జీఎస్‌టీఎన్ నుంచి త‌ప్పుకున్న ఐసీఐసీఐ బ్యాంక్‌

ప్రభుత్వ రంగ సంస్థగా మార్చాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ సంస్థ నుంచి నిష్క్రమించింది.

జీఎస్‌టీఎన్ నుంచి త‌ప్పుకున్న ఐసీఐసీఐ బ్యాంక్‌

ప్రైవేటు రంగ అతిపెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ జీఎస్‌టీ నెట్‌వ‌ర్క్ సంస్థ నుంచి నిష్క్ర‌మించిన‌ట్లు వెల్ల‌డించింది. ప‌రోక్ష ప‌న్నుల‌ను వ‌సూలు చేసే జీఎస్‌టీఎన్ నుంచి, బ్యాంకు 13 రాష్ర్ట ప్ర‌భుత్వాల‌కు 10 శాతం వాటాను విక్ర‌యించ‌డ ద్వారా త‌ప్పుకుంది.

గతేడాది జిఎస్‌టి నెట్‌వర్క్‌ను ప్రభుత్వ రంగ సంస్థగా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ సంస్థ నుంచి నిష్క్రమించింది. ఈ వాటా విక్ర‌యానికి మొత్తం కోటి రూపాయ‌ల న‌గ‌దును తీసుకుంది. అన్ని రాష్ర్టాల ప్ర‌భుత్వాల‌కు వాటా కేటాయింపు మార్చి, 2020 నాటికి పూర్త‌వుతోంద‌ని తెలిపింది.

తెలంగాణ‌, అస్సాం రాష్ర్టాల‌కు 0.14 శాతం చొప్పున కేటాయించింది. గోవా, కేర‌ళ‌, మ‌ణిపూర్‌, త్రిపుర‌, ప‌శ్చిమ బెంగాల‌, దిల్లీ, ఝార్ఖండ్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాల‌కు 0.82 అఆతం చొప్పిన వాటాను కేటాయించింది. గతేడాది జిఎస్‌టి నెట్‌వర్క్‌ను ప్రభుత్వ రంగ సంస్థగా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ సంస్థ నుంచి నిష్క్రమించింది. ప్ర‌భుత్వం నిర్ణయం ప్రకారం, జిఎస్టి నెట్‌వర్క్‌లో 50 శాతం వాటాను కేంద్రం సొంతం చేసుకుంటుంది, మిగ‌తా వాటా ప్రో-రేటా ప్ర‌తిపాదిక‌న‌ రాష్ట్రాలు కలిగి ఉంటాయి.

ప్ర‌స్తుతం జీఎస్‌టీఎన్‌లో కేంద్రం, రాష్ర్టాలు 49 శాతం వాటాను క‌లిగి ఉంది. మిగ‌తా 51 శాతం వాటాను 5 ప్రైవేటు ఆర్థిక సంస్థ‌లు -హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్ఎస్ఈ స్ర్టాట‌జిక్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ క‌లిగి ఉన్నాయి.

మార్చి 28, 2013 లో జీఎస్‌టీఎన్ ఒక ప్రైవేట్ సంస్థ‌గా ప్రారంభ‌మైంది. ఈ సంస్థ ద్వారా ఎటువంటి లాభం రావ‌డం లేదు. ప్రైవేటు కంపెనీల‌కు వాటా ఇవ్వ‌డం ద్వారా ఈ కంపెనీపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. నిర్మాణాత్మ‌క మార్పులు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఏదేమైనా, సంస్థలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ద్వారా కార్యాచరణ స్వేచ్ఛ ల‌భిస్తుంద‌ని అప్ప‌టి ప్ర‌భుత్వం భావించింది. గ‌తేడాది జులై 1 న దాని స్థానంలో జీఎస్‌టీ… కేంద్ర‌, రాష్ర్టాల ప‌న్నును ఏక‌తాటిపైకి తీసుకొచ్చింది.
జీఎస్‌టీఎన్ పోర్ట‌ల్‌లో రిట‌ర్నులు దాఖ‌లు చేసేట‌ప్పుడు స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో విమ‌ర్శ‌లు వెల్లువెతాయి. అందుకే ప్రభుత్వ రంగ సంస్థగా మార్చాలని ప్ర‌భుత్వం భావిస్తోంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly