పెట్టుబడులతో ఎదుగుదామా..

ఆర్ధిక లక్ష్యాలను నిర్దేశించుకుని , దానికి తగిన విధంగా మదుపు చేసినట్లయితే , సులభంగా లక్ష్యాలను చేరుకోవచ్చు

పెట్టుబడులతో ఎదుగుదామా..

సంపాదించిన దానిలో కొంత దాచుకోవడం మన భారతీయులకు అలవాటు. ఖర్చులను నియంత్రించుకుని , కొంత సొమ్మును భవిష్యత్ కోసం దాచుకోవడం, మరికొంత సొమ్మును భవిష్యత్ తరాల వారికి ఆస్తుల రూపంలో అందించడం మన ఆనవాయితీ. సాధారణంగా ఇళ్ళు, స్థలాలు, పొలాలు, బంగారం వంటివి ఇస్తుంటాము. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతున్న కాలానికి వచ్చే మార్పులకు అనుగుణంగా జీవన, ఆలోచన విధానం లో కూడా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల ఉన్నత చదువులకోసం , ఇళ్ళు కూడా హంగులు ఆర్భాటాలతో నిర్మించడం వలన ఖర్చులు పెరుగుతున్నాయి. పెళ్లిళ్లలో కూడా ఘనంగా ఖర్చు పెడుతున్నారు. దానికి తగ్గట్టు పెట్టుబడులలో వైవిధ్యత కనబడుతోంది.

ఒకప్పుడు మదుపు పధకాలు చాలా తక్కువగా, తక్కువ రాబడితో ఉండేవి. అయితే ఇప్పుడు అధిక రిస్క్ తీసుకునేవారికి, అధిక రాబడిని ఇచ్చే పధకాలు కూడా వస్తున్నాయి. అయితే మనం చేసే పెట్ట్టుబడికి, ఏ రాబడితో ఎంత మొత్తం జమ అవుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఈ క్రమంలో కిందటి కధానాలలో నెలకు రూ. 2,000 లతో మదుపు మొదలు పెట్టి, ప్రతి సంవత్సరం నెలకు రూ. 500, రూ. 1,000, రూ.1,500 ,రూ. 2,000,రూ. 2,500, రూ.3,000 లతో పెంచుకుంటూ మదుపు చేస్తే, 8%, 10%, 12% రాబడి అంచనాతో 10 ఏళ్ల తరువాత ఎంత లభిస్తుంది, అలాగే 20 ఏళ్ల తరువాత ఎంత లభిస్తుందో తెలుసుకున్నాము.

అలాగే నెలకు రూ 5,000 లతో మదుపు మొదలు పెట్టి, ప్రతి సంవత్సరం నెలకు రూ. 500, రూ. 1,000, రూ.1,500 ,రూ. 2,000,రూ. 2,500, రూ.3,000 లతో పెంచుకుంటూ మదుపు చేస్తే, 8%, 10%, 12% రాబడి అంచనాతో 10 ఏళ్ల తరువాత ఎంత లభిస్తుందో తెలుసుకున్నాము.

ఈ కింది పట్టికల ద్వారా నెలకు రూ 5,000 లతో మదుపు మొదలు పెట్టి, ప్రతి సంవత్సరం నెలకు రూ. 500, రూ. 1,000, రూ.1,500 ,రూ. 2,000,రూ. 2,500, రూ.3,000 లతో పెంచుకుంటూ మదుపు చేస్తే, 8%, 10%, 12% రాబడి అంచనాతో 20 ఏళ్ల తరువాత ఎంత లభిస్తుందో తెలుసుకుందాము .

r 8.jpg
ఉదా : శంకర్ , నెలకు రూ 5,000 లతో మొదలు పెట్టి, ప్రతి ఏడాది మొదటి నెలలో రూ 500 లు పెంచితే , అంటే రెండవ ఏడాది రూ 5,500 లు, మూడవ ఏడాది రూ 6,000 లతో మొదలు పెట్టి 20 ఏళ్ల పాటు మదుపు చేస్తే 8 శాతం రాబడి అంచనాతో అతనికి చివర్లో రూ 50,26,729 లభిస్తుంది. ఈ కాలంలో అతను చేసిన మొత్తం పెట్టుబడి రూ. 23,40,000. అంటే అతనికి లభించిన రాబడి రూ. 26,86,729.

అలాగే రూ. 5,000 లతో మొదలు పెట్టి, ప్రతి ఏడాది రూ. 1,000, రూ. 1,500, రూ. 2,000, రూ. 2,500, రూ. 3,000, లతో పెంచుకుంటూ వెళితే 8 శాతం రాబడి అంచనాతో ఎంత లభిస్తుందో కూడా తెలుసుకోవచ్చు.

r10.jpg

ఉదా : శ్రవణ్ , నెలకు రూ 5,000 లతో మొదలు పెట్టి, ప్రతి ఏడాది మొదటి నెలలో రూ 500 లు పెంచితే , అంటే రెండవ ఏడాది రూ 5,500 లు, మూడవ ఏడాది రూ 6,000 లతో మొదలు పెట్టి 20 ఏళ్ల పాటు మదుపు చేస్తే 10 శాతం రాబడి అంచనాతో అతనికి చివర్లో రూ 62,74,651 లభిస్తుంది. ఈ కాలంలో అతను చేసిన మొత్తం పెట్టుబడి రూ. 23,40,000. అంటే అతనికి లభించిన రాబడి రూ.39,34,651.

అలాగే రూ. 5,000 లతో మొదలు పెట్టి, ప్రతి ఏడాది రూ. 1,000, రూ. 1,500, రూ. 2,000, రూ. 2,500, రూ. 3,000, లతో పెంచుకుంటూ వెళితే 10 శాతం రాబడి అంచనాతో ఎంత లభిస్తుందో కూడా తెలుసుకోవచ్చు.

ఉదా : కిషోర్, నెలకు రూ 5,000 లతో మొదలు పెట్టి, ప్రతి ఏడాది మొదటి నెలలో రూ 500 లు పెంచితే , అంటే రెండవ ఏడాది రూ 5,500 లు, మూడవ ఏడాది రూ 6,000 లతో మొదలు పెట్టి 20 ఏళ్ల పాటు మదుపు చేస్తే 12 శాతం రాబడి అంచనాతో అతనికి చివర్లో రూ 79,24,820 లభిస్తుంది. ఈ కాలంలో అతను చేసిన మొత్తం పెట్టుబడి రూ. 23,40,000. అంటే అతనికి లభించిన రాబడి రూ.55,84,820.

r 12.jpg

అలాగే రూ. 5,000 లతో మొదలు పెట్టి, ప్రతి ఏడాది రూ. 1,000, రూ. 1,500, రూ. 2,000, రూ. 2,500, రూ. 3,000, లతో పెంచుకుంటూ వెళితే 12 శాతం రాబడి అంచనాతో ఎంత లభిస్తుందో కూడా తెలుసుకోవచ్చు.

ముగింపు:
ఆర్ధిక లక్ష్యాలను నిర్దేశించుకుని , దానికి తగిన విధంగా మదుపు చేసినట్లయితే , సులభంగా లక్ష్యాలను చేరుకోవచ్చు. దీర్ఘకాలం మదుపు చేయడానికి పట్టుదల, క్రమశిక్షణ చాల ముఖ్యం. మనం చేసే ప్రతి పెట్టుబడి ముందు భద్రత, సమయానికి చేతికి సొమ్ము అందడం (లిక్విడిటీ) , రాబడి, ఆర్ధిక లక్ష్యం చేరుకోటానికి ఉన్న సమయం, మన రిస్క్ సామర్ధ్యం, పన్ను ప్రభావం వంటి విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly