సుప్రీంకోర్టు తీర్పు త‌ర్వాత ఈపీఎఫ్ కార్పస్ ఎంత పెరుగుతుంది?

యాజమాన్యాలు తమ ఉద్యోగులకు చెల్లించే ప్రత్యేక అలవెన్సులు కూడా మూలవేతనంలో ఓ భాగమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు తీర్పు త‌ర్వాత ఈపీఎఫ్ కార్పస్ ఎంత పెరుగుతుంది?

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) లెక్కింపులో యజమానులు ఉద్యోగులకు అందించే ప్రత్యేక అలవెన్సులను కూడా మూల వేతనం కిందే పరిగణించి పీఎఫ్‌ మొత్తాన్ని గణించాలని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి ఉద్యోగి మూల వేతనం నుంచి 12 శాతం ఈపీఎఫ్‌ మొత్తాన్ని మినహాయించి ఉద్యోగి ఖాతాలో జమ చేస్తారు. దీనికి అదనంగా యజమాని కూడా అంతే మొత్తాన్ని పీఎఫ్‌ ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యోగి మూల వేతనంలో ప్రత్యేక అలవెన్సు కూడా కలవడంతో ఎక్కువ మొత్తం పీఎఫ్‌ ఖాతాకు వెళుతుంది. ఇంతే మొత్తం యజమాని కూడా జమ చేయడంతో పీఎఫ్‌ ఖాతాలోకి అధిక మొత్తం చేరుతుంది. ఇది ఉద్యోగులకు లాభం చేకూరుస్తుంది.

  • ఈపీఎఫ్ కార్ప‌స్‌పై ప్ర‌భావం = బేసిక్ + అల‌వెన్స్ ( బేసిక్ కంటే 25 శాతం ఎక్కువ‌)

ఉదాహ‌ర‌ణ‌కు బేసిక్ రూ.10,000 అనుకుందాం. బేసిక్ + అల‌వెన్స్ 25 శాతం ఎక్కువ అంటే రూ.12,500. వ‌డ్డీ రేటు 8 శాతం అనుకుంటే ,

పీఎఫ్ కాంట్రిబ్యూష‌న్‌తో క‌లిపి ఈపీఎఫ్ కార్ప‌స్ 15 సంవ‌త్స‌రాల త‌ర్వాత = 12 శాతం బేసిక్ (ఉద్యోగి వాటా)+ 3.67 శాతం బేసిక్ (సంస్థ వాటా)= రూ.6.56 ల‌క్ష‌లు.

సుప్రీంకోర్టు తీర్పు త‌ర్వాత‌, ఈపీఎఫ్ కార్ప‌స్ = 12 శాతం బేసిక్ + అల‌వెన్స్ (ఉద్యోగి వాటా) + 3.67 శాతం బేసిక్ + అల‌వెన్స్ (సంస్థ వాటా) = రూ.8.41 ల‌క్ష‌లు. అంటే 28 శాతం ఎక్కువ‌.

అంటే ప్రారంభంలో ఈపీఎఫ్ కాంట్రిబ్యూష‌న్ 25 శాతం ఎక్కువ‌గా ఉంటుంది. ఆ త‌ర్వాత‌ బేసిక్ వేత‌నం పెరిగితే మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటుంది.

ఈపీఎఫ్ కార్ప‌స్ పై ప్ర‌భావం = బేసిక్ + బేసిక్ కంటే 50 శాతం ఎక్కువ అల‌వెన్స్

ఉదాహ‌ర‌ణ‌కు బేసిక్ రూ.25,000 అనుకుంటే + అల‌వెన్స్ 37,500 (50 శాతం ఎక్కువ‌) 15 సంవ‌త్స‌రాల త‌ర్వాత, కేవ‌లం పీఎఫ్ కోసం కేటాయించిన‌ కాంట్రిబ్యూష‌న్ రూ.20.71 ల‌క్ష‌లు

ఈపీఎఫ్ కార్ప‌స్ బేసిక్ + అల‌వెన్స్ = రూ.33.26 ల‌క్ష‌లు ( లేదా 60.6 శాతం ఎక్కువ‌) . అయితే పీఎఫ్ కాంట్రిబ్యూష‌న్ కూడా 60 శాతం పెరిగితే చేతికి వ‌చ్చే జీతం త‌గ్గుతుంది.

చివ‌ర‌గా:

కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం, నెల‌వారిగా ఉద్యోగుల‌ ఈపీఎఫ్ కాంట్రిబ్యూష‌న్ పెరుగుతుంది. దీంతో నిక‌ర ఆదాయం త‌గ్గుతుంది. సుప్రీంకోర్టు తీర్పు విన్న త‌ర్వాత ఉద్యోగులు వేత‌నం చేతికి త‌క్కువ‌గా వ‌స్తుంద‌ని కొంత నిరాశ‌కు గురయ్యారు. అయితే కాంపౌండింగ్‌తో ఈపీఎఫ్ కార్ప‌స్ భారీగా పెరుగుతుంది. ఇది భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం పనికొస్తుంది. దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాలు ఉంటాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly