ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ర‌హిత లావాదేవీలు

'iMobile' యాప్ ద్వారా కార్డు లేకుండానే సుర‌క్షితంగా న‌గ‌దును విత్‌డ్రా చేసుకోవ‌చ్చు

ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ర‌హిత లావాదేవీలు

ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకు నేడు ఏటీఎం ద్వారా కార్డు ర‌హిత లావాదేవీల‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు ప్ర‌క‌టించింది. అంటే డెబిట్ కార్డు లేకుండానే 24 గంట‌లు ఏ ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలో అయిన బ్యాంక్ వినియోగ‌దారుల‌ను న‌గ‌దు తీసుకోవ‌చ్చు. iMobile యాప్ ద్వారా కార్డు లేకుండా సుర‌క్షితంగా న‌గ‌దును విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. కేవ‌లం మొబైల్ ఉంటే స‌రిపోతుంది. ఈ స‌దుపాయం వినియోగ‌దారుల‌కు సౌక‌ర్యంగా ఉంటుంద‌ని భావిస్తున్న‌ట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ అనుప్ బాగ్చి అన్నారు.

iMobile యాప్ ద్వారా న‌గదు విత్‌డ్రా చేయ‌డం ఎలా?

  1. ఐసీఐసీఐ మొబైల్ యాప్ iMobile లోకి లాగిన్ కావాలి
  2. ‘Services’ లో Cash Withdrawal at ICICI Bank ATM’ ఆప్ష‌న్ ఎంచుకోవాలి
  3. ఆ త‌ర్వాత ఎంత విత్‌డ్రా చేసుకోవాల‌నుకుంటున్నారో ఎంట‌ర్ చేసి, ఖాతా సంఖ్య‌, తాత్కాలిక 4 అంకెల పిన్‌ను ఎంట‌ర్ చేయాలి
  4. మీ మొబైల్‌కు ఓటీపీ వ‌స్తుంది. ఓటీపీ ఎంట‌ర్ చేసిన న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు

ప్ర‌యోజ‌నాలు

  • న‌గ‌దు విత్‌డ్రా చేసేందుకు డెబిట్ కార్డు లేదా ఏటిఎం కార్డు, పిన్ నంబ‌ర్ అవ‌స‌రం లేదు.
  • దేశ‌వ్యాప్తంగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంల‌లో ఈ స‌దుపాయం ల‌భిస్తుంది
  • రోజుకు రూ.20 వేల వ‌ర‌కు విత్‌డ్రా చేసుకునేందుకు ప‌రిమితి ఉంది
  • iMobile యాప్ ద్వారా న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవ‌డం సుర‌క్షితం
  • బ్యాంకు ఇటీవ‌ల నెట్ బ్యాంకింగ్ కోసం కూడా ఓటీపీని ప్ర‌వేశ‌పెట్టింది

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly