రీఫండ్‌లు ఆల‌స్యం కావ‌చ్చు..

సాంకేతికంగా సిపిసీ 2.0కి అప్‌గ్రేడ్ అవున్నందున రీఫండ్‌లు ఆల‌స్యం అవుతున్నాయ‌ని ఐటీ శాఖ తెలిపింది

రీఫండ్‌లు ఆల‌స్యం కావ‌చ్చు..

ఆదాయ‌పు ప‌న్ను దాఖ‌లు చేసి నెల‌లు గుడుస్తున్న‌ప్ప‌టీ మీకు రీఫండ్ రాలేదా? ఆందోళ‌న ప‌డ‌కండి. ఈ ఇబ్బంది మీకు మాత్ర‌మే కాదు. దేశ‌వ్యాప్తంగా చాలా మందికి ఇప్ప‌ట‌కీ రీఫండ్ జ‌మ‌కాలేదు. ఐటీఆర్‌ల‌ను మ‌రింత వేగంగా ప్రాసెస్ చేసేందుకు చేసే ప్ర‌య‌త్నంలో భాగంగా త‌లెత్తిన సాంకేతిక స‌మ‌స్య‌లు ఇందుకు కార‌ణం కావ‌చ్చు.

అసెస్మెంట్ సంవ‌త్స‌రం 2020-21కి సంబంధించి జూన్‌, జులై మాసాల‌లో ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసిన వారిలో కూడా చాలా మందికి రీఫండ్ రాలేదు. దీనిపై చాలా మంది ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌మ ఆందోళ‌న‌లు తెలియ‌జేయ‌డంతో ఆదాయ‌పు ప‌న్ను శాఖ స్పందించింది. “ప‌న్ను చెల్లింపు దారుల‌కు మైరుగైన సేవ‌ల‌ను అందించేందుకు, ఐటీఆర్ ప్రాసెస్‌ను మ‌రింత వేగంగా పూర్తిచేసేందుకు ప్లాట్‌ఫామ్‌(సిపిసి-2.0)కు అప్‌గ్రేడ్ చేస్తున్నాము. సాంకేతిక కార‌ణాల వ‌ల్ల ఇంకా రిఫండ్‌లు చెల్లించ‌లేదు. కొత్త వ్య‌వ‌స్థ‌కు మారుతున్న నేప‌ధ్యంలో స‌హ‌నంతో వేచి ఉన్నందుకు ధ‌న్య‌వాద‌ములు.” అని ట్విట్ట‌ర్‌లో తెలిపింది.

అయితే సిపిసి2.0 కు న‌వీక‌రించేందుకు ఎన్ని రోజులు స‌మ‌యం ప‌డుతుందో, ఏవై20-21 ఐటీ రిట‌ర్నులు ప్రాసెస్ చేయడం ఎప్పుడు మొద‌ల‌వుతుందో ఈ ట్వీట్‌లో ప్ర‌స్తావించ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు బెంగుళూరులోని సెంట్ర‌లైజెడ్ ప్రాసెసింగ్ సెంట‌ర్‌(సిపిసి)లో ఫైల్ చేసిన అన్ని ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ప్రాసెస్ చేస్తున్నారు. ‌

సిపిసీ 2.0తో ఆదాయ‌పు ప‌న్ను శాఖ సామ‌ర్ధ్యాన్ని విస్త‌రిస్తుంది. ప‌న్ను చెల్లింపుదారుల‌కు ముందుగానే నింపిన ఫార‌మ్‌ల ద్వారా మెరుగైన వేగ‌వంత‌మైన స‌ర్వీసులను అందించమే కాకుండా త‌క్కువ స‌మ‌యంలో వాప‌సుల‌ను చెల్లించ‌నుంది.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly