ఇంటిపై తిరిగి పెట్టుబ‌డులు చేయ‌డం మంచిదేనా?

ఇంటిని ఎందుకు తిరిగి ఆధునీక‌రించాల‌నుకుంటున్నారో నిర్ణ‌యించుకొని దాని ప్ర‌కారం ఖ‌ర్చు చేయాలి

ఇంటిపై తిరిగి పెట్టుబ‌డులు చేయ‌డం మంచిదేనా?

చాలా మంది ఇంటిని కొనుగోలు చేసి ఫ‌ర్నీచ‌ర్, పేయింటింగ్ వంటి వాటికి ఒక‌సారి ఎక్కువ మొత్తంలో ఖ‌ర్చు ఖ‌ర్చు చేసి ప‌నిపూర్తి చేస్తారు. అయితే ఇలా ఒకేసారి కాకుండా స‌మ‌యానుసారంగా తిరిగి పెట్టుబ‌డులు చేస్తే దాని విలువ పెరుగుతుంద‌న్న విష‌యం గుర్తుంచుకోవాలి. సాధార‌ణంగా ఇళ్ల‌ను ప‌రిశీలించిన‌ట్ల‌యితే ప్ర‌తి ఇంట్లో ఒక‌టి లేదా ఎక్కువ గ‌దులు ఇంకా మొత్తం ప‌నులు పూర్తి చేయ‌కుండా వ‌దిలేస్తారు అయితే, పూర్తి చేయ‌డం ద్వారా ఇంటి విలువ పెరుగుతుంది.

ఇంటి విలువ‌ను పెంచుకోండి:

రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ ఆధారంగా మీ ఇంటి విలువ పెరుగుతుంది. ఇంటిని మ‌రింత ఆధునీక‌రించ‌డం లేదా తిరిగి పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా విలువ‌ను పెంచుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు కొత్త‌గా ఒక గ‌దిని నిర్మించేందుకు రూ.2 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తే అద‌న‌పు చ‌ద‌ర‌పు అడుగులు పెరుగుతాయి, అప్పుడు ఇంటి విలువ ల‌క్ష‌ల్లో పెరుగుతుంది. అదేవిధంగా పార్కింగ్ స్థ‌లం వంటివి ధ‌ర‌ను మ‌రింత పెంచుతాయి.

ఇంటి నిర్వ‌హ‌ణ‌

కొన్ని గృహాల‌ను ఒకసారి నిర్మించిన‌ త‌ర్వాత‌ నిర్వ‌హ‌ణ‌, ఎలాంటి ఆధునీక‌ర‌ణ చేయ‌కుండా వ‌దిలేస్తారు. ఇలాంటి ఇంటి విలువ పెంచాలంటే తిరిగి పెట్టుబ‌డులు పెట్టాల్సి ఉంటుంది. అవ‌స‌రాన్ని బ‌ట్టి పెట్టుబ‌డుల గురించి ఆలోచించాలి. తిరిగి పెట్టుబ‌డులు ఎందుకు చేయాల‌నుకుంటున్నారో స్ప‌ష్ట‌త ఉండాలి. అద్దె ఎక్కువ వ‌చ్చేందుకు అనుకుంటే దానికి త‌గిన‌ట్లుగా డ‌బ్బును ఖ‌ర్చు చేయాలి.

అమ్మాల‌నుకుంటే కొంత ఎక్కువ‌ ప్రాధాన్య‌త ఇవ్వాలి:

ఒక‌వేళ రెండు ఒకే ర‌క‌మైను ఇళ్లు అమ్మేందుకు సిద్ధంగా ఉంటే ఎవ‌రైనా ఆధునీక‌రించిన ఇంటిని, తిరిగి త‌క్కువ ఖ‌ర్చు అయ్యే ఇంటిని కొనుగోలు చేసేంద‌కు ప్రాధాన్య‌త చూపుతారు. అందుకే ఇంటిపై ఖర్చు చేసేముందు ఎందుకు చేస్తున్నారో స్ప‌ష్ట‌త ఉండాలి. ఇంటిని అమ్మేందుకు, నివ‌సించేందుకు లేదా అద్దెకు ఇచ్చేందుకా అనేది నిర్ణ‌యించుకొని దాని ప్ర‌కారం నిర్ణ‌యం తీసుకోవాలి.

అమ్మేందుకు పెట్టుబ‌డి:

ఇంటిని అమ్మేందుకు అయితే , ఇంటిని కొనుగోలు చేసేవారి వైపు నుంచి ఆలోచించాలి. ఇంటిని ఆధునీక‌రించేందుకు మ‌రీ ఎక్కువ‌గా ఖ‌ర్చు పెట్ట‌క‌పోవ‌డం మేలు.

అద్దెకు ఇచ్చేందుకు…

ఇళ్లు అందంగా ఉంటే అద్దెకు తీసుకునేవారు మొగ్గుచూపుతారు, దీంతో పాటు ఎక్కువ అద్దెను పెంచేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది. తిరిగి కొత్త రంగులు వేయించ‌డం వంటివి చేసి ఇంటిని ఆక‌ర్ష‌ణీయంగా మార్చాలి.

నివ‌సించేందుకు…

అదే ఇంట్లో మీరు నివ‌సించాల‌నుకుంటే కొత్త‌ ఫ‌ర్నీచ‌ర్‌, పేయింటింగ్ వంటివి చేసుకోవాలి. త‌క్కువ ఖ‌ర్చుతో ప‌నిచేసే ఎల‌క్ర్టానిక్ వ‌స్తువుల‌తో ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌చ్చు. ఇంటిని ఆధునీక‌రించేందుకు కూడా రుణాలు ల‌భిస్తాయి. వీటిపై ప‌న్ను మిన‌హాయింపు కూడా ఉంటుంది. సొంత ఇళ్లు అయితే ఖ‌ర్చు ప‌న్ను మిన‌హాయింపు రూ. 30 వేలు ఉంటుంది. అద్దె ఇంటికి ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితి లేదు.

ముగింపు:

ఇంటిపై తిరిగి ఖ‌ర్చు చేసే ముందు ఎందుకు చేస్తున్నారో స్ప‌ష్ట‌త ఉండాలి. ఇంటిని అమ్మేందుకు, అద్దెకు ఇచ్చేందుకు లేదా నివ‌సించేందుకు అనేది నిర్ణ‌యించుకొని దానికి త‌గిన‌ట్లుగా పెట్టుబ‌డి చేయాలి. ఇంటిని ఏ రకంగా మార్చాల‌నుకుంటున్నారో దానికి త‌గినట్లుగా బ‌డ్జెట్ సిద్ధంగా చేసుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly