ఖాతాలో రూ.1500 ఉంటే రూ.5 ల‌క్ష‌ల గృహ‌రుణం

అసంఘ‌టిత రంగ కార్మికుల గృహ క‌ల నెర‌వేర్చేందుకు ఐసీఐసీఐ బ్యాంకు రుణాల‌ను జారీచేయ‌నుంది

ఖాతాలో రూ.1500 ఉంటే రూ.5 ల‌క్ష‌ల గృహ‌రుణం

అసంఘటిత రంగంలో పనిచేస్తూ… క్రమబద్ధమైన ఆదాయం లేని వారికీ గృహరుణాలు అందించేందుకు ఐసీఐసీఐ హోం ఫైనాన్స్‌ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ‘అప్నా ఘర్‌ డ్రీమ్స్‌’ పేరుతో కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, కుట్టుపనివారు, రంగుల కార్మికులు, మెకానిక్‌లు తదితర రంగాల్లో పనిచేస్తున్న వారికి వీటిని అందించనుంది. రూ.2లక్షల నుంచి రూ.50లక్షల వరకూ వీరికి రుణాలను ఇస్తామని ఐసీఐసీఐ హోం ఫైనాన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. సొంత ఇంటిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఆదాయ ధ్రువీరకరణలు, ఇతర పత్రాలు లేకున్నా ఈ రుణాన్ని అందిస్తామని వెల్లడించింది.

వినియోగదారులు రూ. 5 లక్షల వరకు రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి కనీస ఖాతా బ్యాలెన్స్ రూ. 1,500 ఉండాలి. రూ. 5 లక్షలకు మించిన రుణం కోసం, బ్యాంకు ఖాతాలో కనీసం రూ. 3,000 అవసరం. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) అన్ని ప్రయోజనాలను కూడా పొందవచ్చు అని బ్యాంక్ తెలిపింది.

గృహ రుణం పొందటానికి మీకు చాలా పత్రాలు అవసరమయ్యే రోజులు అయిపోయాయి. ఈ కొత్త పథకం కింద, రుణగ్రహీతలు రుణం పొందడానికి పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు, గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాలి. “మా బ్రాంచ్ ఉద్యోగులు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థపై అవగాహన ఉన్న స్థానిక నివాసితులు కాబట్టి, గృహ రుణాల దరఖాస్తులను కనీస డాక్యుమెంటేషన్‌తో త్వరగా ఇబ్బంది లేకుండా ప్రాసెస్ చేయడానికి మా అంతర్గత న్యాయ, సాంకేతిక నిపుణులు సహాయం చేస్తారు” అని మేనేజింగ్ డైరెక్టర్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ అనిరుధ్ కమణి అన్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly