జియో మరో సంచలనం - రూ.400 ల‌కే హెచ్‌డీ ఛానళ్లు!

రిల‌య‌న్స్ జియో త్వ‌ర‌లో డీటీహెచ్‌ సేవ‌ల వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టనుంది

జియో మరో సంచలనం - రూ.400 ల‌కే హెచ్‌డీ ఛానళ్లు!

దేశ టెలికాం రంగంలో సంచ‌ల‌నం సృష్టించిన రిల‌య‌న్స్ జియో త్వ‌ర‌లో డీటీహెచ్‌(డైరెక్ట్ టు హోమ్‌) సేవ‌ల రంగంలోకి కూడా అడుగు పెట్ట‌నుంది. టెలికాం రంగంలో మాదిరిగానే డీటీహెచ్ రంగంలోనూ సంచ‌నాలు సృష్టించేందుకు జియో హోమ్ టీవీ స‌ర్వీసెస్ పేరిట అతి త‌క్కువ ధ‌ర‌కే ఎక్కువ టీవీ ఛాన‌ళ్ల‌ను అందించ‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

రూ.400 ల‌కే హెచ్‌డీ(హై డెఫినేష‌న్‌), ఎస్‌డీ(స్టాండ‌ర్డ్ డెఫినేష‌న్‌) ఛాన‌ళ్ల‌ను అందిచ‌నున్న‌ట్లు స‌మ‌చారం. ఇందులోనూ కేవ‌లం ఎస్‌డీ ఛాన‌ళ్లు మాత్ర‌మే కావాల‌నుకునే వారికి రూ.200 ల‌కే ఇవ్వ‌నున్నట్లు తెలుస్తోంది. ఇది ప్ర‌స్తుతం డీటీహెచ్ మార్కెట్లో ఉన్న ధ‌ర‌ల‌తో పోలిస్తే చాలా చౌక. ఈ సేవ‌ల‌నందిస్తున్నట్లు వ‌చ్చే క‌థ‌నాల‌ను ఇప్ప‌టి వ‌ర‌కూ జియో అటు ఖండించ‌లేదు, ఇటు స‌మ‌ర్థించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ జియో హోమ్ స‌ర్వీసెస్ ఛాన‌ళ్ల‌లో ప్ర‌త్య‌క్ష ప్రసారాల‌ను అందించేందుకు ఇంట‌ర్నెట్ అవ‌స‌రం లేదు. స‌రికొత్త సాంకేతిక ప‌రిజ్ఞానం ఇఎమ్‌బీఎమ్ఎస్‌( లేటెస్ట్ మల్టీమీడియా బ్రాడ్‌కాస్ట్‌ మల్టీకాస్ట్ సర్వీస్)కింద ఈ జియో హోమ్‌ టీవి సర్వీసులు అందుబాటులోకి వ‌స్తాయ‌ని స‌మాచారం. జియో బ్రాడ్‌కాస్ట్ యాప్‌కి ఇది రీబ్రాండెడ్ మోడ‌ల్ అని, ఇటీవలే ఈ ఇఎమ్‌బీఎమ్ఎస్ సాంకేతిక‌త‌పై దేశవ్యాప్తంగా ప‌రీక్ష‌లు కూడా పూర్తయినట్లు జియో తెలిపింది.

ఈ జియో హోమ్ స‌ర్వీసెస్ సేవ‌ల‌ను వినియోగ‌దారుల ఫోన్ల ద్వారా అందించ‌నున్నారని టెలికామ్ ట్రాక్ అనే వెబ్‌సైట్ తెలిపింది. ఈ యాప్‌లోని బ్రాడ్‌కాస్ట్ సాంకేతిక‌త ద్వారా వినియోగ‌దారుల‌కు ప్ర‌త్య‌క్ష ప్రసారంలో హెచ్‌డీ వీడియోలు అందనున్నాయి. ఈఎంబీఎంఎస్ టెక్నాలజీ ద్వారా ఒకే సారి పెద్ద మొత్తంలో వినియోగ‌దారులు టీవీ, రేడియో కంటెంట్‌ను పొంద‌వ‌చ్చు. ఛాన‌ళ్ల ప్రసారానికి ఇంట‌ర్నెట్ ఉండాల్సిన అవ‌స‌రం లేదు.

ఇటీవలే రిలయన్స్ పేమెంట్స్ బ్యాంకు కూడా మొదలు పెట్టింది. ఈ విషయమై ఆర్బీఐ బ్యాంకింగ్ రేగులేషన్ ఆక్ట్ సెక్షన్ 22(1) క్రింద పేమెంట్స్ బ్యాంకుగా కార్యకలాపాలు కొనసాగించేందుకు జియో కు లైసెన్స్ జారీ చేసింది. వివిధ సేవల ద్వారా ఆర్ధిక చేర్పు అందించే తరుణంలో ఆర్బీఐ పేమెంట్స్ బ్యాంకులను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. జియో పేమెంట్స్ బ్యాంకు దేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ 70 శాతం వాటా తో, దేశంలో అతి పెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ 30 శాతం వాటా తో కలిసి సంయుక్తంగా స్థాపించబడింది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly