మ‌రింత సుల‌భంగా ఐటీఆర్ రిట‌ర్నులు

డౌన్‌లోడ్ చేసుకున్న‌ ప్రీ-ఫిల్డ్ ఫారంలో మీ ప‌న్ను వివ‌రాల‌ను ధృవీక‌రించి ఫార‌మ్‌ల‌ను ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు స‌మ‌ర్పించాలి

మ‌రింత సుల‌భంగా ఐటీఆర్ రిట‌ర్నులు

ఆదాయ‌పు రిట‌ర్నుల ఫైల్లింగ్‌ను సుల‌భ‌త‌రం చేసేందుకు ప్ర‌భుత్వం ప్రీ-ఫిల్డ్‌ రిట‌ర్నుల విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తుంద‌ని, నిన్న జ‌రిగిన‌ జ‌రిగిన బ‌డ్జెట్ ప్ర‌సంగంలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ ప్ర‌క‌టించారు. ఇందుకోసం మ్యూచువ‌ల్ ఫండ్ హౌస్‌లు, రిజిస్టార్లు, బ్యాంకులు వంటి వివిధ వ‌న‌రుల నుంచి స‌మాచారం సేక‌రిస్తారు. ఇది ఆదాయ‌పు ప‌న్ను ఈ-ఫైల్లింగ్ పోర్ట‌ల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

దీని అర్థం చెల్లింపుదారులు ఆదాయపు పన్ను వెబ్‌సైట్ నుంచి ముందుగానే వివ‌రాల‌తో నింపిన‌ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. వివిధ వ‌న‌రుల నుంచి సేక‌రించిన స‌మాచారం ప్ర‌కారం మీ ప‌న్ను వివ‌రాలు ముందుగానే ఫిల్ చేయ‌బ‌డి ఉంటాయి. మీరు ఈ వివ‌రాల‌ను ధృవీక‌రించి ఫారమ్‌ను స‌బ్మిట్ చేస్తే స‌రిపోతుంది.

నేరుగా అధికారుల‌తో సంప్ర‌దింపులు లేకుండా ఎలక్ట్రానిక్ మోడ్‌లో ఆదాయపు పన్ను అంచనా విధానాన్ని ఈ ఏడాది నుంచి దశలవారీగా ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. పన్ను చెల్లింపుదారుల వేధింపులను తగ్గించడమే ల‌క్ష్యంగా ఈ సేవ‌ల‌ను ప్రారంభించిన‌ట్లు మంత్రి తెలిపారు.

అంతేకాకుండా ఆదాయపు పన్ను రిటర్నుల‌ దాఖలు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు, పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం పాన్, ఆధార్‌ల‌ను పరస్పరం మార్చుకునేందుకు వీలుక‌ల్పించారు. మరో మాటలో చెప్పాలంటే, ఆదాయ పన్ను రిటర్నులను ఫైల్ చేసేందుకు పాన్ కార్డు అందుబాటులో లేకుంటే ఆధార్ నంబర్ ఉపయోగించి దాఖలు చేయవచ్చు అని ఆర్థిక మంత్రి చెప్పారు.

భార‌తీయ పాస్‌పోర్ట్‌ల‌తో కూడిన ఎన్ఆర్ఐల‌కు స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చిన త‌రువాత 180 రోజులు వేచి చూడ‌కుండానే ఆధార్ కార్డు జారీ చేస్తామ‌ని తెలిపారు.

ఆదాయ‌పు ప‌న్ను చెల్లింపుల్లో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన మ‌రొక అంశం గృహ రుణ వ‌డ్డీపై అద‌నంగా రూ.1.5 ల‌క్ష‌ల మిన‌హాయింపు. మార్చి 31,2020 లోపు రుణం తీసుకుని కొనుగోలు చేసిన రూ.45 ల‌క్ష‌ల లోపు గృహాల‌కు ఈ మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది.

హెచ్‌ఎన్‌ఐ (అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు) ఆదాయానికి సంవత్సరానికి రూ. 2 కోట్లకు పైగా ఆదాయపు పన్ను సర్‌చార్జిని పెంచింది. రూ. 2-5 కోట్ల మధ్య సంపాదించే వారికి సర్‌చార్జ్ రేటు 15 శాతం నుంచి 25 శాతానికి. రూ. 5 కోట్లకు పైగా సంపాదించే వారికి 15 శాతం నుంచి 37 శాతానికి సర్‌చార్జి పెంచింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly