ఈపీఎఫ్‌వో అందిస్తున్న ఆన్‌లైన్ సేవ‌లు

ఉద్యోగి ఒక సంస్థ నుంచి మ‌రోదానికి మారేట‌ప్ప‌డు ఇబ్బందులు ఎదురుకాకుండా యూనివ‌ర్స‌ల్ అకౌంట్ నెంబ‌ర్ (యూఏఎన్‌) తోడ్ప‌డుతుంది.

ఈపీఎఫ్‌వో అందిస్తున్న ఆన్‌లైన్ సేవ‌లు

మ‌న దేశంలోని కొన్ని ల‌క్ష‌ల మంది ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల‌ను ఈపీఎఫ్‌వో సంస్థ నిర్వ‌హిస్తుంద‌న్న విష‌యం తెలిసిందే. ఉద్యోగ భ‌విష్య నిధి(ఈపీఎఫ్‌) ప్ర‌ముఖ పొదుపు ప‌థ‌కాల్లో ఒక‌టి. పీఎఫ్ సేవ‌ల‌ను డిజిట‌లైజేష‌న్ దిశ‌గా న‌డిపించేందుకు ఈపీఎఫ్‌వో సంస్థ ఇటీవ‌ల అనేక చ‌ర్య‌ల‌ను చేప‌ట్టింది. ఉద్యోగి ఒక సంస్థ నుంచి మ‌రోదానికి మారేట‌ప్ప‌డు ఇబ్బందులు ఎదురుకాకుండా యూనివ‌ర్స‌ల్ అకౌంట్ నెంబ‌ర్ (యూఏఎన్‌) సృష్టి శ్లాఘ‌నీయం.

కొన్నేళ్ల క్రితం వ‌ర‌కూ ఏదైనా సంస్థ‌లో చేరాక ఉద్యోగి కొత్త‌గా పీఎఫ్ ఖాతాను తెర‌వాల్సి వ‌చ్చేది. కొంత కాలానికి ఉద్యోగం మానేయాల్సి వ‌స్తే అత‌డి వ‌ద్ద రెండే రెండు ఐచ్ఛికాలు ఉండేవి… ఒక‌టి ప్ర‌స్తుతం కొన‌సాగిస్తున్న పీఎఫ్ ఖాతాలోని డ‌బ్బునంతా కొత్త దానికి బ‌దిలీ చేసుకోవ‌డం . రెండు… ప్ర‌స్తుతం కొన‌సాగిస్తున్న ఖాతాలోని సొమ్మునంతా ఉప‌సంహ‌రించుకోవ‌డం. ఈ రెండూ ప‌ద‌వీ విర‌మ‌ణ అస‌లు ఉద్దేశాన్ని గండి కొట్టించేవిగా ఉండ‌డంతో పాటు వీటికి చాలా స‌మ‌యమే ప‌ట్టేది.

ఇప్పుడు ప‌రిస్థితులు చాలా వ‌ర‌కు కుదుట‌ప‌డ్డాయ‌ని చెప్పొచ్చు. పీఎఫ్ ఖాతాను బ‌దిలీ చేయాల‌న్నా, సొమ్ము విత్‌డ్రా చేయాల‌న్నా పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. ఉద్యోగికి ఇప్పుడు కావాల్సింది యూఏఎన్ సంఖ్య. భ‌విష్య‌త్‌లో ఏ ఉద్యోగంలో చేరినా స‌రే ఈ యూఏఎన్ సంఖ్య ఒక్క‌టి ఇస్తే స‌రిపోతుంది. పాత పీఎఫ్ ఖాతా కొత్త ఖాతాకు బ‌దిలీ అవుతుంది.

మొద‌టి సారి యూఏఎన్ ఖాతాను పొందేందుకు సంస్థ స‌హాయ‌ప‌డ‌వ‌చ్చు లేదా స్వ‌యంగా ఆన్‌లైన్‌లోనూ యూనివ‌ర్స‌ల్ అకౌంట్ నెంబ‌రును యాక్టివేట్ చేసుకోవ‌చ్చు.

యూఏఎన్ గురించిన కొన్ని ముఖ్య‌మైన వాస్త‌వాలు

 • యూఏఎన్ … యూనివ‌ర్స‌ల్ అకౌంట్ నెంబ‌రును సూచిస్తుంది.
 • వివిధ సంస్థ‌లు కేటాయించే పీఎఫ్ ఖాతా సంఖ్య‌లను ఏక‌తాటి పైకి తీసుకొచ్చేది యూఏఎన్‌.
 • ఒక ఉద్యోగికి ఒక యూఏఎన్ సంఖ్య కేటాయింపు
 • ఉద్యోగ భ‌విష్య నిధి చందాదారులు త‌మ ఫీఎఫ్ ఖాతా వివ‌రాల‌న్నీ యూఏఎన్ స‌హాయంతో తెలుసుకోవ‌చ్చు.

యూఏఎన్ కు అంత ప్రాముఖ్య‌త దేనికి?

 • కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ఉద్యోగాలు పెరిగిపోతుండ‌టం వ‌ల్ల త‌ర‌చూ ఉద్యోగాలు మారే వారి సంఖ్యా పెరిగిపోతుంది. దీంతో ఎన్నో పీఎఫ్ సంఖ్య‌ల‌ను సృష్టించాల్సి వ‌స్తోంది. నిర్వ‌హ‌ణ భారంగా మారుతోంది. యూఏఎన్ వీటికి పరిష్కారం కాగ‌ల‌దు.

 • ఆధార్‌, బ్యాంక్ ఖాతా, పాన్ లాంటివి కీల‌క గుర్తింపు ప‌త్రాలుగా గుర్తించారు.

 • ఆధార్ ఆగ‌మ‌నంతో డిజిట‌ల్ కేవైసీ సుల‌భ‌త‌ర‌మైంది. పీఎఫ్ ఖాతాల‌న్నీ యూఏఎన్‌తో అనుసంధాన‌మ‌వ్వ‌డం, డిజిట‌ల్ రికార్డుల్లో కెక్క‌డం వ‌ల్ల అన‌తి కాలంలో పీఎఫ్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మార్గం సుగ‌మ‌మైపోయింది.

 • జీవిత కాలానికి ఒకే ఒక సంఖ్య‌… యూఏఎన్‌

 • ఆధార్‌తో అనుసంధానిత యూఏఎన్ తో ఉద్యోగ భ‌విష్య నిధి సేవ‌ల నిర్వ‌హ‌ణ నేరుగా చందాదారుల‌కు క‌లిగిన‌ట్ట‌య్యింది.

ఈ విధంగా యాక్టివేట్ చేసుకోవ‌చ్చు

https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పోర్ట‌ల్ క్లిక్ చేయ‌డం ద్వారా Activate UAN ఆనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. ఈ వివ‌రాలు నింపాల్సి రావ‌చ్చు.

 • సంస్థ కేటాయించిన యూఏఎన్ సంఖ్య‌.
 • పీఎఫ్ మెంబ‌ర్ ఐడీ
 • ఆధార్ సంఖ్య‌
 • పాన్ సంఖ్య‌
 • పేరు
 • పుట్టిన తేది
  *మొబైల్ నెంబ‌రు
 • ఇ-మెయిల్ ఐడీ
 • క్యాప్చా

EPF1.PNG

స‌రైన వివ‌రాల‌న్నీ నింపాక‌, Get Authorization pin పైన క్లిక్ చేసి మీకు అందిన పిన్ నంబ‌రు న‌మోదు చేయాలి. ఈ ప్ర‌క్రియ ముగిశాక యూఏఎన్ స్టేట‌స్ తెలుసుకునేందుకు Know Your UAN Status పై క్లిక్ చేయ‌వ‌చ్చు. మెంబ‌ర్ ఐడీ లేదా ఆధార్ లేదా పాన్ సంఖ్య‌తో పాటుగా పేరు, పుట్టిన తేది, మొబైల్ నెంబ‌రును న‌మోదు చేస్తే చాలు.

EPF2.PNG

అప్‌డేట్స్ ఎలా తెలుసుకోవ‌చ్చు?

 • యాక్టివేష‌న్ చేసుకున్నాక ఎస్ఎంఎస్ వ‌స్తుంది. దీంట్లో ఎంత నిల్వ ఉన్న‌ది తెలుస్తుంది.
 • ఖాతాదారులు ఒక మిస్డ్ కాల్ ఇవ్వ‌డం ద్వారా పీఎఫ్ ఖాతా వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.
 • ఖాతాదారులు ఈపీఎఫ్ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని త‌మ ఖాతా వివ‌రాల‌ను ట్రాక్ చేసుకోవ‌చ్చు.
 • అన్ని పీఎఫ్ ఖాతాల‌ను ఒకే ద‌గ్గ‌ర చూసుకోవ‌చ్చు. వాట‌న్నింటినీ ఈపీఎఫ్‌వో సంస్థ ఏకీకృతం చేసేస్తుంది.

ఆన్‌లైన్ పాస్‌బుక్‌

పాస్‌బుక్ చూసుకునేందుకు యూఏఎన్ వెబ్‌సైట్‌లో లాగిన్ కావొచ్చు. పాస్‌బుక్‌లో డిపాజిట్లు, ప్ర‌స్తుత బ్యాలెన్స్‌, జ‌మ అయిన వ‌డ్డీ, సంస్థ మీ త‌ర‌ఫున చేసిన డిపాజిట్ లాంటి వివ‌రాల‌న్నీ ఉంటాయి.

https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login.jsp లింక్ క్లిక్ చేసి పాస్‌బుక్ పొందొచ్చు. అయితే యూజ‌ర్ నేమ్‌, పాస్‌వ‌ర్డ్‌లు ఉండాల్సిందే.
EPF3.PNG

యూఏఎన్‌తో ఆధార్ అనుసంధానం

ఈపీఎఫ్‌వో సంస్థ యూఏఎన్ క‌లిగిన త‌మ స‌భ్యుల కోసం ఆధార్‌ను ఆన్‌లైన్‌లోనే అనుసంధానించుకునే స‌దుపాయాన్ని క‌ల్పించింది. యూఏఎన్ ఆధార్‌తో అనుసంధానించుకున్నాక స‌భ్యులు త‌మ సేవ‌ల‌ను కొన‌సాగించుకోవ‌చ్చు.

https://iwu.epfindia.gov.in/eKYC/LinkUanAadhaar లింక్ ద్వారా యూఏఎన్‌, ఆధార్‌ల అనుసంధానం సాధ్య‌మ‌వుతుంది.

EPF4.PNG

ఈపీఎఫ్‌వో ఖాతాదారు త‌న యూఏఎన్ సంఖ్య‌ను న‌మోదుచేయాలి. అప్పుడు మొబైల్ నెంబ‌రుకు ఓటీపీ వ‌స్తుంది. ఓటీపీని వెరిఫై చేశాక‌, ఆధార్ సంఖ్య‌ను న‌మోదుచేయాల్సి ఉంటుంది. మ‌రో ఓటీపీ మెయిల్‌కు లేదా మొబైల్ నెంబ‌రుకు వ‌స్తుంది. దీన్నీ వెరిఫై చేయాలి. యూఏఎన్ ఆధార్ వివ‌రాలు స‌రిపోలితే అప్పుడు ఆధార్‌తో యూఏఎన్ అనుసంధానం పూర్త‌వుతుంది.

పింఛ‌ను చెల్లింపు విచార‌ణ‌

ఏవైనా పింఛ‌ను చెల్లింపుల‌కు సంబంధించిన పెండింగ్ లో ఉన్న వివ‌రాలు తెలుసుకునేందుకు http://103.194.45.139/PPOquery/ క‌్లిక్ చేసి కార్యాల‌యం పేరు, పీపీవో సంఖ్య‌, పుట్టిన తేదీ న‌మోదుచేయాల్సి ఉంటుంది.

క్లెయిం స్టేట‌స్ తెలుసుకునేందుకు…

ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఏమైనా క్లెయిమ్స్ చేసి ఉంటే దాన్ని ట్రాక్ చేసేందుకు https://passbook.epfindia.gov.in/MemClaimStatusUAN/
యూఏఎన్, క్యాప్చా న‌మోదు చేస్తే స‌రిపోతుంది. ఈ లింక్ ద్వారా అన్ని క్లెయింల‌కు సంబంధించిన స్టేట‌స్ తెలిసిపోతుంది. లాగిన్ అవ్వ‌డం ద్వారానూ క్లెయిమ్స్ స్టేట‌స్ తెలుసుకోవ‌చ్చు.

ఇలాంటి ఎన్నో ఆన్‌లైన్ సేవ‌ల‌ను ఈపీఎఫ్ త‌న పోర్ట‌ళ్ల ద్వారా అందిస్తుంది. మీ తీరిక స‌మ‌యంలో వీటిని శోధించి ఒక్కోదాని ఉప‌యోగాన్ని స్వ‌యంగా తెలుసుకోగ‌ల‌రు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly