పీఎఫ్ మొత్తం స‌రిపోతుందా?

రిటైర్‌మెంట్ కార్ప‌స్‌ను స‌మ‌కూర్చుకునేందుకు అందుబాటులో ఉన్న పెట్టుబ‌డి మార్గాల‌ను ఈ క‌థ‌నంలో చూద్దాం

పీఎఫ్ మొత్తం స‌రిపోతుందా?

పదవీ విరమణ తరువాత జీవితం మరొక అద్భుతమైన కాలం. చిన్న‌తనం నుంచి చ‌దువులు, ఆపై ఉద్యోగం, పెళ్ళి, పిల్ల‌లు, వారి భ‌విష్య‌త్తును తీర్చిదిద్ద‌డం వంటి వాటితో బిజిగా గ‌డిపేస్తుంటారు. ఇంత కాలం సంపాదించున్న‌ జ్ఞానం, అనుభవంతో, కుటుంబం, స్నేహితులకు మార్గనిర్దేశం చేస్తూ ప్ర‌శాంత‌మైన జీవితాన్ని ఆస్వాదించేంద‌కు త‌గిన‌ ప‌ద‌వీ విమ‌ర‌ణ నిధిని ఏర్పాటు చేసుకోవ‌డం అవ‌స‌రం

కానీ చాలామంది రైట‌ర్‌మెంట్ కార్ప‌స్ కోసం ఎంచుకున్న ప‌థ‌కానికి చేసే కాంట్రీబ్యూష‌న్‌, ఆ ప‌థ‌కం ద్వారా వ‌చ్చే మొత్తం చివ‌రి వ‌ర‌కు స‌రిపోతుంద‌ని భావిస్తారు. మ‌రి ఈ మొత్తం స‌రిపోతుందా? పురుషుల‌తో పోలిస్తే మ‌హిళ‌ల జీవిత‌కాలం ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల మ‌రికొంత మొత్తాన్ని సిద్ధంచేసుకోవాలి. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత పిల్ల‌ల‌ నుంచి కూడా ఆర్థిక సహాయం ఆశించలేరు. కార‌ణం పిల్ల‌ల‌కు తమ కుటుంబ బాధ్యతలను నెర‌వేర్చ‌డంతోనే స‌రిపోతుంది.

ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని ఏర్పాటు చేసుకునేందుకు ప్రధాన మార్గం ఈపీఎఫ్‌- ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్, ఇందులో ఉద్యోగులు వారి జీతంలో(బేసిక్‌+డీఏ) నుంచి 12 శాతం మొత్తాన్ని ఈపీఎఫ్ చెల్లించాలి. అదే విధంగా సంస్థ కూడా ఉద్యోగి చెల్లింపుల‌కు స‌మాన‌మైన (ఉద్యోగి జీతంపై 12 శాతం) మొత్తాన్ని ఈపీఎఫ్‌కు చెల్లిస్తుంది. అయితే ఈ మొత్తంలో 3.67 శాతం మాత్ర‌మే ఈపీఎఫ్ ఖాతాకు చేరుతుంది. మిగిలిన 8.33 శాతం ఉద్యోగుల పెన్ష‌న్ స్కీమ్‌కు చేరుతుంది. అంటే ఉద్యోగి జీతం (బేసిక్‌+డీఏ)పై 15.67 శాతం ప్ర‌తీ నెలా ఈపీఎఫ్ ఖాతాకు చేరుతుంది. వ‌డ్డీ రేటు వార్షికంగా 8 శాతం. వ‌డ్డీ రేట్లను ప్ర‌తీ సంవ‌త్స‌రం కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంది.

ఉదాహ‌ర‌ణ‌: అనిల్‌కు 30 సంవ‌త్స‌రాలు, మ‌రో 30 సంవ‌త్స‌రాలు ప‌నిచేసి 60 సంవ‌త్స‌రాల వ‌య‌సులో రిటైర్ అవ్వాల‌నుకుంటున్నాడు. అత‌ను, అత‌ని భార్య 80 సంవ‌త్స‌రాల వ‌ర‌కు జీవిస్తార‌నుకుంటే ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత మ‌రో 20 సంవ‌త్స‌రాల జీవితానికి నిధిని స‌మ‌కూర్చుకోవాలి. అనిల్ ప్ర‌స్తుత నెల‌వారీ ఆదాయం రూ.50 వేలు, నెల‌వారీ ఖ‌ర్చులు రూ.20 వేలు.

జీతం(బేసిక్‌+డీఏ) నుంచి అనిల్ ఈపీఎఫ్ చెల్లించే మొత్తం రూ.15 వేలు. అత‌ని వార్షిక ఇంక్రిమెంట్ 7 శాతం. మొత్తం ప‌ని కాలానికి గానూ పీఎఫ్ ఖాతాపై వ‌చ్చే వ‌డ్డీ వార్షికంగా 8 శాతం అనుకుంటే, ఈపీఎఫ్ ఖాతా ద్వారా అత‌ని ఏర్పాటు చేసుకునే నిధి రూ.70 ల‌క్ష‌లు.
ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత కూడా అత‌ను ఇప్పుడు ఉన్న ప్ర‌మాణాల‌తో జీవిస్తే, వార్షికంగా 6 శాతం ద్ర‌వ్యోల్భ‌ణ రేటుతో అత‌ను కుటుంబ నెల‌వారీ ఖ‌ర్చుల‌కు కావ‌ల‌సిన మొత్తం రూ. 1,15,000. దీని ప్ర‌కారం 20 సంవ‌త్స‌రాల ప‌ద‌వీవిర‌మ‌ణ జీవితానికి, 8 శాతం రాబ‌డి, 6 శాతం ద్ర‌వ్యోల్బ‌ణ రేటుతో వారికి రూ.2.33 కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయి. ఇందులో ఈపీఎఫ్ ద్వారా వ‌చ్చే మొత్తం రూ.70 ల‌క్ష‌లు. ఇప్పుడు త‌లెత్తే ప్ర‌శ్న మిగిలిన రూ.1.63 కోట్లు(రూ.2.33 -0.70 కోట్లు) ఎలా స‌మ‌కూర్చుకోవాలి?

ప‌ద‌వి విర‌మ‌ణ జీవితానికి నిధిని ఏర్పాటు చేసుకునేందుకు ఉన్న మార్గాలు ఏంటి?

అందుబాటులో ఉన్న ఇత‌ర మార్గాలు:

  1. అనిల్ కుటుంబ ఖ‌ర్చుల‌ను వారు ఏర్పాటు చేసుకున్న ఈపీఎఫ్ నిధికి త‌గిన‌ట్లుగా సర్దుబాటు చేసుకోవాలి. అంటే ప‌ద‌వీ విర‌మ‌ణ నాటి ఖ‌ర్చుల‌లో 1/3 వంతు(35 శాతానికి) త‌గ్గించుకోవాలి. పెరుగుతున్న వైద్య ఖ‌ర్చుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే ఇది చాలా కష్టంమ‌నే చెప్పుకోవాలి.
  2. భ‌ద్రత క‌లిగిన ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌(పీపీఎఫ్‌) లేదా వేరియ‌బుల్ ఫ్రావిడెండ్ ఫండ్‌(వీపీఎఫ్)ల‌లో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఇవి దాదాపు 8 శాతం ఖ‌చ్చిత‌మైన రాబ‌డిని అందిస్తాయి. దీనివ‌ల్ల ప్రారంభం నుంచి అధిక మొత్తాల‌ను పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది. దీంతో ఇత‌ర ఆర్థిక ల‌క్ష్యాల‌కు కేటాయించిన మొత్తాన్ని ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి పెట్టుబ‌డులకు కేటాయించ‌వ‌ల‌సి రావ‌చ్చు. దీనివ‌ల్ల ఇత‌ర ఆర్థిక ల‌క్ష్యాల‌కు ఆటంకం ఏర్ప‌డుతుంది.
  3. ఎన్‌పీఎస్‌- నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్ అనేది మ‌రొక మార్గం. మీ నెల‌వారీ చెల్లింపుల‌లో 75 శాతం ఈక్వీటీల‌లో మ‌దుపు చేస్తారు. అందువ‌ల్ల దీర్ఘ‌కాలంలో సంప‌ద‌ను వృద్ధి చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ప్ర‌స్తుత నియ‌మాల ప్ర‌కారం 60 శాతం నిధి ప‌న్ను ర‌హితంగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. మిగిలిన 40 శాతం మొత్తాన్ని పెన్ష‌న్ ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డి పెట్టాలి. 10 శాతం రాబ‌డిని ఆశించ‌వ‌చ్చు.
  4. ఈక్వీటీ మ్యూచువ‌ల్ ఫండ్లు -ఇండెక్స్ ఫండ్లు, ఈటీఎఫ్‌లు, లార్జ్‌క్య‌ప్ ఫండ్లు ఇందులోకి వ‌స్తాయి. దీర్ఘ‌కాలంలో(10 లేదా అంత‌కంటే ఎక్కువ సంవ‌త్స‌రాలు) మంచి కార్ప‌స్ ఏర్పాటు చేసుకునేందుకు ఒక మంచి ఎంపిక‌గా చెప్పుకోవ‌చ్చు. ఈక్వీటీలు స్వ‌ల్ప‌కాలంలో అస్థిరంగా ఉంటాయి. కానీ దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డిని అందిస్తాయి. దీర్ఘ‌కాలం పాటు ఈక్వీటీల‌ను కొన‌సాగించేందుకు సంక‌ల్పం అవ‌స‌రం. ఇందులో 12 శాతం రాబ‌డిని ఆశించ‌వ‌చ్చు.

30 సంవ‌త్స‌రాల త‌రువాత రూ.1.63 కోట్ల నిధిని ఏర్పాటు చేసేందుకు నెల‌వారీగా పెట్ట‌వ‌ల‌సిన పెట్టుబ‌డి:
PENSION.jpg

వివిధ ఆదాయ వ‌ర్గాల వారికి ప‌దివీ విర‌మ‌ణ జీవితానికి కావ‌ల‌సిన నిధిని ఈ కింది ప‌ట్టికలో చూడ‌చ్చు.
ఉదాహ‌ర‌ణ‌:1 ప‌ట్టిక ఏ(నెల‌వారీ ఖ‌ర్చులు రూ. 10 వేలు(వార్షిక ఖ‌ర్చులు రూ. 1.20 ల‌క్ష‌లు)):

అతుల్ నెల‌వారీ ఖ‌ర్చులు రూ. 10 వేలు( వార్షికంగా రూ. 1.20 ల‌క్ష‌లు) ఈ రోజు నుంచి 10 సంవ‌త్స‌రాల త‌రువాత రిటైర్ అవ్వాల‌నుకుంటున్నాడు. అత‌నికి ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం 10 సంవ‌త్స‌రాల జీవితానికి విర‌మ‌ణ నిధి కావాలి. ద్ర‌వ్యోల్భ‌ణం 6 శాతంగా తీసుకుంటే 10 సంవ‌త్స‌రాల త‌రువాత వార్షిక ఖ‌ర్చులు రూ. 2,14,902.
8 శాతం రాబ‌డి, 6 శాతం ద్ర‌వ్యోల్భ‌ణ ప్ర‌భావంతో రూ. 19.78 ల‌క్ష‌ల ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి అవ‌స‌రం అవుతుంది.

EXP-LIFE-A.jpg

ఉదాహ‌ర‌ణ‌:2 ప‌ట్టిక బీ (నెల‌వారీ ఖ‌ర్చులు రూ. 15 వేలు( వార్షిక ఖ‌ర్చులు రూ. 1.80 ల‌క్ష‌లు) )

రాజేష్‌ నెల‌వారీ ఖ‌ర్చులు రూ. 15 వేలు( వార్షికంగా రూ. 1.80 ల‌క్ష‌లు) ఈ రోజు నుంచి 20 సంవ‌త్స‌రాల త‌రువాత రిటైర్ అవ్వాల‌నుకుంటున్నాడు. అత‌నికి ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం 15 సంవ‌త్స‌రాల జీవితానికి విర‌మ‌ణ నిధి కావాలి. ద్ర‌వ్యోల్భ‌ణం 6 శాతంగా తీసుకుంటే 20 సంవ‌త్స‌రాల త‌రువాత వార్షిక ఖ‌ర్చులు రూ. 5,77,284.
8 శాతం రాబ‌డి, 6 శాతం ద్ర‌వ్యోల్భ‌ణ ప్ర‌భావంతో రూ. 76.22 ల‌క్ష‌ల ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి అవ‌స‌రం అవుతుంది.

EXP-LIFE-B.jpg

ఉదాహ‌ర‌ణ‌:3 ప‌ట్టిక సీ(నెల‌వారీ ఖ‌ర్చులు రూ. 20 వేలు ( వార్షిక ఖ‌ర్చులు రూ. 2.40 ల‌క్ష‌లు))

శ‌ర‌త్ నెల‌వారీ ఖ‌ర్చులు రూ. 20 వేలు( వార్షికంగా రూ. 2.40 ల‌క్ష‌లు) ఈ రోజు నుంచి 25 సంవ‌త్స‌రాల త‌రువాత రిటైర్ అవ్వాల‌నుకుంటున్నాడు. అత‌నికి ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం 15 సంవ‌త్స‌రాల‌ జీవితానికి విర‌మ‌ణ నిధి కావాలి. ద్ర‌వ్యోల్భ‌ణం 6 శాతంగా తీసుకుంటే 25 సంవ‌త్స‌రాల త‌రువాత వార్షిక ఖ‌ర్చులు రూ. 10,30,049.
8 శాతం రాబ‌డి, 6 శాతం ద్ర‌వ్యోల్భ‌ణ ప్ర‌భావంతో రూ. 1.36 కోట్ల‌ ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి అవ‌స‌రం అవుతుంది.

EXP-LIFE-C.jpg

ఉదాహ‌ర‌ణ‌:4 ప‌ట్టిక డీ (నెల‌వారీ ఖ‌ర్చులు రూ. 25 వేలు (వార్షిక ఖ‌ర్చులు రూ. 3.00 ల‌క్ష‌లు))

క‌ర‌ణ్‌ నెల‌వారీ ఖ‌ర్చులు రూ. 25 వేలు( వార్షికంగా రూ. 3.00 ల‌క్ష‌లు) ఈ రోజు నుంచి 30 సంవ‌త్స‌రాల త‌రువాత రిటైర్ అవ్వాల‌నుకుంటున్నాడు. అత‌నికి ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం, 25 సంవ‌త్స‌రాల జీవితానికి విర‌మ‌ణ నిధి కావాలి. ద్ర‌వ్యోల్భ‌ణం 6 శాతంగా తీసుకుంటే 30 సంవ‌త్స‌రాల త‌రువాత వార్షిక ఖ‌ర్చులు రూ. 17,23,047.
8 శాతం రాబ‌డి, 6 శాతం ద్ర‌వ్యోల్భ‌ణ ప్ర‌భావంతో రూ. 3.47 కోట్ల‌ ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి అవ‌స‌రం అవుతుంది.

EXP-LIFE-D.jpg

చివ‌రిగా:

  • ఒకే ప‌థ‌కంపై ఆధార‌ప‌డ‌డం కంటే 2 నుంచి 3 ప‌థ‌కాల‌ను ఎంచుకుని పెట్టుబ‌డులు చేయ‌డం మంచిది.
  • యుక్త వ‌య‌సులో రిస్క్ తీసుకోక‌పోవ‌డం కూడా ప్ర‌మాద‌మే. ఎందుకంటే యుక్త వ‌య‌సులో రిస్క్ తీసుకునే సామ‌ర్ద్యం ఎక్కువ‌గా ఉంటుంది.
  • పెట్టుబ‌డులు చేసేప్పుడు రాబ‌డి, భ‌ద్ర‌త‌, లిక్వీడిటీ, గరిష్ట ప‌రిమితి, లాక్‌-ఇన్‌-పిరియ‌డ్‌, ప‌న్ను వ‌ర్తింపులు మొద‌లైన‌వి ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి.
  • ఎప్ప‌టిక‌ప్పుడు లోటు పాట్ల‌ను తెలుసుకునేందుకు గానూ మీ పోర్ట్‌ఫోలియోను ప్ర‌తి సంవ‌త్స‌రం స‌మీక్షించుకుని అవ‌స‌ర‌మైన మార్పులు చేసుకోవాలి.
  • అదేవిధంగా మీకున్న ప్ర‌తీ ల‌క్ష్యాన్ని, అందుకు ఉన్న స‌మ‌యాన్ని అంచ‌నా వేసి త‌గిన పెట్టుబ‌డులు పెట్టాలి.
  • మీ ల‌క్ష్యానికి చేరువ‌య్యే 2 నుంచి 3 సంవ‌త్స‌రాల‌కు ముందే ఈక్వీటీ ఫండ్ల నుంచి డెట్ ఫండ్ల‌లోకి నిధుల‌ను మార్పు చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ మార్కెట్ల అస్థిర‌ ప్ర‌భావానికి గురి కాకుండా జాగ్రత్త ప‌డ‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly