స్మార్ట్ ఈఎమ్ఐ సౌక‌ర్యంతో..కొత్త కారు రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తున్న ఐసీఐసీఐ

దేశంలోనే మొట్ట‌మొద‌టి సారిగా ఐసీఐసీఐ బ్యాంక్ స్మార్ట్ ఈఎమ్ఐ స‌దుపాయంతో కారు రుణాల‌ను అందిస్తుంది

స్మార్ట్ ఈఎమ్ఐ సౌక‌ర్యంతో..కొత్త కారు రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తున్న ఐసీఐసీఐ

ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ కొత్త కారు రుణాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆటోమొబైల్ లీజింగ్ అండ్ మొబిలిటీ సొల్యూషన్స్ సంస్థ ట్రాన్జ్‌లీజ్ సహాకారంతో ఐసీఐసీఐ బ్యాంక్ ఈ రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తుంది. ‘స్మార్ట్ ఈఎమ్ఐ’ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ రుణాల‌తో వినియోగ‌దారులు త‌క్కువ ఖ‌ర్చుతో కొత్త కారును కొనుగోలు చేయ‌వ‌చ్చు. అంతేకాకుండా రుణ కాల‌వ్య‌వ‌ధిలో కారు బీమా, నిర్వ‌హ‌ణ వంటి అవ‌స‌రాలను ఐసీఐసీఐ బ్యాంక్ చూసుకుంటుంది. దీని గురించి కొనుగోలుదారులు ఆలోచించ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

‘స్మార్ట్ ఈఎమ్ఐ’స‌దుపాయంతో ఫైనాన్సింగ్‌, ఇన్సురెన్స్‌, నిర్వ‌హ‌ణ వంటి వాటి గురించి ఆందోళ‌న చెంద‌కుండా ఈ వినూత్న ప‌ద్ధ‌తిలో కారు కొనుగోలు చేయ‌డం ద్వారా కారు కొనుగోలుదారుల‌కు ప్ర‌త్యేక‌మైన అనుభ‌వాన్ని అందించ‌డం సంతోషంగా ఉంద‌ని, భాగ‌స్వామ్య ఐసీఐసీఐ బ్యాంక్ సెక్యూరీటీస్ ఎసెట్స్ హెడ్ ర‌వి నారాయ‌ణ‌న్ తెలిపారు.

ట్రాన్జ్‌లీజ్ ఎండి & సీఈఓ అనింద్య చక్రవర్తి మాట్లాడుతూ, “వినియోగదారులు కారు కొనుగోలు చేయాల‌నుకుంటున్న‌ప్ప‌టికీ, సంబంధిత ఇబ్బందులు, నష్టాలు, నిర్వ‌హ‌ణ వ్య‌యాలు, రీసేల్ వంటి వాటి గురించి ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి వాటి గురించి ఆలోచించే వారికి ప్ర‌స్తుతం, ‘స్మార్ట్ ఈఎమ్ఐ’ ప‌రిష్కారంగా నిలుస్తుంద‌ని అన్నారు.

ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తున్న స్మార్ట్ ఈఎమ్ఐ కారు రుణాల గురించిన 10 ముఖ్య విష‌యాలు:

  1. సాధార‌ణ కారు రుణ ఈఎమ్ఐ కంటే స్మార్ట్ ఈఎమ్ఐ త‌క్కువ‌గా ఉంటుంది. ఇందుకు కార‌ణం కారు రీసేల్ విలువ‌ను ముందుగానే త‌గ్గించి రుణం ఇస్తారు.
  2. ఇందులో వినియోగ‌దారులు రెండు ర‌కాలుగా కారును కొనుగోలు చేయ‌వ‌చ్చు. ముందుగా నిర్ణ‌యించిన రీసేల్ విలువ‌ను కాల‌వ్య‌వ‌ధి ముగిసిన త‌రువాత చెల్లించ‌డం ద్వారా కారును సొంత చేసుకోవ‌డం మొద‌టి ప‌ద్ధ‌తి. లేదా కాల‌వ్య‌వ‌ధి ముగిసిన అనంత‌రం కారును లీజింగ్ సంస్థ‌కు అప్ప‌గించ‌డం రెండో ప‌ద్ధ‌తి.
  3. రుణ కాల‌వ్య‌వ‌ధి ముగిసిన అనంత‌రం కారును వెన‌క్కి ఇచ్చేస్తే, వినియోగ‌దారులు ప్ర‌త్యేక బోన‌స్ పొంద‌వ‌చ్చు.
  4. ప్ర‌స్తుతం ఈ ఆఫ‌ర్ కార్పొరేట్లు, ఉద్యోగం చేస్తున్న వేత‌న జీవుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది. త్వ‌ర‌లోనే స్వ‌యం ఉపాది పొందుతున్న వినియోగ‌దారుల‌కు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
  5. ప్ర‌స్తుతం ఈ స‌దుపాయం ముంబాయి, ధిల్లీ-ఎస్‌సీఆర్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంది.
  6. త్వర‌లోనే పూణే, బెంగుళూరు, హైద‌రాబాద్‌, చెన్నై న‌గ‌రాల‌లో కూడా అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు సంస్థ తెలిపింది.
  7. ఐసీఐసీఐ బ్యాంకు సంప్ర‌దించి వినియోగ‌దారులు ఈ స‌దుపాయాన్ని పొంద‌వ‌చ్చు.
  8. వినియోగ‌దారులు త‌మ అభిరుచి అనుగుణంగా కారును ఎంపిక చేసుకోవ‌చ్చు. సాధార‌ణ ఆటో రుణాలు పోల్చి చూడ‌డంతో పాటు, వివిధ ఈఎమ్ఐ ఆఫ్ష‌న్లు అందుబాటులో ఉన్నాయి.
  9. కారును ఎంపిక చేసుకున్న అనంత‌రం ‘స్మార్ట్ ఈఎమ్ఐ’ కోసం +91-8130680080 నెంబ‌రుకు కాల్ చేయ‌వ‌చ్చు.
  10. కారు డెలివ‌రీ చేసిన అనంతరం ‘స్మార్ట్ ఈఎమ్ఐ’ వినియోగ‌దారుల‌కు ప‌ర్స‌న‌లైజ్డ్ కారు పోర్ట‌ల్‌ను అందిస్తుంది. దీని ద్వారా వినియోగ‌దారులు కారు కొనుగోలు చేసిన తేది నుంచి కాల‌వ్య‌వ‌ధి పూరైయ్యే వ‌ర‌కు కారును నిర్వ‌హించ‌వ‌చ్చు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly