ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు త‌క్ష‌ణ వాహ‌న రుణాలు

వాహనం ఆన్‌ రోడ్‌ ధరపై 100 శాతం రుణం స‌దుపాయంతో త‌క్ష‌ణ వాహ‌న రుణాల‌ను ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు త‌క్ష‌ణ వాహ‌న రుణాలు

దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ త‌మ ఖాతాదారుల‌కు తక్షణ కారు, ద్విచక్ర వాహన రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత బ్యాంక్‌ ఖాతాదారులకు క్షణాల్లో తుది రుణ మంజూరు పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ‘ఇన్‌స్టా ఆటో లోన్‌’ పేరిట 20 ల‌క్ష‌ల‌ ఖాతాదారుల‌కు ఏడు సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితో గ‌రిష్టంగా రూ.20 ల‌క్ష‌ల‌ కారు రుణం తక్షణమే మంజూరు చేయనున్న‌ట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. అదేవిధంగా ‘ఇన్‌స్టా టూ-వీలర్‌ లోన్‌’ పేరుతో 1.20 కోట్ల మంది ప్రీ అప్రూవ్డ్‌ ఖాతాదారులకు , 3 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు ద్విచక్రవాహ న రుణం అందించనుంది. ఈ రెండు పథకాలు వాహనం ఆన్‌ రోడ్‌ ధరపై 100 శాతం రుణం ఇస్తాయని బ్యాంక్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. తుది రుణ మంజూరు ప‌త్రం 15 రోజుల వ‌ర‌కు చెల్లుబాటు అవుతుంది. ఖాతాదారుడు దేశంలో త‌మ‌కు న‌చ్చిన డీల‌ర్ వ‌ద్ద‌ వాహ‌నాన్ని ఎంపిక చేసుకుని, సంబంధిత తుది ప‌త్రాల‌ను అందించి రుణం పొంద‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఈ మొత్తం ప్రాసెస్ పూర్తై రుణం మంజూరు కావ‌డానికి కొన్ని రోజుల వ్య‌వ‌ధి ప‌ట్టేద‌ని, ఈ కొత్త‌ విధానంలో కొన్ని ప‌నిగంట‌ల‌లో రుణం పొందే వెసులుబాటు క‌ల్పించిన‌ట్లు బ్యాంక్ తెలిపింది. డేటా విశ్లేష‌ణ‌, సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించుకుని, బ్యాంకు ఖాతాదారుల‌కు వివిధ ర‌కాల త‌క్ష‌ణ సేవ‌ల‌ను అందిస్తుంది. దేశంలోనే మొట్ట‌మొద‌టి సారి త‌క్ష‌ణ‌(ఇన్‌స్టంట్) క్రెడిట్ కార్డుల‌ను ప్ర‌వేశ పెట్టింది. అదేవిధంగా త‌క్ష‌ణ వ్య‌క్తిగ‌త రుణం, పేలేట‌ర్ అని పిలిచే త‌క్ష‌ణ డిజిట‌ల్ క్రెడిట్‌, ఎమ్ఎస్ఎమ్ఈ ల‌కు త‌క్ష‌ణ ఓవర్ డ్రాఫ్ట్ సౌక‌ర్యం, త‌క్ష‌ణ‌మే ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ ఖాతాను తెరిచే స‌దుపాయం మొద‌లైన సేవ‌ల‌ను అందిస్తున్న‌ట్లు బ్యాంక్ తెలిపింది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

(Source: Livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly