రుణ రేట్ల‌ను త‌గ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్

ఈ రుణ రేట్ల త‌గ్గింపుతో ఏడాది ఎంసీఎల్ఆర్ 8.65 శాతానికి చేరింది.

రుణ రేట్ల‌ను త‌గ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్

దేశ రెండో అతిపెద్ద ప్ర‌వేటు బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్ రుణ రేట్ల‌ను 10 బేసిస్ పాయింట్ల మేర‌ (0.10 శాతం) త‌గ్గించ‌నున్న‌ట్లు బ్యాంకు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆర్‌బీఐ రెపో రేటును త‌గ్గించిన కొన్ని వారాల త‌ర్వాత బ్యాంకు వినియోగ‌దారుల‌కు బ‌దిలీ చేయ‌నుండ‌టం గ‌మ‌నార్హం. ఎంసీఎల్ఆర్ అన్ని కాల‌ప‌రిమితుల‌పై 0.10 శాతం ఎంసీఎల్ఆర్‌ త‌గ్గించ‌నుంది. ఈ రేట్లు స‌త్వ‌ర‌మే అందుబాటులోకి రానున్నాయి.

ఏడాది ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.65 శాతంగా ఉండ‌నుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు అన్ని ప్ర‌ధాన ప్రైవేటు బ్యాంకులు యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు కూడా జూన్‌లో వరుస‌గా 0.10 శాతం, 0.25 శాతం ఎంసీఎల్ఆర్ త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే. ఇత‌ర బ్యాంకులు కూడా ఈ విధంగా రుణ రేట్ల‌ను త‌గ్గించే అవ‌కాశం ఉంది.

జూన్ 6 న జ‌రిగిన స‌మీక్ష‌లో ఆర్‌బీఐ, బ్యాంకులు క‌నీసం 0.21 శాతం లేదా అంత‌కంటే ఎక్కువ‌గా రుణ రేట్ల‌ను త‌గ్గించాల‌ని సూచించింది. ఆర్‌బీఐ 2019 లో ఇప్ప‌టివ‌ర‌కు 0.75 శాతం రేట్ల‌లో కోత విధించింది. ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ ల‌క్ష్యం 4 శాతంగా నిర్ణ‌యించ‌గా, అంత‌కంటే త‌క్కువ‌గానే న‌మోద‌వుతుండ‌టంతో రుణ రేట్ల‌ను త‌గ్గించిన‌ట్లు పేర్కొంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly