రూ.1.46 కోట్ల ఐటీ రిట‌ర్నులు

జులై 16న ఒక్క‌రోజే 7.94 లక్షల మంది రిటర్నులు సమర్పించారు

రూ.1.46 కోట్ల ఐటీ రిట‌ర్నులు

ఇప్పటి వరకు 1.46 కోట్ల ఆదాయపన్ను రిటర్నులు దాఖలయ్యాయని రెవెన్యూ శాఖ తెలిపింది. అందులో రూ.50 లక్షల ఆదాయం వరకు ఉన్న వ్యక్తులవి 90.8 లక్షలని పేర్కొంది. కేవలం జులై 16నే 7.94 లక్షల మంది రిటర్నులు సమర్పించగా అందులో 5.26 లక్షల మంది ఐటీఆర్‌-1 లేదా సహజ్‌ ద్వారా దాఖలు చేశారు.

జీతాలు, సొంత ఇల్లు, ఇతర మార్గాలు (వడ్డీ), రూ.5000 లోపు వ్యవసాయ రాబడి మొత్తం కలిపి రూ.50 లక్షల లోపు ఆదాయం పొందుతున్న వారు ఐటీఆర్‌-1 దాఖలు చేయాలన్న సంగతి తెలిసిందే. ఐటీఆర్‌-2ను 9.68 లక్షల మంది సమర్పించారు. వ్యాపారం, వృత్తి వనరుల నుంచి ఎలాంటి ఆదాయం పొందని అవిభక్త హిందూ కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌) ఈ విభాగంలోకి వస్తాయి. ఇక జులై 16 లోపు దాఖలైన ఐటీఆర్‌-3లు 14.94 లక్షలు. ప్రక్రియను సులభతరం చేయడం, ముందుగానే నింపిన ఐటీఆర్‌ పత్రాల (ఎడిట్‌ చేసుకోవచ్చు) వల్ల ఎక్కువ సంఖ్యలో రిటర్నులు దాఖలవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది సుగమ్‌ లేదా ఐటీఆర్‌-4లు దాదాపు 28 లక్షలు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 24,000 పైగా కంపెనీలు ఐటీఆర్‌-6ను సమర్పించాయి. అన్నీ కలిపి జులై 16 నాటికి 1.46 లక్షలని ఆదాయపన్ను విభాగం తెలిపింది. ఆడిటింగ్‌ అవసరం లేని రిటర్నులకు జులై 31 తేది గడువు కాగా ఆడిటింగ్ కచ్చితంగా అవసరమైన రిటర్నులకు సెప్టెంబర్‌ 30 తుదిగడువు. ఐటీఆర్‌-2, ఐటీఆర్‌-3లో మార్పులు చేస్తున్నట్టు సోషల్‌ మీడియాలో వచ్చిన కథనాలు అబద్ధమని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. సాఫ్ట్‌వేర్‌ మాత్రమే అప్‌డేట్‌ చేస్తున్నట్టు తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగానే పక్రియను మరింత సులభతరం చేసేందుకు సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేస్తామని పేర్కొంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly