ఈపీఎఫ్ విత్‌డ్రాపై ప‌న్ను ప‌డుతుందా?

కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల‌లో ఈపీఎఫ్ విత్‌డ్రా చేసుకున్న‌ప్పుడు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

ఈపీఎఫ్ విత్‌డ్రాపై ప‌న్ను ప‌డుతుందా?

ఆదాయ ప‌న్ను నిబంధ‌న‌ల ప్ర‌కారం మెచ్యూరిటీ కంటే ముందుగా విత్‌డ్రా చేసుకుంటే ఈపీఎఫ్‌పై ప‌న్ను ప‌డుతుంది. ఈపీఎఫ్ గ‌డువుకు ముందే ఉప‌సంహ‌రించుకోకూడ‌ద‌న్న ఉద్దేశ్యంతో ఆదాయ ప‌న్ను శాఖ ఈ ర‌క‌మైన ప‌రిమితుల‌ను విధించింది. ఈపీఎఫ్ న‌గ‌దు ముఖ్యంగా ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత జీవితం కోసం దాచుకుంటారు. అందుకే ముందుగానే తీసుకోకూడ‌ద‌ని ఆర్థిక స‌ల‌హాదారులు చెప్తారు. ఉద్యోగం మారిన‌ప్పుడు కూడా ఒక సంస్థ నుంచి మ‌రో సంస్థ‌కు పీఎఫ్ ఖాతాను మార్చుకోవ‌చ్చు. అయితే కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల‌లో ఈపీఎఫ్ ఉప‌సంహ‌ర‌ణ‌కు ప‌న్ను మిన‌హాయింపులు ల‌భిస్తాయి. ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) యాక్ట్, 1952 ప్ర‌కారం ఉద్యోగి క‌నీస‌ వేత‌నం నుంచి 12 శాతం, డీఏను ఈపీఎఫ్‌లో పెట్టుబ‌డిగా పెడ‌తారు. అంతే స‌మానంగా సంస్థ వాటాను క‌లుపుతారు.

  1. ఈపీఎఫ్ విత్‌డ్రా- ప‌న్ను నిబంధ‌న‌లు
    ఉద్యోగి వ‌రుస‌గా ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ప‌నిచేస్తే ఈపీఎఫ్ విత్‌డ్రా చేసుకున్న‌ప్పుడు ప‌న్ను ఉండ‌దు. ఈ ఐదేళ్ల‌లో ఉద్యోగం మారితే పీఎఫ్ కూడా ఆ సంస్థ‌కు బ‌దిలీ చేసుకోవ‌చ్చు. మొత్తం క‌లిపి ఐదేళ్ల దాటితే ఎటువంటి ప‌న్ను ఉండ‌దు.

  2. అయితే కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల‌లో వ‌రుస‌గా ఐదేళ్లు ప‌నిచేయ‌కపోయినా ప‌న్ను వ‌ర్తించ‌దు. ఉద్యోగికి అనారోగ్యం కార‌ణంగా ఉద్యోగం మానేసినా లేదా సంస్థ అనుకోకుండా మూసివేసినా ఈపీఎఫ్ ఐదేళ్ల కంటే ముందే తీసుకున్న‌ప్పుడు ప‌న్ను ఉండ‌దు.

  1. చివ‌రిసారిగా ఈపీఎఫ్ జ‌మ‌చేసిన 36 నెల‌ల త‌ర్వాత ఈపీఎఫ్ ఖాతా ఇన్‌యాక్టివ్‌గా మారుతుంది. అయితే ఉద్యోగికి ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు ఖాతాలో ఉన్న న‌గ‌దుపై వ‌డ్డీ ల‌భిస్తుంది. అయితే ఖాతాదారుడు ఉద్యోగం మానేస్తే అప్ప‌టినుంచి ల‌భించే వ‌డ్డీపై ప‌న్ను ప‌డుతుంది.

  2. అదేవిధంగా పీఎఫ్ న‌గ‌దును ఎన్‌పీఎస్‌కు బ‌దిలీ చేస్తే అప్పుడు కూడా ఆదాయ ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. 2017-18 సంవ‌త్స‌రం నుంచి ఇది అమ‌ల్లోకి వ‌చ్చింది.

  3. ఐదేళ్ల కంటే ముందు విత్‌డ్రా చేసుకున్న‌ప్పుడు రూ.50 వేల కంటే ఎక్కువ‌గా ఉంటే టీడీఎస్ 10 శాతం వ‌ర్తిస్తుంది. అయితే రూ.50 వేలు లేన‌ప్పుడు ఫారం 15G/15H స‌మ‌ర్పించి టీడీఎస్ మిన‌హాయింపును పొంద‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly