మార్కెట్లు న‌ష్ట‌పోతే షేర్ల‌ను విక్ర‌యిస్తున్నారా?

మొద‌ట మార్కెట్ల న‌ష్టాల‌కు, ఆ త‌ర్వాత వ్య‌క్తిగ‌త‌ కంపెనీల స్టాక్‌ల ప‌త‌నానికి కార‌ణాలు తెలుసుకోవాలి

మార్కెట్లు న‌ష్ట‌పోతే షేర్ల‌ను విక్ర‌యిస్తున్నారా?

మార్కెట్లు లాభాల‌తో కొన‌సాగుతున్న‌ప్పుడు మ‌దుప‌ర్లు త‌దుప‌రి కొనుగోళ్ల గురించి ఆలోచిస్తారు. కొంత అనిశ్చితి ఎదుర‌య్యేసారికి స్టాక్‌ల‌ను అమ్మేసుకుంటారు. తొంద‌ర‌ప‌డి ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం స‌రైన‌ది కాదు. మార్కెట్లు న‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ప‌రిశీలించాల్సిన కొన్ని అంశాలు…

మీ పెట్టుబ‌డుల‌పై ప్ర‌భావం ఉందా?

స్టాక్ మార్కెట్లు ఎందుకు న‌ష్ట‌పోతున్నాయో, ఆ త‌ర్వాత‌ కంపెనీల షేర్లు ఎందుకు త‌గ్గుతున్నాయో కార‌ణం తెలుసుకోవాలి. కొన్ని అంత‌ర్జాతీయ అంశాలు కూడా మార్కెట్ల‌పై ప్ర‌భావం చూపుతాయి. విదేశీ పెట్టుబ‌డుదారులు నిధుల‌ను ఉప‌సంహ‌రించుకోవడం వంటివి కూడా కార‌ణాలు కావ‌చ్చు. దీంతో కంపెనీల షేర్లతో పాటు ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల‌లో (ఈటీఎఫ్‌) అమ్మ‌కాలకు దారితీస్తాయి. కంపెనీ ప‌నితీరు బాగుండి, వృద్ధిపై ఎలాంటి ప్ర‌తికూల ప్ర‌భావం లేక‌పోతే పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించ‌డం మంచిది

ఇలాంటి స‌మ‌యంలోనే ఆందోళ‌న‌కు గురికాకూడ‌దు. మీరు కొనుగోలు చేసిన స్టాక్‌పై ఏమైనా ప్ర‌తికూల ప్ర‌భావం ఉందా లేదా మొద‌ట‌గా చూసుకోవాలి. మీ స్టాక్‌లకు న‌ష్టం లేక‌పోతే మ‌రిన్ని కొనుగోలు చేయాలి . మీరు ఈటీఎప్ పెట్టుబ‌డుదారులైతే, ఈ న‌ష్టం సంస్థాగ‌త పెట్టుబ‌డుదారుల కార‌ణంగానా లేదా దేశీయ మార్కెట్ల‌పై ప్ర‌భావం చూపే ప‌రిస్థితులు ఏమైనా ఎదుర‌వ‌డం వ‌ల‌న అనేది విశ్లేషించుకోవాలి. త‌క్కువ ధ‌ర ఉన్న‌ప్పుడే ఎక్కువ షేర్ల‌ను కొనుగోలు చేస్తే మంచిది.

పెట్టుబ‌డుల నిర్ణ‌యాలు:

ఈక్విటీల‌కు దీర్ఘ‌కాలికంగా ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఈక్విటీల‌లో పెట్టుబ‌డులు పెడితే ఎక్కువ‌కాలం కొన‌సాగిస్తే లాభం ఉంటుంది. ప్ర‌త్యేక‌మైన ఆర్థిక ల‌క్ష్యం కోసం కూడా ఈక్విటీల‌లో పెట్టుబ‌డులు ప్రారంభించ‌వ‌చ్చు. మార్కెట్ల ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఆర్థిక లక్ష్యం నెర‌వేరేందుకు ఇంకా స‌మ‌యం ఉంటే పెట్టుబ‌డులు కొన‌సాగించాలి. ఇంకా ఎక్కువ కొనుగోలు చేసేందుకు ప్ర‌య‌త్నించాలి.

మీ ఆర్థిక ల‌క్ష్యం నేర‌వేరే స‌మ‌యం దగ్గ‌ర‌లో ఉన్న‌ప్పుడు ఈక్విటీల నుంచి ఉప‌సంహ‌ర‌ణ చేయ‌వ‌చ్చు. ఈక్విటీ పెట్టుబడుల్లో స్వ‌ల్ప కాలంలో ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు ఉంటాయి. దీర్ఘ‌కాలంలో చూస్తే మీ స్టాక్‌పై ప్ర‌భావం ఎంత ఉంది అనేది చూసుకోవాలి.

మిగులు నిధులు:

మీ అవ‌స‌రాల‌కు మించిన నిధులు మీ వ‌ద్ద ఉన్న‌ట్ల‌యితే మార్కెట్‌లో పెట్టుబ‌డులు చేయ‌డం మంచిది. ఒక‌వేళ అలా లేక‌పోతే ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇత‌ర పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించి అందులో పెట్టుబ‌డులు చేయ‌డం మంచిది. మీ ఆర్థిక ప్ర‌ణాళిక భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు అనుగుంగా ఉండాలి.

రిస్క్ తీసుకునే సామ‌ర్థ్యం:

మీరు ఎంత‌మేర‌కు పెట్టుబ‌డులు చేయ‌గ‌ల‌రో ఎంత వ‌ర‌కు న‌ష్టాన్ని త‌ట్టుకునే సామ‌ర్థ్యం ఉందో అంచ‌నా వేసుకొని పెట్టుబ‌డులు పెట్టాలి. మార్కెట్లు ప‌రిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్ప‌లేం. స్వ‌ల్ప కాలం న‌ష్టాలున్న‌ప్ప‌టికీ దీర్ఘ‌కాలంలో కోలుకునే అవ‌కాశం ఉంటుంది. ఫండ‌మెంట‌ల్స్‌ మీద ఎలాంటి ప్ర‌తికూల ప్ర‌భావం లేక‌పోతే రాబ‌డి ఎక్కువుండే అవ‌కాశం ఉంటుంది. మీరు రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేక‌పోతే మార్కెట్లు ఒడుదొడుకుల్లో ఉన్న‌ప్పుడు పెట్టుబ‌డుల‌కు దూరంగా ఉండాలి. ఎక్కువ‌కాలం ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే షేర్ల‌ను విక్రయించుకోవ‌చ్చు.

మార్కెట్లు న‌ష్ట‌పోతున్నాయ‌న్న ఒకే ఒక్క కార‌ణంతో స్టాక్ల‌ను అమ్ముకోవ‌డం స‌రైన నిర్ణ‌యం కాదు. అయితే రిస్క్ తీసుకోనివారైతే మార్కెట్లు న‌ష్టాలు ఎక్కువ‌కాలం కొన‌సాగితే షేర్ల‌ను అమ్ముకోవ‌చ్చు.

(Source: Livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly