ఐటీ రిట‌ర్నుల‌కు చివ‌రి తేది ఆగష్టు 31

చివ‌రి తేదీ వ‌ర‌కు చూడ‌కుండా వీలైనంత త్వ‌ర‌గా ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డం మంచిద‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఐటీ రిట‌ర్నుల‌కు చివ‌రి తేది ఆగష్టు 31

ఐటీఆర్ గ‌డువు తేది లోపు దాఖ‌లు చేస్తే, ఏదైనా త‌ప్పులు ఉంటే తిరిగి స‌రిచేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. 2019-20 మ‌దింపు సంవ‌త్స‌రానికి ఐటీఆర్ చివ‌రి తేదీ ఆగష్టు 31, 2019. మార్చి 31 వ‌ర‌కు ఆల‌స్య రుసుముతో రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌వ‌చ్చు.

అయితే గ‌డువు లోపు రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌క‌పోతే ఏదైనా న‌ష్టం ఉన్న‌ట్ల‌యితే వ‌చ్చే ఎనిమిది మ‌దింపు సంవ‌త్స‌రాల‌కు చూపేందుకు అవ‌కాశం ఉండ‌దు. ఆగ‌స్ట్ 31 వ‌ర‌కు ఆధార్‌-పాన్ అనుసంధానానికి ఆదాయ ప‌న్ను శాఖ అనుమ‌తించింది. పాన్ కార్డ్ లేక‌పోతే ఆధార్‌తో ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు కూడా అవ‌కాశం ఉంది. ఆధార్‌తో ఐటీఆర్ దాఖ‌లు చేస్తే ఐటీ శాఖ మీకు ఈ-పాన్ జారీ చేస్తుంది.

ప్ర‌తి ఏడాది ఐటీ శాఖ ఐటీ చ‌ట్టానికి అనుగుణంగా ఐటీ రిట‌ర్నుల ఫారంల‌ను మారుస్తుంది. మార్పుల ఆధారంగా వ్య‌క్తుల‌ ఆదాయం గురించి మ‌రింత వివ‌రంగా స‌మాచారం తెలుసుకునే అవ‌కాశం ఉంటుంది. ఇది మ‌రింత విశ్లేషించి, భ‌విష్య‌త్తులో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చేందుకు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి పొందిన ఆదాయాన్ని బ‌ట్టి ఏ ఐటీ ఫారం మీకు వ‌ర్తిస్తుందో తెలుసుకోవాలి. ఇప్పుడు ముందే మీ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌తో కూడిన ఐటీ ఫారంలు వ‌స్తున్నాయి. ఏదైనా మార్పులు కావాల‌నుకుంటే చేసుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీ బ్యాంకు ఖాతా మార్చినా, కొత్త ఖాతా నంబ‌ర్ అప్‌డేట్ చేయ‌వ‌చ్చు.

చివ‌ర‌గా…
అంద‌రు ప‌న్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఆన్‌లైన్ ద్వారా దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. కేవ‌లం సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్లు మాత్ర‌మే ప‌త్రాల‌తో దాఖ‌లు చేయ‌వ‌చ్చు. చివ‌రి తేదీ వ‌ర‌కు చూడ‌కుండా వీలైనంత త్వ‌ర‌గా ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డం మంచిద‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. గ‌డువు ముగింపు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డిన కొద్ది అంద‌రు ఒకేసారి చేయ‌డంతో స‌ర్వ‌ర్లు ప‌నిచేయ‌క‌పోవ‌చ్చు. ఏ ఫారం ఎంచుకోవాలో తెలియ‌క‌పోతే ప‌న్ను స‌ల‌హాదారుడిని సంప్ర‌దించ‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly