ప్రావిడెండ్ ఫండ్‌, సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌ వ‌డ్డీ రేట్లు య‌థాత‌ధం

పీపీఎఫ్‌, చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీరేట్లను త్రైమాసికంగా స‌వ‌రిస్తారు

ప్రావిడెండ్ ఫండ్‌, సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌ వ‌డ్డీ రేట్లు య‌థాత‌ధం

2019-20 ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి త్రైమాసికానికి(ఏప్రిల్‌1,2019 నుంచి జూన్ 30,2019 వ‌ర‌కు) ప్రావిడెండ్ ఫండ్‌(పీపీఎఫ్), సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ప‌థ‌కాల వ‌డ్డీ రేట్లు య‌థాత‌ధంగా కొన‌సాగుతాయ‌ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌స్తుతం త్రైమాసికంగా పున‌రుద్ద‌రిస్తున్నారు. 2018-19 చివ‌రి త్రైమాసికానికి అమ‌లైన వ‌డ్డీ రేట్లు 2019-20 మొద‌టి త్రైమాసికానికి అమ‌లవుతాయిని తెలిపింది. ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌, 5 సంవ‌త్స‌రాల జాతీయ‌పొదుపు ప‌త్రాల వ‌డ్డీ రేట్లులో మార్పులేదు. ప్ర‌స్తుతం ఉన్న 8 శాతం వ‌డ్డీ రేటును కొన‌సాగించ‌నున్నారు. 5 సంవ‌త్స‌రాల నెల‌వారీ పొదుపు ప‌థ‌కానికి 7.7 శాతం వ‌డ్డీ కొన‌సాగుతుంది. 5 సంవ‌త్స‌రాల పొదుపు ప‌థ‌కంపై సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 8.7 శాతం వ‌డ్డీ ఇస్తున్నారు. ఈ స్కీమ్‌లో వ‌డ్డీని త్రైమాసికంగా చెల్లిస్తారు. సాధార‌ణ పొదుపు ఖాతాల‌పై వార్షికంగా 4 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. బాలిక‌ల కోసం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ పెట్టిన సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ప‌థ‌కంపై 8.5 శాతం వ‌డ్డీ రేటు అమ‌లవుతుంది.

ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌(పీపీఎఫ్‌), కిసాన్ వికాస్ ప‌త్రా(కేవీపీ), జాతీయ పొదుపు ప‌త్రాలు(నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికేట్‌), నెల‌వారీ పొదుపు ప‌థ‌కాలు, పెద్ద‌ల పొదుపు ప‌థ‌కాలు(ఎస్‌సీఎస్ఎస్‌), సుక‌న్య స‌మృద్ధి ప‌థ‌కం(ఎస్ఎస్ఎస్) మొద‌లైన ప‌థ‌కాల‌పై అక్టోబ‌ర్‌-డిసెంబ‌ర్ త్రైమాసికంలో 40 బేసిస్ పాయింట్ల ఆదారంగా ప్ర‌భుత్వం వ‌డ్డీ రేట్ల‌ను పెంచింది. ఈ ప‌థకాలు ఆక‌ర్షింగా ఉండ‌డం వ‌ల్ల చాలా మంది పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఈ ప‌థ‌కాలలో మ‌దుపు చేసే వారి పెట్టుబ‌డులు 100 శాతం సుర‌క్షితంగా ఉంటాయి. 1,2,3 సంవ‌త్స‌రాల పోస్టాఫీసు డిపాజిట్ల‌పై 7 శాతం, 5 సంవ‌త్సరాల డిపాజిట్ల‌పై 7.8 శాతం వ‌డ్డీ రేటు వ‌ర్తిస్తుంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly