ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభంలోనే పెట్టుబ‌డుల వివరాల‌ను తెలియ‌జేయండి

పెట్టుబ‌డుల వివ‌రాల‌ను అందించ‌డం ద్వారా మీ ఆదాయంపై టీడీఎస్ లెక్కించ‌డం సుల‌భం అవుతుంది.

ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభంలోనే పెట్టుబ‌డుల వివరాల‌ను తెలియ‌జేయండి

2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో మొద‌టి నెల ముగుస్తోంది. ఇప్ప‌టికే మీ పెట్టుబ‌డుల వివ‌రాలు మీ సంస్థ‌కు తెలియ‌జేసి ఉండాలి. మొద‌టి ఉద్యోగం చేస్తున్నవారు ఈ విష‌యాన్ని త‌ప్ప‌నిస‌రిగా పెట్టుబ‌డులకు కేటాయించాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే … మీరు వేత‌న జీవులైతే ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌ట్లోనే మీ పెట్టుబ‌డుల వివ‌రాలు తెలియ‌జేయాల్సిందిగా సంస్థ కోరుతుంది. దీంతో ప‌న్ను వ‌ర్తించే ఆదాయాన్ని లెక్కించి దానిప్ర‌కారం టీడీఎస్‌ను మిన‌హాయిస్తారు. సాధార‌ణంగా సెక్ష‌న్ 80సీ, 80డీ , గృహ రుణ వ‌డ్డీ, మొత్తం , హెచ్ఆర్ఏ వంటివి వెల్ల‌డించాల్సి ఉంటుంది. వీటితో పాటు ప‌న్ను ఆదా చేసే పెట్టుబ‌డులైన‌ ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్స్ స్కీమ్స్‌, ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి కొన్ని పెట్టుబ‌డుల వివ‌రాల‌ను తెలియ‌జేయాల్సి ఉంటుంది. గృహ రుణ మొత్తం, వ‌డ్డీ, హెచ్ఆర్ఏ, ఆరోగ్య బీమా ప్రీమియంలు, ట్యూష‌న్ ఫీజు, విద్యా రుణం వంటివి ఏడాది మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. మీరు తీసుకున్న పెట్టుబ‌డుల నిర్ణ‌యం గురించి ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభంలో మీ సంస్థ‌కు తెలియ‌జేస్తే దాని ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపులు ల‌భిస్తాయి. అదేవిధంగా టీడీఎస్ కూడా దానికి అనుగుణంగా వ‌ర్తిస్తుంది.

మీరు ఎక్కువ ప‌న్ను మిన‌హాయింపులను డిక్లేర్ చేసిన లేదా త‌క్కువ చేసినా అంటే, ఎక్కువ ప‌న్నులు చెల్లించినా, త‌క్కువ చెల్లించినా వ్య‌త్యాసం ఏర్పడుతుంది. అందుకే ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌ర్లో కాకుండా జ‌న‌వ‌రిలోనే పెట్టుబ‌డుల ఆధారాల‌ను స‌మ‌ర్పించాల్సిందిగా కంపెనీ ఉద్యోగుల‌ను కోరుతుంది. ఒక‌వేళ ఏవైనా హెచ్చుత‌గ్గులు వ‌స్తే గ‌త మూడు నెల‌ల‌కు సంబంధించి ప‌న్ను వివ‌రాల‌ను మ‌రోసారి లెక్కించి టీడీఎస్ ఎక్కువ మిన‌హాయిస్తారు. అప్పుడు చేతికి ల‌భించే జీతంలో కోత ప‌డుతుంది.

ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభంలో పెట్టుబ‌డుల వివ‌రాల‌ను వెల్ల‌డిస్తే రాబోయే నెల‌ల్లో ఎక్కువ ఆదాయాన్ని ఆదా చేసుకోవ‌చ్చు. దీంతో హెచ్చుత‌గ్గులు ఏర్ప‌డకుండా త‌గిన టీడీఎస్‌ మిన‌హాయించేందుకు వీలుంటుంది. టీడీఎస్ త‌క్కువ‌గా ఉండాలని సంస్థ ఎప్పుడు అన‌కోదు. ఎంద‌కంటే అలా ఉంటే వారు తమ చట్టపరమైన బాధ్యతలను చేరుకోరు, అయితే ఎక్కువ TDS మీకు అదనపు ద్రవ్య భారం చూపుతుంది.

(Source: Livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly