగాల్లో వృద్ధి న‌మోదైతే వేత‌నం పెరిగే అవ‌కాశం ఉంటుంది. అయితే పెరిగిన వేత‌నాన్ని ఎలా ఉప‌యోగిస్తున్నార‌న్న‌ది ఇక్క‌డ ముఖ్య‌మైన అంశం.

పెరిగిన వేత‌నంతో ఏం చేస్తున్నారు?

కంపెనీలు 2019 లో త‌మ ఉద్యోగుల‌కు వేత‌నాల‌ను స‌గ‌టుగా 9.7 శాతం వ‌ర‌కు పెంచ‌నున్నాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధి సానుకూలంగా ఉండ‌టంతో వృద్ధి అంచ‌నాలు దేశీయ డిమాండ్ పెర‌గ‌డం, ద్ర‌వ్యోల్బ‌ణం త‌గ్గ‌డం వంటివి ఇందుకు కార‌ణాలుగా చెప్తున్నారు. వెయ్యి కంపెనీలు, 20 రంగాల మీద ప‌రిశోధ‌న చేసిన త‌ర్వాత ఒక స‌ర్వే ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. 2017తో పోలిస్తే 2018 లో కంపెనీలు 9.5 శాతం పెంచాయి.

వేత‌నం పెరిగితే ఏం చేస్తున్నారు ?

మీరు మీ ఖ‌ర్చుల‌కు స‌రిపేడేంత డ‌బ్బు లేక ఇంకా ఇబ్బంది ప‌డుతుంటే రుణాలు తీసుకుంటారు. అయితే వేత‌నం పెరిగిన త‌ర్వాత మొద‌ట చేయాల్సిన ప‌ని రుణాల‌ను తిరిగి చెల్లించ‌డం. ఎంత ఎక్కువ కాలం రుణాల‌ను ఉంచుకుంటే, క్రెడిట్ కార్డు బిల్లుల‌ను స‌మ‌యానికి చెల్లించ‌క‌పోతే ఆల‌స్య రుస‌ములు, వ‌డ్డీల‌తో క‌లిపి ఆ త‌ర్వాత‌ అంత ఎక్కువ డ‌బ్బు మీరు త‌ర్వాత కోల్పోవాల్సి వ‌స్తుంది. అందుకే మొద‌ట‌గా రుణాల‌ను, బిల్లుల‌ను తిరిగి చెల్లించాలి.

పొదుపు, పెట్టుబడుల‌పై దృష్టి వ‌హించండి:

మీ పెరిగిన వేత‌నాన్ని బ‌ట్టి మీ ఖ‌ర్చులు, పొదుపు , పెట్టుబ‌డుల లెక్క‌ల‌ను మ‌రోసారి విశ్లేషించుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు, వేత‌నం 5 శాతం కంటే త‌క్కువ‌ పెరిగితే ద్ర‌వ్యోల్బ‌ణానికి మించిన వేత‌నం అయితే మీరు అందుకోలేరు. ప్ర‌తి ఏడాది పెరుగుతున్న ధ‌ర‌లతో ఒకే వ‌స్తువును వ‌చ్చే ఏడాదిలో ఎక్కువ ధ‌ర పెట్టి కొనాల్సి ఉంటుంది. అందుకే వేత‌నం పెరిగిన‌ప్పుడు డ‌బ్బు పొదుపు చేసుకుంటే ద్ర‌వ్యోల్బ‌ణానికి త‌గిన‌ట్లుగా వ‌స్తువుల‌ను కొనుగోలు చేసే అవ‌కాశం ఉంటుది. ఆర్థిక సల‌హాదారులు 5 శాతం లేదా అంత‌కంటే త‌క్కువ‌గా జీతం పెరిగిన‌ప్పుడు మీ ఖ‌ర్చుల్ని త‌గ్గించుకోవాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు. ద్ర‌వ్యోల్బ‌ణానికి మించి ఎక్కువ‌గా పెరిగిన‌ప్పుడు పొదుపు చేయ‌డం ప్రారంభించాలి.

మీ గురించి ఖ‌ర్చు చేసుకోండి:

పొదుపు చేయ‌డం, పెట్టుబ‌డులు పెట్ట‌డం, రుణాల‌ను చెల్లించ‌డం అనేది మంచి విష‌య‌మే . అయితే దీని అర్థం పూర్తిగా మీ అవ‌స‌రాల‌ను కూడా మానుకొని పొదుపు చేయాల‌ని కాదు. మీకు అవ‌స‌రం అనుకున్న వాటి గురించి ఎంత ఖ‌ర్చ‌వుతుందో లెక్కించి ప‌క్క‌న‌పెట్టి మిగ‌తాది పొదుపు చేసేందుకు ప్ర‌య‌త్నించాలి. వేత‌నం పెరిగిన మొద‌టి రెండు నెల‌లు పెరిగిన జీతంతో షాపింగ్, ప్ర‌యాణాల‌కు ఇత‌ర వాటికి ఖ‌ర్చు చేసుకోవాలి. ఆ త‌ర్వాత మూడో నెల నుంచి పెట్టుబ‌డులు చేయ‌డం ప్రారంభించాలి. జీవ‌న విధానాన్ని మెరుగుప‌రుచుకోవాలంటే ఇదే స‌రైన‌న మార్గ‌మ‌ని గుర్తుపెట్టుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly