'ఐబాక్స్‌'తో ఇక ఎప్పుడైనా డెబిట్, క్రెడిట్ కార్డులు పొంద‌వ‌చ్చు...

బ్యాంకు మూసివేసిన త‌ర్వాత‌, సెల‌వు దినాల్లో కూడా వెళ్లి మీరు క్రెడిట్, డెబిట్ కార్డుల‌ను డెలివ‌రీ తీసుకోవ‌చ్చు

'ఐబాక్స్‌'తో ఇక ఎప్పుడైనా డెబిట్, క్రెడిట్ కార్డులు పొంద‌వ‌చ్చు...

ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా త‌మ వినియోగ‌దారుల కోసం వినూత్నమైన ‘ఐబాక్స్’ సేవ‌ల‌ను ఆవిష్కరించింది. అంటే బ్యాంకు స్వ‌యంగా వినియోగారులకు క్రెడిట్, డెబిట్ కార్డుల‌ను, చెక్ బుక్‌ల‌ను డెలివ‌రీ చేయ‌నుంది. వీటి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారు ఎప్పుడైనా బ్యాంకుకు వెళ్లి ‘ఐబాక్స్’ ద్వారా త‌మ‌కు వ‌చ్చిన కార్డు లేదా చెక్‌బుక్‌ను తీసుకోవ‌చ్చు. దీంతో కస్టమర్లకు ఎంతో ప్రయోజనం కలుగనుంది. వినియోగ‌దారులు ద‌గ్గ‌ర‌లో ఉన్న బ్యాంకుకు మీకు అనుకూలంగా ఉన్న స‌మ‌యంలో నేరుగా వెళ్లి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, చెక్ బుక్ వంటి వాటిని ‘ఐబాక్స్’ వ‌ద్ద రిక‌వ‌రీ చేసుకోవ‌చ్చు. ఈ స‌దుపాయం 24 గంట‌లు, సెల‌వు దినాల్లో కూడా అందుబాటులో ఉంటుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ ‘ఐబాక్స్’ తో ప్ర‌యోజ‌నాలు…

  1. 'ఐబాక్స్‌’తో 24 గంట‌లు ఎప్పుడైనా వినియోగ‌దారుల‌కు వీలు క‌లిగిన‌ప్పుడు వెళ్లి త‌మ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు.
  2. డెబిట్, క్రెడిట్ కార్డులు, చెక్ బుక్ వంటివి సెల‌వు దినాల్లో కూడా ‘ఐబాక్స్’ వ‌ద్ద పొంద‌వచ్చు.
  3. బ్యాంకుల వ‌ద్ద ఈ ‘ఐబాక్స్’ కేంద్రాల‌ను ఏర్పాటుచేశారు. బ్యాంకులు మూసివేసిన త‌ర్వాత కూడా ఇక్క‌డ మీరు వెళ్లి డెలివ‌రీ తీసుకోవ‌చ్చు.
  4. మీ ప్యాకేజ్ స్టేట‌స్ ఎప్ప‌టిక‌ప్పుడు ఎస్ఎంఎస్ రూపంలో మీకు వ‌స్తుంది.
  5. మీ ప్యాకేజ్ ‘ఐబాక్స్’ ట‌ర్మిన‌ల్ వ‌ద్ద‌కు చేరిప్పుడు, ఎస్ఎంఎస్ అల‌ర్ట్ వినియోగ‌దారులకు చేరుతుంది. ఇందులో ‘ఐబాక్స్‌’ జీపీఎస్ లొకేష‌న్ , క్యూ ఆఆర్ కోడ్, ఓటీపీ ఉంటుంది.
  6. వినియోగ‌దారులు ‘ఐబాక్స్’ వ‌ద్ద‌కు వెళ్లి న‌మోదిత మొబైల్ నంబ‌ర్, ఓటీపీ ఎంట‌ర్ చేయాలి లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ‘ఐబాక్స్’ ఓపెన్ అవుతుంది. మీ ప్యాకేజ్‌ను తీసుకోవ‌చ్చు.
  7. ‘ఐబాక్స్’ లోకి చేరి ఏడు రోజుల వ‌ర‌కు మీ ప్యాకేజ్ అందుబాటులో ఉంటుంది. ఏడు రోజుల్లోపు వినియోగ‌దారుడు వెళ్లి తెచ్చుకోవాలి.
  8. బ్యాంకులు బిజీగా ఉన్న స‌మ‌యాల్లో వెళ్లి స‌మ‌యం వృథా చేసుకోకుండా వినియోగ‌దారులకు ఈ సేవ‌లు సౌక‌ర్యాన్ని క‌లిగిస్తాయి.
  9. ప్ర‌స్తుతం దిల్లీ ఎన్‌సీఆర్, ముంబ‌యి, చెన్నై, కోల్‌కత్తా, బెంగుళూరు, హైద‌రాబాద్, పుణె, సూర‌త్, జైపూర్, ఇండోర్, బోపాల్, ల‌క్నో, నాగ్‌పూర్, అమృత్‌స‌ర్‌, లుథియానా వంటి 17 న‌గ‌రాల్లో ఐసీఐసీఐ బ్యాంకు శాఖ‌ల్లో ఈ ‘ఐబాక్స్’ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి.
  10. ముఖ్యంగా ప‌ని దినాల్లో త‌మ‌ బ్యాంక్ ప్రొడక్టులను (క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, చెక్ బుక్ వంటివి) డెలివరీ తీసుకోవడానికి ఇంట్లో లేని పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ ‘ఐబాక్స్’ సేవలు ఉపయోగకరంగా ఉంటాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly