పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌డం ఎలా?

పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ ను ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్, ఈపీఎఫ్ఓ ​​వెబ్ సైట్, ఉమాంగ్ యాప్‌తో చెక్ చేసుకోవ‌చ్చు

పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌డం ఎలా?

మీ పదవీ విరమణ ప్రణాళిక కోసం మీకున్న అన్ని రకాల పొదుపులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం ఎంతో ముఖ్యం. అలాగే మీ ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాలోని మొత్తం మీ అత్యవసర ఆర్ధిక అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం పదవీ విరమణ తరువాత మాత్రమే కాకుండా, కొన్ని అత్యవసర సందర్భాల్లో కూడా మీ పీఎఫ్ ఖాతాలోని నగదును ఉపసంహరించుకోవచ్చు. కుటుంబసభ్యుల వివాహం, కుటుంబ సభ్యుల అత్యవసర వైద్య ఖర్చులు, పిల్లల విద్య, ఆస్తి కొనుగోలు లేదా గృహ రుణ తిరిగి చెల్లింపు వంటి అవసరాల కోసం పీఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 2017-18 సంవత్సరానికి గాను 8.55 శాతం వడ్డీ రేట్లను ప్రకటించింది. ఈపీఎఫ్ఓ తమ వినియోగదారుల పీఎఫ్ ఖాతా బ్యాలన్స్ ను ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్, ఈపీఎఫ్ఓ ​​వెబ్ సైట్, ఉమాంగ్ యాప్ లో తనిఖీ చేయడానికి అనుమతిస్తుంది. దీనిని ఉపయోగించే ముందు, మీరు కచ్చితంగా ఈపీఎఫ్ఓ ​​వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎస్ఎంఎస్ :

యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) కలిగిన ఈపీఎఫ్ఓ సభ్యులు, ఈపీఎఫ్ఓ ​​పోర్టల్ లో నమోదు చేసుకున్నవారు, తమ మొబైల్ లో EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 నెంబర్ కి ఎస్ఎంఎస్ చేయవచ్చు.

మిస్డ్ కాల్ :

నమోదు చేసుకున్న వినియోగదారులు 011-22901406 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలతో కూడిన ఎస్ఎంఎస్ ను పొందుతారు.

ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ :

ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ (www.epfindia.gov.in) ను సందర్శించి, “Our Services” విభాగంలోని “For Employees” ఆప్షన్ పై క్లిక్ చేయండి. అనంతరం “Member Passbook” ఆప్షన్ పై క్లిక్ చేయండి, అక్కడ మీ యూఏఎన్, పాస్ వర్డ్ ను నమోదు చేయవలసి ఉంటుంది. ఒకసారి మీరు లాగిన్ అయ్యిన తర్వాత మీ, మీ యజమాని కాంట్రిబ్యూషన్స్ ను చూడవచ్చు.

ఉమాంగ్ యాప్ :

ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ లో మాదిరిగానే, ఉమాంగ్ యాప్ లో కూడా మీ యూఏఎన్, ఓటీపీలను ఉపయోగించి లాగిన్ అయ్యి, మీ పీఎఫ్ పాస్ బుక్ ను యాక్సెస్ చేయవచ్చు.

సిరి లో ఇంకా :

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly