ఇక 'జియో' మ్యూచువ‌ల్ ఫండ్లు !

రిల‌య‌న్స్ జియో డిజిట‌ల్ పేమెంట్ ప్లాట్‌ఫాం, జియో మ‌నీ ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్లు విక్ర‌యించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది

ఇక 'జియో' మ్యూచువ‌ల్ ఫండ్లు !

బిలియ‌నీయ‌ర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిల‌య‌న్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, కొత్త సంవ‌త్స‌రంలో మ్యూచువ‌ల్ ఫండ్లు, ఇత‌ర ఆర్థిక ప‌థ‌కాల్లోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని సంబంధిత వ‌ర్గాలు చెప్తున్నాయి. రిల‌య‌న్స్ జియో డిజిట‌ల్ పేమెంట్ ప్లాట్‌ఫాం, జియో మ‌నీ ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్లు విక్ర‌యించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. జియో మ‌నీ ద్వారా వినియోగ‌దారులు న‌గ‌దు చెల్లింపులు, లావాదేవీలు, మొబైల్ రిఛార్జ్‌, డీటీహెచ్ క‌నెక్ష‌న్లు చేసుకునే స‌దుపాయం ఉంది.

సంస్థ ఇప్పుడు దీన్ని కొన్ని త్రైమాసికాల నుంచి ఉద్యోగులకు బీటా-టెస్టింగ్ చేస్తోంది. ఇది అధికారికంగా ప్రారంభించే ముందు లొసుగులను క‌నుగొన‌డంతో పాటు, దాని నెట్‌వర్క్, మౌలిక సదుపాయాలను పరీక్షించడానికి అనుమతిస్తుంది. మ్యూచువ‌ల్ ఫండ్ల‌ పంపిణీ కోసం రిలయన్స్ జియోతో ఇప్పటివరకు అధికారిక చర్చలు జరప‌న‌ప్ప‌టికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి జియో ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ లిమిటెడ్ ద్వారా అకౌంట్ అగ్రిగేటర్ (ఎఎ) లైసెన్స్‌ను పొందిన‌ట్లు తెలుస్తోంది. వినియోగదారుల సమ్మతి పొందిన తరువాత థ‌ర్డ్ పార్టీలతో ఆర్థిక సమాచారాన్ని సేకరించి పంచుకునేందుకు అకౌంట్ అగ్రిగేట‌ర్ల‌కు అర్హత ఉంటుంది.
దేశ మ్యూచువ‌ల్ ఫండ్ ప‌రిశ్ర‌మ‌లో 20 మిలియ‌న్లు పెట్టుబ‌డుదారుల లేదా సంప‌ద రూ.27 ట్రిలియ‌న్లుగా ఉంది. ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలు కువేర, స్ర్కిప్‌బాక్స్, గ్రో వంటివి ఇటీవ‌ల కాలంలో బాగా ఆద‌ర‌ణ పెరిగింది. పేటీఎం, టైమ్స్ గ్రూప్ వంటివి కూడా ఇప్పుడు పేటీఎం మ‌నీ, ఈటీ మ‌నీ పేరుతో మ్యూచువ‌ల్ ఫండ్ల పంపిణీ ప్రారంభించాయి.

రిలయన్స్ జియో తన మ్యూచువల్ ఫండ్ విభాగానికి నియామకం కూడా చేప‌ట్ట‌నుంది. మంచి ఆర్థిక పరిజ్ఞానం ఉన్న డిజిటల్ అవగాహన గల అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వ‌నున్నారు. త్వ‌ర‌లో జియో పేమెంట్స్ బ్యాంక్ కూడా అందుబాటులోకి రానున్న‌ట్లు స‌మాచారం.

Source : Livemint

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly