ఈ-కామర్స్‌ రంగంలోకి అడుగు పెట్టనున్న ఇన్‌స్టాగ్రామ్‌...

ఒకవేళ మీకు యాప్‌లో కనిపించే వస్తువు నచ్చినట్లైతే, యాప్ నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడే కొనుగోలు చేయవచ్చు

ఈ-కామర్స్‌ రంగంలోకి అడుగు పెట్టనున్న ఇన్‌స్టాగ్రామ్‌...

ప్రముఖ మెసేజింగ్ యాప్ ఫేస్బుక్ కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్‌ కొత్తగా ఈ-కామర్స్‌ రంగంలోకి అడుగు పెట్టింది. దీనిలో భాగంగా ‘చెక్అవుట్’ బటన్‌ను తన యాప్‌లో ఏర్పాటు చేసింది. యాప్‌ బీటా వెర్షన్‌లో కనిపించే ఉత్పత్తులను అప్పటికప్పుడు కొనుగోలు చేసేందుకు ఇది సహాయపడుతుంది. ప్రస్తుతం అమెరికాలోని కొన్ని వ్యాపార సంస్థలు మాత్రమే దీనిలో వ్యాపారం చేసుకునే అవకాశాన్ని పొందాయి. ఇంస్టాగ్రామ్ లో మనకు ఉత్పత్తులు కనిపించినప్పుడు, దాని కింద చెక్అవుట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని అనుసరించడం ద్వారా ఉత్పతులను కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులు చెక్అవుట్ బటన్ ను క్లిక్ చేయడం ద్వారా సైజు లేదా రంగు వంటి ఆప్షన్స్ ను ఎంచుకోవడంతో పాటు, ఇంస్టాగ్రామ్ యాప్ నుంచి బయటికి వెళ్లకుండానే చెల్లింపు చేయవచ్చు. “మేము ఇన్‌స్టాగ్రామ్‌లో చెక్అవుట్ ఆప్షన్‌ను ఏర్పాటు చేశామని” సిలికాన్‌ వ్యాలీలోని ఫేస్‌బుక్‌ విభాగం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఒకవేళ మీకు యాప్‌లో కనిపించే వస్తువు నచ్చినట్లైతే, యాప్ నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడే కొనుగోలు చేయవచ్చు. గతంలో, ఇంస్టాగ్రామ్ పోస్టులలోని ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే వారు, యాప్ నుంచి బయటికి వచ్చి ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ల లింకులను అనుసరించాల్సి వచ్చేది.

ఇంస్టాగ్రామ్ ప్రకటన ప్రకారం, మీరు మొదటిసారి కొనుగోలు చేసే సమయంలో నమోదు చేసిన సమాచారం (చెల్లింపు వివరాలు, క్రెడిట్ కార్డు / డెబిట్ కార్డు సమాచారం) మీ భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేస్తారు. అయితే, సమాచారం దుర్వినియోగం విషయంలో ఫేస్ బుక్ ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంది. మరి దీనిని సక్రమంగా ఎలా నిర్వహిస్తుందో చూడాలి.

ప్రస్తుతం అడిడాస్, బర్బెర్రీ, డియోర్, హెచ్&ఎమ్, నైక్, ఆస్కార్ డీ లా రెంటా, ప్రాడా, గ్లాసెస్ రీటైలర్ వార్ బై పార్కర్ వంటి బ్రాండ్లు మాత్రమే చెక్అవుట్ ఫీచర్ లో పాల్గొంటున్నాయి.

ఫేస్‌బుక్‌ సంపాదించే ఆదాయంలో పెద్ద మొత్తం కేవలం డిజిటల్ ప్రకటనల నుంచే రావడం విశేషం.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly