వ్యక్తిగత రుణాలపై వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు..

వ్యక్తిగత రుణాలపై వర్తించే వడ్డీ రేట్లు, కారు రుణాలపై వర్తించే వడ్డీ రేట్ల కంటే కూడా ఎక్కువగా ఉంటాయి

వ్యక్తిగత రుణాలపై వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు..

త‌క్ష‌ణ రుణ స‌దుపాయం సుల‌భంగా పొందే మార్గ‌ల‌లో వ్య‌క్తిగ‌త రుణం ఒక‌టి. సాధారణంగా వ్య‌క్తిగ‌త రుణాలను ఉన్న‌త విద్య‌, వైద్య ఖ‌ర్చులు, కుటుంబ విహార‌యాత్ర‌, వివాహ ఖ‌ర్చులు వంటి వివిధ అవ‌స‌రాల‌ కోసం తీసుకుంటాం. ఒకవేళ మీరు ఇప్పటికే ఏదైనా బ్యాంకులో ఖాతాను కలిగి ఉన్నట్లయితే, సదరు బ్యాంకు వ్యక్తిగత రుణాలకు సంబంధించిన అనేక ఆఫర్లను మీకు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటారు. ఇటువంటి రుణాలను పొందడం చాలా సులభం. అయితే, మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇటువంటి రుణాలపై వర్తించే వడ్డీ రేట్లు, కారు రుణాలపై వర్తించే వడ్డీ రేట్ల కంటే కూడా ఎక్కువగా ఉంటాయి.

వ్యక్తిగత రుణాలనేవి అసురక్షిత రుణాలు. వీటిని పొందడానికి మీరు ఎలాంటి ఆస్తిని లేదా బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే రుణదాతలు మీ ఆదాయం, అప్పులు, తిరిగి చెల్లించే సామర్థ్యం వంటి కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వడ్డీ రేటు, రుణ మొత్తాన్ని ఆఫర్ చేస్తారు.

ప్రస్తుతం అనేక రకాల వ్యక్తిగత రుణాలు అందుబాటులో ఉన్నాయి, వీటిలో కొన్నింటిని తక్షణ రుణాలు లేదా ముందుగా ఆమోదించిన రుణాలు అని పిలుస్తారు. మీకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని (సిబిల్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్) రుణదాతలు ముందుగానే తెలుసుకుని, వాటి ఆధారంగా మీకు ఈ రుణాలను అందిస్తారు. వీటిని పొందడం సులభమే, కానీ వాటిని తిరిగి చెల్లించడం అంత సులభమేమీ కాదు.

భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై విధించే వడ్డీ రేట్లు, ఇతర ఫీజులకు సంబంధించిన వివరాలను మీకోసం కింద తెలియచేశాము.

personalloan_1556452285704.png

(Source - livemint)

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly