పేటీఎం మ‌నీ ద్వారా ఎన్‌పీఎస్ ప్రారంభిస్తున్నారా?

పేటీఎం మ‌నీ యాప్ ద్వారా ఎన్‌పీఎప్ కొనుగోలు చేయ‌డం కొంత ఖ‌ర్చుతో కూడుకున్న‌ది అయిన‌ప్ప‌టికీ సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది.

పేటీఎం మ‌నీ ద్వారా ఎన్‌పీఎస్ ప్రారంభిస్తున్నారా?

వ‌న్97 క‌మ్యూనికేష‌న్ లిమిటెడ్ సంస్థ‌లో భాగ‌మైన పేటీఎమ్‌, పేటీఎమ్ మ‌నీ పేరుతో మ్యూచువ‌ల్ ఫండ్ ప్లాట్‌ఫార‌మ్‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం ఈ ప్లాట్ ఫారం ద్వారా జాతీయ ఫించ‌ను ప‌థ‌కాన్ని ఆఫ‌ర్ చేసేందుకు పెన్ష‌న్ ఫండ్ రెగ్యూలేట‌రీ అండ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) అనుమ‌తి ల‌భించింది. దీంతో ఈ సంస్థ పాయింట్ ఆఫ్ ప్రెసెన్స్‌(పీఓపీ) లైసెన్స్ కోసం పోటీప‌డే సంస్థ‌ల జాబితాలో చేరింది. ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ రెండింటిని క‌లిపి పీఓపీ లైసెన్స్‌ ఉన్న సంస్థల సంఖ్య గత 12 నెలల్లో 70 నుంచి 100 వరకు పెరిగింది.

ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌కు ఎన్‌పీఎస్ స‌రైన ఎంపిక‌. అయితే ప్ర‌స్తుతం పేటీఎమ్‌ మనీ వినియోగదారులకు డిజిటల్, పేపర్‌ర‌హిత ఎన్‌పీఎస్‌ పెట్టుబడి సౌలభ్యాన్ని త్వ‌ర‌లోనే తీసుకురానుంద‌ని పేటీఎమ్ మ‌నీ హోల్ టైమ్ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ జాద‌వ్ తెలిపారు. పేటీఎమ్ మ‌నీ మ్యూచువ్ ఫండ్ యాప్‌ను సెప్టెంబ‌ర్ 2018లో ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఇందులో 10 ల‌క్ష‌ల మంది వినియోగ‌దారులు ఉన్నారు.

ఒక మ్యూచువ‌ల్ ఫండ్ ప్లాట్ ఫామ్ ద్వారా ఎన్‌పీఎస్‌ను ఆఫ‌ర్ చేయ‌డం ఇది మొద‌టిసారి కాదు. ఫండ్స్ ఇండియా, ఐఎల్‌&ఎఫ్ఎస్ స‌ర్వీసెస్ లిమిటిడ్‌తో క‌లిసి చాలా సంవ‌త్స‌రాల క్రిత‌మే ఎన్‌పీఎస్ పెట్టుబ‌డుల‌ను ఆఫ‌ర్ చేయ‌డం ప్రారంభించింది. అయితే పీఓపీ నిబంధ‌న‌ల‌తో వ‌చ్చిన మార్పులు వ‌ల్ల ఈ సేవ‌ల‌ను సంస్థ ర‌ద్దు చేసింది. ఫిన్‌విజార్డ్ టెక్నాల‌జీ ప్రైవేట్ లిమిటెడ్ లో భాగ‌మైన మైవేవెల్త్‌(గ‌తంలో ఫిస్‌డ‌మ్‌) కూడా ల‌క్ష్మి విలాస్ బాంక్‌తో క‌లిసి మ్యూచువ్ ఫండ్ యాప్‌లో మార్చి 2018 నుంచి ఎన్‌పీఎస్‌ను ఆఫ‌ర్ చేయ‌డం ప్రారంభించింది. జూలై 9, 2018 తేదిన‌ ఆన్‌లైన్ పీఓపీ కోసం, పీఎఫ్‌ఆర్‌డీఏ నియమాలను ప్రకటించిన తరువాత, సంస్థ ఆన్‌లైన్ పీఓపీగా మారింది.

ఎన్‌పీఎస్ ఆప‌ర్ల ప్ర‌యోజ‌నాలు:

ఎన్‌పీఎస్ చేసే పెట్టుబ‌డుల‌కు సెక్ష‌న్ 80సీ కింద రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. సెక్ష‌న్ 80సీసీడీ(1బీ) ప్ర‌కారం అద‌నంగా రూ.50 వేల మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

పెట్టుబ‌డి మొత్తాన్ని చందాదారుడు ఎంపిక చేసుకున్న ప్ర‌కారం ఈక్వీటీ, కార్పొరేట్ డెట్‌, గ‌వ‌ర్న‌మెంట్ డెట్ల క‌ల‌యిక‌తో పెట్ట‌వ‌చ్చు. మెచ్యూరిటీ స‌మ‌యంలో 40 శాతం కార్ప‌స్‌ను యాన్యూటీ కొనుగోలు చేసేందుకు ఉప‌యోగించాలి. మిగిలిన 60 శాతం మచ్యూరిటీ స‌మ‌యంలో విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఈ మొత్తం ప‌న్ను చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.

రుసుములు:

పేటీఎమ్ వంటి ఆన్‌లైన్ పీఓపీలు, బ్యాంకుల వంటి ఆఫ్‌లైన్ పీఓపీలు రెండూ కొత్త‌గా రిజిస్ట్రేష‌న్‌, కాంట్రీబ్యూష‌న్ చేసే చందాదారులు రూ.200 చెల్లించేందుకు అనుమ‌తిస్తాయి. మీరు నేరుగా సెంట్ర‌ల్ రికార్డ్‌-కీపింగ్ ఏజెన్సీ(సీఆర్ఏ) నుంచి ఖాతా తీసుకుంటే ఛార్జీలు వేరుగా ఉంటాయి.

మీరు సీఆర్ఏ నుంచి నేరుగా ఖాతా తెర‌వ‌డం ద్వారా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ పీఓపీలు వ‌సూలు చేసే అద‌న‌పు చార్జీలను నివారించ‌వ‌చ్చు. అయితే ఎన్‌పీఎస్ ఖాతాను పీఓపీ ద్వారా తెరిచి చెల్లింపులు ఈ-ఎన్‌పీఎస్‌(సీఆర్ఏ, ఎన్ఎస్‌డీఎల్‌, కార్వే) ద్వారా చెల్లించే చందాదారులు పీఓపీల‌కు 0.10 శాతం మాత్ర‌మే క‌మీష‌న్ రూపంలో చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది.

ఆన్‌లైన్ పెట్టుబ‌డులు:
పీఓపీల ద్వారా కాకుండా, ఆన్‌లైన్‌లో నేరుగా పెట్టుబ‌డులు పెట్టాల‌నుకునే వారు, సీఆర్ఏ, ఎన్ఎస్‌డీఎల్‌, కార్వేలు అందించే ఈ-ఎన్‌పీఎస్ ద్వారా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు.సీఆర్ఏలు ఎన్‌పీఎస్ రికార్డుల‌ను నిర్వ‌హిస్తాయి. అంతేకాకుండా ఫండ్ మేనేజ‌ర్‌ను మార్చేందుకు చందాదారులు చేసే అభ్య‌ర్థ‌న‌ల‌ను కూడా ప్రాసెస్ చేస్తాయి.

మీరు పేటీఎమ్ ద్వారా గానీ, మరేదైనా పీఓపీ ద్వారా గానీ ఖాతా తెరిస్తే, రెండు సీఆర్ఏ లలో ఏదో ఒకదాని ద్వారా తదుపరి చెల్లింపులు, నిర్వ‌హ‌ణ కోసం అభ్యర్థనలు చేయవచ్చు.
పీఎఫ్ఆర్‌డీఏ నిబంధ‌న‌ల ప్ర‌కారం పీఓపీలో చందాదారుల ప్రారంభ న‌మోదు ప్ర‌క్రియ సుల‌భ‌త‌రం. దీనిలో ఆన్‌లైన్ ఫార‌మ్‌ను నింపి, చందాదారుని ఫోటోతో పాటు సంత‌కాన్ని కూడా అప్‌లోడ్ చేయాలి. త‌రువాత చందాదారులు ఫార‌మ్‌ల‌పై ఈ-సంత‌కం చేయ‌వ‌చ్చు. లేదా ప్రింట్ తీసుకుని సంత‌కం చేసి ఎన్ఎస్‌డీఎల్ కార్యాల‌యానికి పంపించ‌వ‌చ్చు. యాప్ ద్వారా సుల‌భంగా ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. చందాదారుల ప్రశ్నలకు పీఓపీ స‌మాధానం ఇవ్వ‌డం, విత్‌డ్రాకు సంబంధించిన ప్రాసెస్ చేయ‌డం వంటి అద‌న‌పు విధుల‌ను కూడా చేస్తాయి.

ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌లో ఎన్‌పీఎప్ ప‌థ‌కం చాలా కీల‌క‌మైన‌ది. ముఖ్యంగా యువ‌త సంప‌ద‌ను పెంచుకునేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎన్‌పీఎస్‌పై ప‌న్నులు కూడా కాలానుగుణంగా మారుతుంటాయి. ఇక్క‌డ గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఫీజు పెన్ష‌న్ ఫండ్ చెల్లించ‌దు. మ్యూచువ‌ల్ స్కీములు లేదా బీమా పాల‌సీల‌లో సంస్థ‌లు ఏజెంట్ల‌కు క‌మీష‌న్ చెల్లిస్తాయి. ఎన్‌పీఎస్‌లో ఫీజు వినియోగ‌దారుడి ఖాతా నుంచి తీసుకుంటారు అయితే ఇది అంద‌రికీ స‌మానంగా ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly