ఎన్ఆర్ఐ ల‌కు పేప‌ర్ ర‌హిత ఖాతాలు

ఎన్‌ఆర్‌ఐ-ఇన్‌స్టా-ఆన్‌లైన్ ఖాతా పేరుతో ఐడీబీఐ బ్యాంక్ ఈ సేవ‌ల‌ను ప్రారంభించింది.

ఎన్ఆర్ఐ ల‌కు పేప‌ర్ ర‌హిత ఖాతాలు

ప్ర‌వాస భార‌తీయులు (ఎన్ఆర్ఐ) ఎలాంటి పేప‌ర్లు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేకుండా ఖాతా తెరిచే అవ‌కాశాన్ని ఐడీబీఐ బ్యాంకు క‌ల్పించింది. దాదాపు 40 దేశాల‌లో నివ‌శిస్తున్న ఎన్ఆర్ఐల‌కు ఈ సేవ‌లు అందుబాటులో ఉంచిన‌ట్లు ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. ఐడీబీఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ-ఇన్‌స్టా-ఆన్‌లైన్ పేరుతో ప్రారంభించిన ఖాతాల‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్‌)లో స‌భ్యత్వం ఉన్న దేశాల‌లో నివ‌సిస్తున్న ప్ర‌వాస భార‌తీయులు తీసుకోవ‌చ్చు. ఈ ఖాతాను తెరిచేందుకు అవ‌స‌రమైన ప‌త్రాలు, కేవైసీ ప్రూఫ్‌లు బ్యాంకుకు స్వ‌యంగా వ‌చ్చి ఇవ్వాల్సిన‌ అవ‌స‌రం లేదు. బ్యాంకులో ఖాతా తెర‌వాల‌కునే ఎన్ఆర్ఐలు వెబ్ మాడ్యూల్ ద్వారా బ్యాంక్ వెబ్ సైట్‌లో ఎన్ఆర్ఐ ఇన్‌స్టా-ఆన్‌లైన్‌ను యాక్సిస్ చేయోచ్చు. మీరు ఖాతా తెర‌వాల‌నుకుంటున్న బ్యాంకు బ్రాంచును ఎంపిక చేసుకుని స‌హాయ‌క ప‌త్రాలు అప్‌లోడ్ చేయాలి. స్కాన్ చేసిన ప‌త్రాల‌ను అప్‌లోడ్, వెరిఫికేష‌న్లు పూర్తైన త‌క్ష‌ణ‌మే ఖాతా తెరుస్తారు. ఖాతా తెరిచిన‌ట్లు ఎలక్ట్రానిక్ అడ్వైస్ ఖాతాదారునికి సందేశం ఇస్తుంది. ప్ర‌వాస భార‌తీయులు బ్యాంకుకు వ‌చ్చి ఖాతాను తెర‌వ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేకుండా, వినియోగ‌దారుడు సుల‌భంగా కార్య‌క‌లాపాలు చేసుకునే విధంగా, బ్యాంకు ఖాతా అందించాల‌నే ఉద్దేశ్యంతో ఈ స‌దుపాయాన్ని అందుబాటులో ఉంచిన‌ట్లు ఐడీబీఐ బ్యాంక్ అధికారులు వెల్ల‌డించారు. ఎఫ్ఏటీఏ ప్ర‌భుత్వ అంతర్ విభాగం. ఇది అంత‌ర్జాతీయ ఆర్థిక వ్య‌వ‌స్థ స‌మ‌గ్ర‌త‌కు ఎదుర‌య్యే న్యాయపరమైన‌, చట్ట పరమైన నిర్వహణ అంశాలు, మనీలాండరింగ్‌ నిర్మూలన, ఉగ్రవాదసంస్థలకు ఫైనాన్సింగ్‌ వంటి అంశాల‌పై విస్తృతంగా పనిచేస్తుంది. ఈ ఎఫ్‌ఏటీఎఫ్‌లో అమెరికా, బ్రిటన్, ఇండియా, జపాన్, చైనా, ఫ్రాన్స్‌లతోపాటు 32 దేశాలు, స‌భ్య‌త్వం క‌లిగి ఉన్నాయి.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

(Source: Livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly