సైబర్ మోసాల‌కు ఐసీఐసీఐ ఇన్సూరెన్స్

ఐసీఐసీఐ లాంబార్డ్- మొబిక్విక్ క‌లిసి సైబ‌ర్ మోసాలకు బీమాను క‌ల్పించ‌నున్నాయి.

సైబర్ మోసాల‌కు ఐసీఐసీఐ ఇన్సూరెన్స్

ఐసీఐసీఐ లాంబార్డ్ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ కంపెనీ, డిజిటల్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ ప్లాట్‌ఫాం మొబిక్విక్‌తో క‌లిసి సైబ‌ర్-ఇన్సూరెన్స్ క‌వ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆన్‌లైన్ ద్వారా జ‌రుగుతున్న‌ అన‌ధికారిక, మోస‌పూరిత లావాదేవీలు నుంచి భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ఇది తోడ్ప‌డుతుంది. బ్యాంకు ఖాతాలు, డెబిట్, క్రెడిట్ కార్డులు, మొబైల్ వాలెట్ల ద్వారా జ‌రుగుతున్న సైబ‌ర్ మోసాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు ఈ నిర్ణ‌యం తోడ్ప‌డుతుంది. మొబిక్విక్ యాప్ ద్వారా సైబ‌ర్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకున్న వారికి ఈ పాల‌సీ అందుబాటులో ఉంటుంది. రూ.50 వేల వ‌ర‌కు రూ.99 చొప్పున నెల‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో యాప్ ద్వారా ఈ స‌దుపాయాన్నొ పొంద‌వ‌చ్చు. మొబిక్విక్ భాగ‌స్వామ్యంతో ఐసీఐసీఐ లాంబార్డ్ స‌రికొత్త ఉత్ప‌త్తుల‌ను పాల‌సీదారుల‌కు అందించేందుకు వీల‌వుతుందిని పేర్కొంది. రోజురోజుకి పెరుగుతున్న సైబ‌ర్ మోసాల నుంచి న‌ష్టాన్ని అరిక‌ట్టేందుకు ఇది తోడ్ప‌డుతుంద‌ని కంపెనీ తెలిపింది. మొబిక్విక్ వినియోగ‌దారులు యాప్ ద్వారా సైబ‌ర్-ఇన్సూరెన్స్ పాల‌సీని కొనుగోలు చేయ‌వ‌చ్చు. క్లెయిమ్‌ల‌ను కూడా డిజిట‌ల్ రూపంలోనే చేసుకోవ‌చ్చు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly