ఐఆర్‌డీఏఐ హెచ్చ‌రిక‌ - ఈ సంస్థల‌తో జాగ్ర‌త్త‌

ఐఆర్‌డీఏఐ వ‌ద్ద లైసెన్సు పొందిన సంస్థ‌లు మిన‌హా మ‌రి ఏ ఇత‌ర సంస్థ‌ల నుంచి బీమా పాల‌సీల‌ను కొనుగోలు చేయ‌కూడ‌దు.

ఐఆర్‌డీఏఐ హెచ్చ‌రిక‌ - ఈ సంస్థల‌తో జాగ్ర‌త్త‌

మెరైన్స్ టెక్నాలిజీస్ , గాన్ జెన‌ర‌ల్ ఇన్సురెన్స్‌( వెబ్ సైట్ అడ్ర‌స్‌ www.goneglobal.in) అనే సంస్థలు బీమా నియంత్ర‌ణ‌ సంస్థ‌(ఐఆర్‌డీఏఐ) అనుమ‌తి లేకుండా అక్ర‌మంగా ఇన్సురెన్స్ ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యిస్తున్న‌ట్లు ఐఆర్‌డీఏఐ ఒక నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో గాన్ జెన‌రల్ ఇన్సురెన్స్ నితిన్ కుమార్ శ్రీ‌వాత్స‌వా అనే వ్య‌క్తి డిజిట‌ల్ సంతకంతో, gonegeneralinsurance@gmail.com అనే ఈమెయిల్ ఐడీతో న‌డుపుతుండ‌గా మెరైన్స్ టెక్నాల‌జీ marinestechnology.irdai@gmail.com అనే ఈమెయిల్ ఐడీతో నిర్వ‌హిస్తున్నారు. ఈ రెండు సంస్థలు జెన‌ర‌ల్ ఇన్సురెన్సు ఉత్ప‌త్తులు ఆఫ‌ర్ చేస్తున్నాయి. . అంతేకాకుండా జెన‌ర‌ల్ ఇన్సురెన్స్‌కు సంబంధించి ఇత‌ర కార్యాకాలాపాల‌లోనూ పాల్గొంటున్నాయి. అయితే ఏవిధ‌మైన బీమా పాల‌సీల‌ను విక్ర‌యించేందుకు ఆసంస్థల‌కు అధికారం లేద‌ని, త‌మ వ‌ద్ద లైసెన్స్ పొంద‌లేద‌ని ఐఆర్‌డీఏఐ పేర్కొంది. ఆసంస్థలు తాము ఐఆర్‌డీఏఐ వ‌ద్ద లైసెన్స్ పొందిన‌ట్లు/ఐఆర్‌డీఐతో క‌లిసి ప‌నిచేస్తున్న‌ట్లు ప్ర‌చారం చేస్తున్నాయి. అయితే నిజానికి మెరైన్స్ టెక్నాలిజీస్, గాన్ జెన‌ర‌ల్ ఇన్సురెన్స్ రెండు కూడా వారి వ‌ద్ద రిజ‌స్ట‌ర్ కాలేద‌ని ఐఆర్‌డీఏఐ తెలిపింది. మెరైన్స్ టెక్నాలజీ, అదే విధంగా గాన్ జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్ ల‌తో, బీమా వ్యాపారానికి సంబంధించి ఎలాంటి లావాదేవీలు చేయకూడదని, ప్ర‌జ‌లు అటువంటి సంస్థ‌ల‌ను విశ్వ‌శించ‌రాద‌ని, ఎటువంటి బీమా పాల‌సీలు కొనుగోలు చేయోద్ద‌ని ఐఆర్‌డీఏఐ త‌న నోటీసులో వెల్ల‌డించింది. ఒక‌వేళ ఈ రెండు సంస్థ‌ల‌కు సంబంధించిన పాల‌సీల‌ను విక్ర‌యిస్తున్న‌ట్లు మీ దృష్టికి వ‌స్తే, ఐఆర్‌డీఏఐ వారికి తెలియ‌జేయ‌వ‌ల‌సిందిగా కోరారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly