ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ లైఫ్ సూప‌ర్ యులిప్ తీసుకోవచ్చా.. లేదా?

సింగిల్‌, నెలవారిగా, ఆరు నెల‌ల‌కు, సంవ‌త్స‌రానికి ఒక‌సారి ప్రీమియం చెల్లించ‌వ‌చ్చు

ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ లైఫ్ సూప‌ర్ యులిప్ తీసుకోవచ్చా.. లేదా?

ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ లైఫ్ సూప‌ర్ యులిప్ . దీనిలో నెల‌కు, త్రైమాసికానికి, ఆరు నెల‌ల‌కు, సంవ‌త్స‌రానికి ప్రీమియం చెల్లించే అవ‌కాశం ఉంది. బీమా సంస్థ మీ పెట్టుబ‌డిని స్టాక్ మార్కెట్‌లో పెడుతుంది. అయితే మీరు క‌ష్ట‌ప‌డిన సంపాదించిన డ‌బ్బును ఎందులో పెట్టుబ‌డులు పెట్టాలో స‌రైన నిర్ణ‌యం తీసుకోవాలి. ఈక్విటీలు లేదా డెట్ ఫండ్లు లేదా రెండింటిలో పెడ‌తారా అనేది చాలా ముఖ్యం.

ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ లైఫ్ సూప‌ర్ ఫీచ‌ర్ల గురించి తెలుసుకుందాం…

 • 0-75 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉన్న‌వారు ఈ పాల‌సీ తీసుకోవ‌చ్చు
 • సింగిల్ ప్రీమియం అయితే మెచ్యూరిటీ వ‌య‌సు 80 సంవత్స‌రాలు . కానీ రెగ్యుల‌ర్‌గా చెల్లించేందుకు 75 సంవ‌త్స‌రాలు
 • సింగిల్ లేదా లిమిటెడ్ పేమెంట్ ఆప్ష‌న్స్ ఉన్నాయి. ఐదేళ్లు లేదా ప‌దేళ్ల‌పాటు ప్రీమియం చెల్లిస్తారు లేదా క్ర‌మ‌మైన చెల్లింపుల ఆప్ష‌న్స్ కూడా ఉన్నాయి.
 • సింగిల్‌, నెలవారిగా, ఆరు నెల‌ల‌కు, సంవ‌త్స‌రానికి ఒక‌సారి ప్రీమియం చెల్లించ‌వ‌చ్చు
 • క‌నిష్టంగా రూ.2 ల‌క్ష‌లు, గ‌రిష్ఠంగా ఎంతైనా ప్రీమియం అవ‌కాశం ఉంటుంది

గ‌రిష్ఠ బీమా హామీ ఆప్ష‌న్‌

 • సింగిల్ ప్రీమియం 0-41 సంవ‌త్స‌రాల వ‌ర‌కు, ప్రీమియంపై 10 రెట్లు
 • సింగిల్ ప్రీమియం, 42 సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ వ‌య‌సు వారికి మొత్తం ప్రీమియంపై 1.25 రెట్లు
 • బీమా హామీ ప్రీమియం కంటే 10 రెట్లు త‌క్కువ‌గా ఉంటే మెచ్యూరిటీ త‌ర్వాత ఎటువంటి అద‌న‌పు ప్ర‌యోజ‌నం ఉండ‌దు

ఇక‌ ఈ పాల‌సీ కొనుగోలు చేయాలా వ‌ద్దా అన్న విష‌యానికొస్తే ఇందులో పెట్టుబ‌డులు చేయ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. ఎందుకంటే దీనిపై మూడు ర‌కాల ఛార్జీలు వ‌ర్తిస్తాయి.

 • ప్రీమియం కేటాయింపు ఛార్జీలు -3 శాతం
 • సంవ‌త్స‌రానికి ఒక‌సారి ప్రీమియం చెల్లిస్తే ఛార్జీలు - ఏడాది నుంచి 5 ఏళ్ల‌కు 5 శాతం, ఆరేళ్ల నుంచి ఏడేళ్ల వ‌ర‌కు 3 శాతం, ఆ త‌ర్వాత నుంచి 2 శాతం మేర ఛార్జీలు వ‌ర్తిస్తాయి.

ప్రీమియం కేటాయింపు ఛార్జీలు మీ పెట్టుబ‌డుల‌ను వివిధ ఫండ్ల‌లో పెట్టేందుకు కంపెనీ తీసుకుంటుంది. ఏజెంట్లు మీకు కాల్ చేసినందుకుగాను, ఇంటికి వ‌చ్చి పాల‌సీల గురించి వివ‌రించినందుకుగాను క‌మీష‌న్లు తీసుకుంటారు. సంవ‌త్స‌రానికి ఒక‌సారి రూ.2,00,000 ప‌దేళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే, కంపెనీ ప్రీమియం కేటాయింపు కోసం తీసుకునే ఛార్జీలు ఎలా ఉంటాయో చూద్దాం…

 • ఏడాది నుంచి ఐదేళ్ల‌కు సంవ‌త్స‌రానికి రూ.10,000 అంటే ఐదేళ్ల‌కు రూ.50,000
 • ఆరేళ్ల నుంచి ఏడేళ్ల వ‌ర‌కు, సంవ‌త్స‌రానికి రూ.6,000 అంటే రెండేళ్ల‌కు రూ.12,000
 • ఎనిమిదేళ్ల నుంచి ప‌దేళ్ల వ‌ర‌కు, సంవ‌త్స‌రానికి రూ.4 వేలు అయితే, మూడేళ్ల‌కు రూ.12,000
  అంటే మీరు రూ.20 ల‌క్ష‌ల ప్రీమియంకు రూ.74,000 ప‌దేళ్ల‌లో చెల్లించాలి. అంటే మీ ప్రీమియం నుంచి 3.7 శాతం నేరుగా ఏజెంట్ క‌మీషన్‌గా వెళ్తుంది.

పాల‌సీ అడ్మినిస్ర్టేష‌న్ ఛార్జీలు:
పాల‌సీ అడ్మినిస్ర్టేష‌న్ చార్జీలు ప్ర‌తి నెల మీరు తీసుకునే యూనిట్ల‌ను బ‌ట్టి ఉంటుంది

 • సింగిల్ ప్రీమియంలో నెల‌కు రూ.60 (సంవ‌త్స‌రానికి రూ.720) మొద‌టి అయిదు సంవ‌త్స‌రాల‌కు,

 • సింగిల్ పే కాకుండా అయితే నెల‌కు రూ.350 ( సంవ‌త్స‌రానికి రూ.4,200) మొత్తం పాల‌సీ కాలానికి

 • ప‌దేళ్ల‌కు రెగ్యుల‌ర్ పే పాల‌సీ అయితే రూ.42,000 పాల‌సీ అడ్మినిస్ర్టేటివ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
  అంటే మొత్తం రూ.74,000 + రూ.42,000 = రూ. 1,16,000
  ప‌దేళ్ల‌కు రూ.20 ల‌క్ష‌ల ప్రీమియంలో 5.8 శాతం ఛార్జీలు వ‌ర్తిస్తాయి.
  ఇక్క‌డితో అయిపోలేదండోయ్ ఇంకా మోర్టాలిటీ ఛార్జీలు ఉన్నాయి

  మోర్టాలిటీ ఛార్జీలు:
  40 సంవ‌త్స‌రాలు గ‌ల పురుఘల‌కు మోర్టాలిటీ ఛార్జీలు బీమా హామీ ప్ర‌తి వెయ్యి రూపాయ‌ల్లో 1.81 శాతం ఉంటుంది. రూ.20 ల‌క్ష‌ల బీమా హామీ ఉంటే సంవ‌త్స‌రానికి మోర్టాలిటీ ఛార్జీలు రూ.3,620. ఫండ్ విలువ పెరిగినా కొద్ది ఛార్జీలు త‌గ్గుతాయి.

  ఫండ్ మేనేజ్‌మెంట్ ఛార్జీలు:
  అన్ని ఈక్విటీ పెట్టుబ‌డులకు ఛార్జీలు రూ.1.35 శాతం వ‌ర‌కు ఉంటాయి. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో డైరెక్ట్ ప్లాన్‌ల‌లో అయితే 0.35 శాతం నుంచి 6 శాతం మేర‌కు ఎక్కువ‌గా ఉంటాయి. ఇండెక్స్ ఫండ్ల‌లో 1 శాతం ఎక్కువ‌గా ఉంటుంది. మ‌రి ప్ర‌తి ఏడాది ప్రీమియం నుంచి 6 శాతం ఈ ఛార్జీలు వ‌ర్తించే ఈ పాల‌సీని కొనుగోలు చేస్తారా. ఫండ్ ప‌నితీరు అత్య‌ద్బుతంగా ఉంటే త‌ప్ప దీనికి ఎవరు అంగీక‌రించ‌రు .

మ‌రి ఫండ్ ప‌నితీరు ఎలా ఉంటుంది?
యులిప్స్ , మ్యూచువ‌ల్ ఫండ్ల మాదిరిగానే ఉంటాయి. కాని రెండింటికి చాలా తేడా ఉంటుంది. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మొత్తం పెట్టుబ‌డుల‌కే కేటాయిస్తారు, ఫండ్ మేనేజ్‌మెంట్ ఛార్జీలు వ‌ర్తిస్తాయి. అదే యులిప్స్‌లో అయితే ప్రీమియం కేటాయింపు ఛార్జీలు, పాల‌సీ అడ్మినిస్ర్టేష‌న్ ఛార్జీలు, మోర్టాలిటీ ఛార్జీలు ఇలా చాలా ఉంటాయి. ఎన్ఏవి 10% రాబడిని అందిస్తున్నందున, మీ పెట్టుబడి కూడా 10% రాబడిని ఇస్తుందని అనుకోకండి. ఎందుకంటే మొత్తం పెట్టుబడి పెట్టనందున ఇది 7% రాబడిని మాత్రమే ఇవ్వవచ్చు.

రాబ‌డి:
బ్లూచిప్, మ్యాగ్జిమైజ‌ర్ ఆప్ష‌న్ల ప‌నితీరు 2009, 2011 లో ప్రారంభించిన నాటినుంచి 7.6 శాతం, 10.95 శాతంగా ఉంది . అంటే మొత్తానికి 6 నుంచి 8 శాతానికంటే ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం లేదు.

చివ‌ర‌గా…
యులిప్స్‌తో ఉండే మ‌రో ప్రధాన స‌మ‌స్య ఫండ్ ప‌నితీరు ఎలా ఉన్నా దాని నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం లేదు. క‌నీసం 5 సంవ‌త్స‌రాలు పెట్టుబ‌డిని కొన‌సాగించాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఆపేయాల‌నుకున్నా స‌రెండ‌ర్ ఛార్జీల‌ను చెల్లించాల్సి ఉంటుంది న‌గ‌దు కూడా నిలిపివేత ఖాతాలోకి వెళ్తుంది. అప్పుడు మీ పెట్టుబ‌డుల‌పై 4-5 శాతం వ‌ర‌కే రాబ‌డి ల‌భిస్తుంది. ఒక్కోసారి అంత‌కంటే త‌క్కువ‌గా ఉండ‌వ‌చ్చు. అందుకే ఈ ప్లాన్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌క‌పోవ‌డ‌మే మేలు అని చెప్తున్నారు ఆర్థిక స‌ల‌హాదారులు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly