పొస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్లు

పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌పై 4 నుంచి 8.7 శాతం వ‌ర‌కు వ‌డ్డీ ల‌భిస్తుంది.

పొస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్లు

భార‌తీయ తపాలా శాఖ తొమ్మిది ర‌కాల చిన్న మొత్తాల‌ పొదుపు ప‌థ‌కాల‌ను అందిస్తుంది. ఇందులో జాతీయ పొదుపు స‌ర్టిఫికేట్‌లు(ఎన్‌పీఎస్), కిసాన్ వికాస్ ప‌త్రాలు (కేవీపీ), పెద్ద‌ల పొదుపు ఖాతాలు (ఎస్‌సీఎస్ఎస్‌)ల‌లో 4 నుంచి 8.7 శాతం వ‌డ్డీని పోస్టాఫీసు అందిస్తుంది. ఈ వ‌డ్డీ రేట్లు 2018-19 ఆర్థిక‌ సంవ‌త్స‌ర మూడ‌వ త్రైమాసికానికి అమ‌లు చేస్తారు. పొదుపు ఖాతా, 5 సంవ‌త్స‌రాల రిక‌రింగ్ డిపాజిట్‌, టైమ్ డిపాజిట్‌(టీడీ) నెల‌వారి ఆదాయ ప‌థ‌కం, సీనియ‌ర్ సిటిజ‌న్ పొదుపు ప‌థ‌కం, ప్ర‌జా భ‌విష్య నిధి (పీపీఎఫ్), జాతీయ పొదుపు ప‌త్రాలు, కేవీపీ, సుక‌న్య స‌మృద్ది యోజ‌న వంటి ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌తి త్రైమాసికానికి ప్ర‌భుత్వం పున‌రుద్ద‌రిస్తుంది.

చిన్న మొత్తాల పొదుపు ఖాతాల‌ను తెరిచేందుకు క‌నీస పెట్టుబ‌డి వాటికి వ‌ర్తించే వ‌డ్డీ రేట్లు:

post office.jpg
 1. పోస్టాఫీసు పొదుపు ఖాతా:
  భార‌త త‌పాలా శాఖ, 1.5 ల‌క్ష‌ల పోస్ట‌ల్ కార్యాల‌యాల‌తో దేశ‌మంత‌టా విస్త‌రించింది. పోస్టాఫీసు సాదార‌ణ పొదుపు ఖ‌తాకు వార్షికంగా 4 శాతం వ‌డ్డీని అందిస్తుంది. పొదుపు ఖాతాను తెరిచేందుకు కావ‌ల‌సిన క‌నీస మొత్తం రూ. 20. ఖాతా తెరిచిన అనంత‌రం, చెక్కు సౌక‌ర్యం లేకుండా రూ. 50 క‌నీస మొత్తాన్ని నిర్వహిస్తూ ఖాతాను కొన‌సాగించ‌వ‌చ్చు.

 2. 5- సంవ‌త్స‌రాల పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ ఖాతా (ఆర్‌డీ):
  రిక‌రింగ్ డిపాజిట్ ఖాతా 7.3 శాతం వ‌డ్డీని పోస్టాఫీసు చెల్లిస్తుంది. క‌నీసం రూ. 10, నెల‌వారిగా జ‌మ‌చేస్తూ మెచ్యూరిటి స‌మ‌యానికి రూ. 725.05 పొంద‌వ‌చ్చు. 5 సంవ‌త్స‌రాల రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాను తెరిచేందుకు కావ‌ల‌సిన క‌నీస మొత్తం నెల‌కు రూ. 10

 3. పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ ఖాతా (టీడీ)
  పోస్టాఫీసు టైమ్ డిపాజిట్‌ను పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా అని కూడా పిలుస్తారు. దీనిలో 4 ర‌కాలుగా, ఒకటి, రెండు, మూడు, ఐదు సంవ‌త్స‌రాల‌కు మెచ్యూరిటీ పిరియ‌డ్‌లు అందుబాటులో ఉన్నాయి. దీనిలో వ‌డ్డీని త్రైమాసికంగా లెక్కిస్తారు. కానీ సంవ‌త్స‌రానికి ఒక సారి వ‌డ్డీ చెల్లిస్తారు. వ‌డ్డీ రేట్లు 1,2,3,5 సంవ‌త్స‌రాకు వ‌రుస‌గా 6.9, 7, 7.2, 7.8 శాతంగా ఉన్నాయి.

 1. పోస్టాఫీసు మంత్లీ ఆదాయం పథకం (ఎమ్ఐఎస్‌) ఖాతా
  వార్షిక రాబ‌డి 7.3 శాతం, వ‌డ్డీని నెల‌వారీగా చెల్లిస్తారు. ఎమ్ఐఎస్ ఖాతాలో క‌నీస పెట్టుబ‌డి రూ. 1500.

 2. సీనియర్ సిటిజ‌న్‌ పొదుపు పథకం (ఎస్‌సీఎస్ఎస్‌)
  వార్షికంగా 8.7 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. డిపాజిట్ చేసిన తేది నాటి నుంచి మార్చి 31, జూన్ 30, సెప్టెంబ‌రు 30 తేదిల‌లో చెల్లిస్తారు. ఈ ప‌థ‌కం బ్యాంకుల‌లో కూడా అందుబాటులో ఉంది. క‌నీస పెట్టుబ‌డి రూ. 1000.

 3. 15 సంవత్సరాల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతా:
  వ‌డ్డీ రేటు 8 శాతంగా వుంది. సంవ‌త్స‌రానికి ఒకసారి కౌంపౌండ్ చేస్తారు. ఈ పథ‌కం బ్యాంకుల‌లో కూడా అందుబాటులో ఉంది. క‌నీస పెట్టుబ‌డి రూ.500.

 4. జాతీయ పొదుపు సర్టిఫికేట్లు (ఎన్ఎస్ సీ)
  వ‌డ్డీ రేటు 8 శాతంగా వుంది. దీనిలో వ‌డ్డీని త్రైమాసికంగా లెక్కిస్తారు. కానీ సంవ‌త్స‌రానికి ఒక సారి వ‌డ్డీ చెల్లిస్తారు. దీనిలో 5 సంవ‌త్స‌రాల లాక్ ఇన్ పిరియ‌డ్ ఉంటుంది. రూ.100 విలువ గ‌ల ఎన్ఎస్‌సీకి 5 సంవ‌త్స‌రాల మెచ్యూరీటీ పిరియ‌డ్‌కి గాను రూ. 146.93 వ‌స్తుంది. క‌నీస పెట్టుబ‌డి రూ. 100.

 5. కిసాన్ వికాస్ ప‌త్రా (కేవీపీ)
  వ‌డ్డీ రేటు 7.7 శాతంగా ఉంది. సంవ‌త్స‌రానికి ఒక‌సారి వ‌డ్డీ కాంపౌండ్ చేస్తారు. కేవీపీ మెచ్యూరిటీ పిరియ‌డ్‌ను 118 నుంచి 112 నెల‌ల‌కు త‌గ్గించారు. కేవీపీలో పెట్టుబ‌డి పెట్టిన మొత్తం 112 నెల‌లు(9 సంవ‌త్స‌రాల 4 నెల‌లు)లో రెట్టింపు అవుతుంది. క‌నీస పెట్టుబ‌డి రూ. 1000

 6. సుకన్య స‌మృద్ధి యోజ‌న ఖాతా:
  బాలిక‌ల కోసం ఏర్పాటు చేసిన ప‌థ‌కం. వ‌డ్డీ సంవ‌త్స‌రానికి 8.5 శాతంగా వుంది. సంవ‌త్స‌రానికి ఒక‌సారి వ‌డ్డీ లెక్కిస్తారు, ఈ ప‌థ‌కం బ్యాంకుల‌లో కూడా అందుబాటులో ఉంది. క‌నీస డిపాజిట్ మొత్త‌న్ని రూ.1000 నుంచి రూ. 250 కి ప్ర‌భుత్వం త‌గ్గించింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly