డ‌యాబెటీస్ ఉన్న వారికీ.. ట‌ర్మ్ పాల‌సీ..

కుటుంబంలో సంపాదించే వ్య‌క్తి మ‌ర‌ణం వ‌ల్ల ఆ కుంటుంబ ఆర్థికంగా ర‌క్ష‌ణ కోల్పోకుండా ట‌ర్మ్ ఇన్సురెన్స్ స‌హాయ‌ప‌డుతుంది.

డ‌యాబెటీస్ ఉన్న వారికీ.. ట‌ర్మ్ పాల‌సీ..

డ‌యాబెటీస్‌, ర‌క్త‌పోటు వంటి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో భాధ‌ప‌డుతున్నవారు ట‌ర్మ్ పాల‌సీ ల‌భించ‌డం క‌ష్ట‌మే. ప్రైవేట్ జీవిత బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రొడ‌న్షియ‌ల్ లైఫ్ ఇన్సురెన్స్ , బీమా ప‌రిశ్ర‌మ‌లో మొట్ట‌మొద‌టి స‌రిగా తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి కోలుకున్న వారికి, జీవ‌న‌శైలి వ్యాధుల‌తో భాధ‌ప‌డుతున్న వారికి కూడా ట‌ర్మ్ పాల‌సీని విడుద‌ల చేసింది. ఊబ‌కాయం, డ‌యాబెటీస్‌, కొల‌స్ట్రాల్‌, అధిక రక్త‌పోటు, ఉబ్బ‌సం వంటి అనారోగ్య స‌మస్య‌లు ఉన్న‌వారికి ప్ర‌యోజ‌నం చేకూర్చేలా పాల‌సీని రూపొందించారు. తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లైన క్యాన్స‌ర్ నుంచి విజ‌య‌వంతంగా కోలుకున్న వారు లేదా యాంజియోప్లాస్టీ లేదా ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ వంటి క్లిష్ట‌మైన శ‌స్త్ర చికిత్స‌లు చేయించుకుని ఆరోగ్య వంతులైన వారు కూడా ఈ పాల‌సీకి అర్హులే.

కుటుంబంలో సంపాదించే వ్య‌క్తి మ‌ర‌ణం వ‌ల్ల ఆ కుంటుంబ ఆర్థికంగా ర‌క్ష‌ణ కోల్పోకుండా ట‌ర్మ్ ఇన్సురెన్స్ స‌హాయ‌ప‌డుతుంది. ఐసీఐసీఐ ప్రూ ప్రీసియ‌స్ లైఫ్ ఒక వినూత్న జీవిత బీమా పాల‌సీ. వివిధ ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా వినియోగ‌దారులు జీవిత బీమా ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోకుండా చూడ‌డ‌మే కాకుండా, త‌గిన క‌వ‌ర్‌ను అంద‌జేస్తుంది.

ఫీచ‌ర్లు:
వినియోగదారుని ర‌క్షణ కోసం ఐసీఐసీఐ ప్రూ ప్రీసియ‌స్ లైఫ్ రెండు ర‌కాల ట‌ర్మ్ క‌వ‌ర్ల‌ను ఆఫ‌ర్ చేస్తుంది. 1. లైఫ్ ఆప్ష‌న్‌, 2. లైఫ్ ప్ల‌స్ ఆప్ష‌న్‌. లైఫ్ పాల‌సీలో పాల‌సీదారుడు అనుకోకుండా మ‌ర‌ణిస్తే, నామినీకి హామీ మొత్తం అంద‌జేస్తారు. లైఫ్ ప్ల‌స్‌లో డెత్‌బెనిఫిట్‌తో పాటు పాల‌సీదారునికి యాక్సిడెంట‌ల్ డెత్‌బెనిఫిట్ కూడా క‌వ‌ర్ అవుతుంది.
icici1.jpg

అర్హ‌త:
18 నుంచి 60 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు గ‌ల వారు ఐసీఐసీఐ ప్రూ ప్రీసియ‌స్ లైఫ్ పాల‌సీ తీసుకోవ‌చ్చు.

ప్రీమియం:
పాల‌సీదారుల‌కు మూడు ర‌కాల పేమెంట్ ఆప్ష‌న్‌లు అందుబాటులో ఉన్నాయి. 1. సింగిల్ పే, 2. లిమిటెడ్ పే, 3.రెగ్యుల‌ర్ పే. ఈ మూడింటిలో ఏ విధానాన్ని ఎంచుకుంటే దాని ప్ర‌కారం పాల‌సీదారులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది 5 నుంచి 40 సంవ‌త్స‌రాల‌కు మారుతూ ఉంటుంది.
icici2.jpg
కాల‌వ్య‌వ‌ధి లోపుగా ప్రీమియంలు చెల్లిస్తే, పాల‌సీ కాల‌వ్య‌వ‌ధి ముగిసే వ‌ర‌కు ప్ర‌యోజ‌నాలు కొన‌సాగుతాయి. పాల‌సీదారులు నెలవారీ, అర్ధ వార్షిక లేదా వార్షిక ప్రీమియంలు చెల్లించే అవకాశం కూడా ఉంది. ఐసిఐసిఐ ప్రూ ప్రీసియ‌స్ పాల‌సీ కింద ప్రయోజనాలను పొందటానికి పాలసీదారు చెల్లించాల్సిన కనీస ప్రీమియం రూ. 2,400.

హామీ మొత్తం:
ఈ పాల‌సీ కింద క‌వ‌ర్ అయ్యే క‌నీస హామీ మొత్తం రూ.2 ల‌క్ష‌లు, బోర్డు ఆమోదించిన పూచీక‌త్తు విధానంపై గ‌రిష్ట హామీ మొత్తం ఆధార‌ప‌డి ఉంటుంది. యాక్సిడెంట‌ల్ డెత్ బెనిఫిట్ క‌నీస హామీ మొత్తం రూ.1 ల‌క్ష‌. పాల‌సీదారుడు ఎంచుకున్న హామీ మొత్తాన్ని గ‌రిష్టంగా అంద‌జేస్తారు. ఈ పాల‌సీల‌పై మెచ్యూరిటీ, పేయిడ్ అప్ వాల్యు, చివ‌రికి జీవించి ఉంటే ఎటువంటి మ‌నుగ‌డ ప్ర‌యోజ‌నం వ‌ర్తించ‌వు.

నేటి స‌మాజంలో అధిక శాతం ప్ర‌జ‌లు జీవ‌నశైలి సంబంధిత వ్యాధులు, ఇత‌ర రుగ్మ‌త‌ల‌తో భాత‌ప‌డుతున్నారు. ఈ విభాగాల‌లోని వారికి ట‌ర్మ్ పాల‌సీ వంటి జీవిత బీమా క‌వ‌ర్‌ని పొంద‌డం క‌ష్ట‌మ‌వుతుంది. అందువ‌ల్ల వారు, వారి కుటుంబాలు ఆర్థిక భ‌రోసాని పొంద‌లేక‌పోతున్నార‌ని ఐసీఐసీఐ ప్రొడ‌న్షియ‌ల్ లైఫ్ ఇన్సురెన్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ పుణీత్ నంద అభిప్రాయ‌ప‌డ్డారు.

డెత్‌బెనిఫిట్ ఆఫ్ష‌న్లు:
ఐసీఐసీఐ ప్రూ ప్రీసియ‌స్ లైఫ్ ఇన్సురెన్స్ డెత్ బెనిఫిట్ మొత్తాన్ని వివిధ ర‌కాలుగా పొందేందుకు వీలుకల్పిస్తుంది. పాల‌సీదారులు వారికి అనువైన‌ విధానాన్ని ఎంపిక చేసుకోవ‌చ్చు. ఐసీఐసీఐ ప్రూ ప్రీసియ‌స్ లైఫ్ పాల‌సీదారులు, ఏక‌మొత్తంగా (లంప్స‌మ్), నెల‌వారి ఆదాయంగా(ఇన్‌క‌మ్‌), కొంత భాగాన్ని ఏక‌మొత్తంగా మిగిలిన‌ది నెల‌వారి ఆదాయంగా, ఆదాయంలో పెరుగుద‌ల(ఇంక్రీజింగ్ ఇన్‌క‌మ్) ఉండేట‌ట్లు… మొద‌లైన ఆప్ష‌న్ల‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు.

లంప్స‌మ్ విధానంలో, పాల‌సీదారుడు మ‌ర‌ణించిన‌ప్పుడు హామీ మొత్తాన్ని ఏక మొత్తంగా నామినీకి అంద‌జేస్తారు. ఇన్‌క‌మ్ విధానంలో మ‌ర‌ణ ప్ర‌యోజ‌నాన్ని స‌మాన వాయిదాలుగా విభ‌జించి 5,10,లేదా 15 సంవ‌త్స‌రాల(పాల‌సీ కొనుగోలు చేసిన‌ప్పుడు పాల‌సీదారుడు ఎంచుకున్న స‌మ‌యానికి అనుగుణంగా) పాటు చెల్లిస్తారు.

ఒక‌వేళ లంప్స‌మ్ అండ్ ఇన్‌క‌మ్ ఆప్ష‌న్ ఎంచుకుంటే, కొంత శాతం డెత్‌బెనిఫిట్‌ను ఏక‌మొత్తంగా చెల్లించి, మిగిలిన బ్యాలెన్స్‌ను వాయిదాల ప‌ద్ధ‌తిలో నెల‌వారీగా చెల్లిస్తారు. ఇక ఇంక్రీజింగ్ ఇన్‌క‌మ్ ఆప్ష‌న్‌లో మ‌ర‌ణ ప్ర‌యోజ‌న మొత్తాన్ని మొదటి సంవత్సరంలో వార్షికంగా 10శాతం ప్రయోజన మొత్తంతో ప్రారంభించి, సంవ‌త్స‌రానికి 10 శాతం చొప్పున పెంచుకుంటూ నెల‌వారీ వాయిదాల ప‌ద్ధ‌తిలో 10 సంత్స‌రాల పాటు చెల్లిస్తారు. ప్ర‌తీ సంవ‌త్స‌రం చెల్లించిన మొత్తాన్ని తీసివేయ‌గా మిగిలిన మొత్తానికి సాధార‌ణ వ‌డ్డీని క‌లుపుతారు. ఒకవేళ పాల‌సీదారుడు ఇంక్రీజింగ్ ఇన్‌క‌మ్ ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే, పాల‌సీ క్లెయిమ్ చేసే స‌మ‌యంలో, నామినీ త‌న నెల‌వారీ ఆదాయంలో కొంత భాగాన్ని ఏక మొత్తంగా పొందే విధంగా… మార్పు చేసుకునే వీలుంది. డెత్‌బెనిఫిట్ చెల్లింపును ఎంచుకునే విధానంపై కూడా ప్రీమియం ఆధార‌ప‌డి ఉంటుంది.

ప‌న్ను ప్ర‌యోజ‌నాలు:
బీమా ప్ర‌యోజ‌నం కోసం చెల్లించే మొత్తం ప్రీమియంపై ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly