అనుకోకుండా ఉద్యోగం కోల్పోతే ఆర్థిక ప‌రిస్థితి ఏంటి?

క్ర‌మంగా వ‌చ్చే ఆదాయం ఆగిపోతే ప్ర‌స్తుతం ఉన్న రుణాల‌ను చెల్లించ‌డం గృహ రుణం వంటివి చెల్లించ‌డం క‌ష్టమ‌వుతుంది

అనుకోకుండా ఉద్యోగం కోల్పోతే ఆర్థిక ప‌రిస్థితి ఏంటి?

ఏడాదికి రూ.30 ల‌క్ష‌లు ఆదాయం పొందే ఒక వ్య‌క్తి అనుకోకుండా ఉద్యోగం కోల్పోయాడు. ఇలా జ‌రుగుతుంద‌ని ముందే ఊహించ‌లేదు కాబ‌ట్టి అత‌డు ఎటువంటి ప్ర‌త్యామ్నాయం ఆలోచించ‌లేదు. అత‌డు పెట్రోకెమిక‌ల్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌, ఇన్సూఎన్స్, లాజిస్టిక్స్, స‌మాచార సాంకేతిక‌త వంటి వివిధ రంగాల్లో ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. అయితే ఇలాంటి ఆప‌ద స‌మ‌యంలో మాత్రం ఎటువంటి ఆధారం లేకుండా పోయింది. ఈ విధంగానే మీకు జ‌రిగితే ఎంటి ప‌రిస్థితి అనుకోకుండా ఉద్యోగం కోల్పోతే ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను ఎలా చ‌క్క‌దిద్దుకుంటారు? మీకు కుటుంబం ఉంటే వారి బాధ్య‌త ఏంటి ? ఇలాంటి సంద‌ర్భం ఎదురైతే ఏం చేయాలి?

ఆర్థిక అవ‌స‌రాల‌ను పున‌స‌మీక్షించుకోండి:

ఉద్యోగం కోల్పోగానే అనేక బావోద్వేగాలు మిమ్మ‌ల్ని వెంటాడుతాయి. రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే వేత‌నం నిలిచిపోతుంది, భ‌విష్య‌త్తు గురించి భ‌యాందోళ‌న‌లు మొద‌ల‌వుతాయి. ఇలాంటి స‌మ‌యంలోనే ప‌రిస్థితిని స‌రిదిద్దుకునేంద‌కు కొంత స‌మ‌యం తీసుకోవాలి. అస‌లు ఉద్యోగం పోవ‌డానికి కార‌ణం ఏంటి మీ పొర‌పాటు ఏమైనా ఉందా. ప‌నితీరులో లోపాలు ఉన్నాయా అని స‌మీక్షించుకోవాలి. ఒక‌వేళ నైపుణ్యాల లోపం కార‌ణంగా ఉద్యోగం నుంచి తీసేస్తే వాటిని మెరుగుప‌రుచుకునేందుకు ప్ర‌య‌త్నించాలి. మీకు ఉన్న బ‌ల‌హీన‌త‌ల‌ను అదిగ‌మించాలి.

బ‌డ్జెట్‌:

మీ ఖ‌ర్చుల‌పై దృష్టి సారించాలి. మొద‌ట అవ‌స‌ర‌మున్న‌వి మాత్ర‌మే కొనుగోలు చేయాలి. ఉదాహ‌ర‌ణ‌కు ఆహారం, వ‌స‌తి, నిత్యాస‌రాలు, ర‌వాణా, ప్రాథ‌మిక వ‌స్తువులు వంటి క‌నీస అవ‌స‌రాల‌పై డ‌బ్బు ఖ‌ర్చు పెట్టాలి. అప్ప‌టికే ఉన్న అప్పుల‌ను చెల్లించాల్సి ఉంటుంది. జీవ‌న‌శైలిని మార్చుకునేందుకు ప్ర‌య‌త్నించాలి. ఉదాహ‌ర‌ణ‌కు బోజ‌నాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసుకొని తిన‌డం, హోట‌ళ్ల‌లో తిన‌డం, సినిమాలు వంటి కొన్ని విలాస‌వంత‌మైన ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవాలి. ఒక ప్ర‌ణాళిక‌తో డ‌బ్బు ఖ‌ర్చు పెట్టాలి. గ్రా వీలైనంత ఖ‌ర్చులను త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నించాలి .

రుణంపై ప్ర‌భావం:

క్ర‌మంగా వ‌చ్చే ఆదాయం ఒక్క‌సారిగా నిలిచిపోతే అప్ప‌టికే తీసుకున్న‌ రుణాలను చెల్లించ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. చాలామంది గృహ రుణం, వ్య‌క్తిగ‌త రుణం, క్రెడిట్ కార్డ్ బిల్లులు వంటివి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్ర‌త్నామ్నాయం ఆలోచించేంత‌వ‌ర‌కు క‌ష్టాలు త‌ప్ప‌వు. రుణాలు చెల్లించేందుకు స‌రిప‌డినంత డ‌బ్బు లేక‌పోతే ఎక్కువ వ‌డ్డీ ఉన్న రుణాల‌ను ముందుగా చెల్లించేందుకు ప్ర‌య‌త్నించాలి. ఒక‌సారి పూర్తిగా మీ ఆర్థిక అస‌వ‌రాల‌ను విశ్లేషించుకొని దానికి త‌గ్గిన‌ట్లుగా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టాలి.

పొదుపు, పెట్టుబ‌డుల నిధుల‌ను ఉప‌యోగించుకోండి:

ఇప్ప‌టివ‌ర‌కు చేసిన పొదుపు, పెట్టుబ‌డుల‌ను ఇలాంటి స‌మ‌యంలో ఉప‌యోగించుకోవాలి. ఒక‌వేళ అత్య‌స‌ర‌నిధి లేక‌పోతే ఇవి బ‌య‌ట‌కు తీయాలి. అందుకే ఏ అత్య‌వ‌స‌రం వ‌చ్చినా ఉప‌యోగ‌ప‌డేలా ముందుగానే 6-12 నెల‌ల‌కు స‌రిప‌డా అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి స‌మ‌యంలో ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. మీ ఆదాయానికి మించి రుణం తీసుకుంటే ఇలాంటి స‌మ‌యంలో తీవ్ర స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అత్య‌వ‌స‌ర నిధి అనేది చాలా ముఖ్యం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly