ఐసీఐసిఐ బ్యాంకు బాండ్ల జారీ

ఐసీఐసీఐ బ్యాంకు బాండ్ల జారీ ద్వారా నిధుల‌ను స‌మీక‌రించ‌నుంది.

ఐసీఐసిఐ బ్యాంకు బాండ్ల జారీ

ఐసీఐసీఐ బ్యాంకు బాండ్ల జారీ ద్వారా రూ.2,147 కోట్ల నిధుల‌ను సేక‌రించ‌నుంది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ఆధారంగా మొత్తం 21,470 బాండ్లను జారీ చేయ‌నుంది. జూన్ 27, 2017 నుంచి ఇష్యూ ప్రారంభ‌మైంది. నిన్న జ‌రిగిన కంఎనీ ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ల స‌మావేశంలో బ్యాంకు ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఈ మొత్తం నిధుల‌ను రెండు ద‌శ‌ల్లో స‌మీక‌రించ‌నున్న‌ట్లు కంపెనీ పేర్కొంది. మొద‌ట వార్షిక కూప‌న్ రేటు 7.42 శాతంతో ఏడు సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి గ‌ల బాండ్ల జారీ ద్వారా రూ.400 కోట్లను, మ‌రో ద‌శ‌లో ప‌ది సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమ‌తి గల బాండ్ల జారీ ద్వారా రూ.1,747 కోట్ల‌ను స‌మీక‌రించ‌నున్నారు. వార్షిక‌ కూప‌న్ ధ‌ర‌ 7.47 శాతంగా నిర్ణ‌యించారు.

ఇవి బీఎస్ఈ హోల్‌సేల్‌ డెట్ మార్కెట్ విభాగంలో, ఎన్ఎస్ఈ జాబితాల‌లో చేర‌నున్నాయి. ఈ బాండ్ల‌కు కేర్ రేటింగ్స్, ఇక్రా ‘ఏఏఏ/స్థిర‌త్వం’ రేటింగ్‌ను ఇచ్చాయి.

ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు ప్ర‌స్తుతం బీఎస్ఈలో రూ.3.10 (1.08%) లాభంతో రూ.291.10 వ‌ద్ద కొన‌సాగుతున్నాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly