ఐటీ రిటర్న్ దాఖలు గడువును పొడిగించిన కేంద్రం..

పన్ను చెల్లింపుల ఆలస్య రుసుమును 12 శాతం నుంచి 9 శాతానికి తగ్గించారు

ఐటీ రిటర్న్ దాఖలు గడువును పొడిగించిన కేంద్రం..

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్నుల దాఖలు గడువును జూన్‌ 30, 2020 వరకు పొడిగించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన నిర్మలా సీతారామన్‌ పైవిధంగా తెలిపారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినట్లు సీతారామన్‌ చేశారు. కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ప్రజలకు సహాయపడటానికి ఎనిమిది అంశాల సమ్మతి సహాయ ప్యాకేజీని సీతారామన్‌ వివరించారు. అవేంటో కింద చూద్దాం…

  • 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్నుల దాఖలు గడువును జూన్‌ 30, 2020 వరకు పొడిగించారు.

  • పన్ను చెల్లింపుల ఆలస్య రుసుమును 12 శాతం నుంచి 9 శాతానికి తగ్గించారు.

  • టీడీఎస్‌ జమ ఆలస్య రుసుమును కూడా 18 శాతం నుంచి 9 శాతానికి తగ్గించారు.

  • ఆధార్‌-పాన్‌ అనుసంధానం గడువును కూడా జూన్‌ 30 వరకు పొడిగించారు.

  • వివాద్ సే విశ్వాస్‌ పథకం గడువును కూడా జూన్‌ 30 వరకు పొడిగించారు.

  • పన్ను వివాదాల మొత్తాల చెల్లింపుల్లో 10 శాతం అదనపు రుసుంను తొలగించారు.

  • మార్చి, ఏప్రిల్‌, మే జీఎస్టీ రిటర్న్‌ల దాఖలు గడువు జూన్‌ 30 వరకు పొడిగించారు.

  • కాంపొజిషన్‌ స్కీమ్‌ రిటర్న్‌ల దాఖలుకు కూడా జూన్‌ 30 వరకు గడువును పొడిగించారు. రూ. 5 కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీలపై పన్ను చెల్లింపు ఆలస్య రుసుములు ఉండవు. అలాగే రూ. 5 కోట్ల టర్నోవర్‌ పైబడిన పెద్ద కంపెనీలకు పన్ను చెల్లింపులపై వడ్డీ, అపరాధ రుసుం 9 శాతానికి తగ్గించారు.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly