1.31 కోట్ల‌కు చేరిన సిప్‌ల ఖాతాలు

భార‌త మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల్లోని సిప్‌ల ఖాతాల సంఖ్య 1.31 కోట్ల‌కు చేరినట్లు యాంఫీ తెలిపింది.

1.31 కోట్ల‌కు చేరిన సిప్‌ల ఖాతాలు

దేశీయ మ్యూచువ‌ల్ ఫండ్ల లోని సిప్ ఖాతాల సంఖ్య 1.31 కోట్ల‌కు చేరుకుంది. వీటిలోకి మ‌దుప‌రులు క్ర‌మానుగ‌త పెట్టుబ‌డి విధానం(సిప్) లో ఇప్ప‌టివ‌ర‌కు రూ.4050 కోట్ల పెట్టుబ‌డులు పెట్టారు.

సిప్ లేదా క్ర‌మానుగ‌త పెట్టుబ‌డి విధానంలో మ‌దుప‌రులు పెట్టుబ‌డులను సులువుగా నిర్వ‌హించ‌వ‌చ్చు. నెల‌వారీగా కానీ, నిర్థీత స‌మ‌యాల‌లో పెట్టుబ‌డుల‌ను పెట్ట‌వ‌చ్చు. వీటిలో పెట్టుబ‌డి పెట్టాల్సిన క‌నీస మొత్తం కూడా రూ.500 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. దీని కోసం బ్యాంకు ఖాతాను అనుసంధానించాల్సి ఉంటుంది. దీని వల్ల నెల‌వారీ చెల్లింపులు ఖాతానుంచే జ‌రుగుతాయి. సిప్‌ల‌లో మ‌దుపు చేయ‌డం వ‌ల్ల ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వ‌డ‌ట‌మే కాక దీర్ఘ‌కాల ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌చ్చు.

యాంఫీ గణాంకాల ప్ర‌కారం ప్ర‌తీ నెలా 6.18 ల‌క్ష‌ల సిప్ ఖాతాలు కొత్తగా న‌మోద‌వుతున్నాయి. స‌గ‌టు పెట్టుబ‌డి నెల‌కు రూ.3100 గా న‌మోదైంది

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly