కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ వ‌డ్డీ రేట్ల స‌వ‌ర‌ణ‌

ల‌క్ష రూపాయ‌లకు లోపు డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ ప్ర‌క‌టించింది.

కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ వ‌డ్డీ రేట్ల స‌వ‌ర‌ణ‌

ప్రైవేటు రంగ కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు పొదుపు ఖాతాల‌ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించింది. గ‌తంలో ఉన్న‌ 5 శాతం నుంచి 4.5 శాతానికి వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు బ్యాంక్ వెబ్‌సైట్‌లో పేర్కొంది. స‌వ‌రించిన వ‌డ్డీ రేట్లు ఏప్రిల్ 15, 2019 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్లు ప్ర‌క‌టించింది. ల‌క్ష రూపాయ‌ల నుంచి కోటి రూపాయ‌ల వ‌ర‌కు డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను య‌థాత‌థంగా 6 శాతంగానే కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిపింది. అదేవిధంగా కోటి రూపాయ‌ల‌పైన డిపాజిట్ల‌పై కూడా వ‌డ్డీ 5.5 శాతంగానే ఉంచింది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటులో 25 బేసిస్ పాయింట్ల కోత విధించి 6 శాతానికి చేర్చ‌డంతో, త‌గ్గిన వ‌డ్డీ రేట్ల ప్ర‌యోజ‌నాల‌ను వినియోగ‌దారులకు బ‌దిలీ చేసేందుకుగాను కోట‌క్ బ్యాంక్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. దేశ అతిపెద్ద ప్ర‌భుత్వ బ్యాంక్ ఎస్‌బీఐ కూడా ఇటీవ‌ల వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే. మే 1 నుంచి ఎస్‌బీఐ బ్యాంకు పొదుపు ఖాతాను ల‌క్ష రూపాయ‌ల పైన ఉన్న ఉన్న డిపాజిట్లను, ఓవ‌ర్ డ్రాఫ్ట్ వంటి స్వ‌ల్ప‌కాలిక‌ రుణాల‌ను ఆర్‌బీఐ రెపో రేటుతో అనుసంధానం చేయ‌నుంది. అప్పుడు ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్లు త‌గ్గిస్తే ఆ త‌గ్గింపు వెంట‌నే వినియోగ‌దారుల‌కు బ‌దిలీ అవుతుంది. గ‌త ఆర్‌బీఐ స‌మీక్ష‌లో రెపో రేటు త‌గ్గించ‌డంతో ఎస్‌బీఐ ల‌క్ష రూపాయ‌ల పైన డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించింది. మే 1 నుంచి ల‌క్ష రూపాయ‌ల పైన ఉన్న‌ ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై 3.25 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు డిపాజిట్లు ఉంటే 3.5 శాతం వ‌డ్డీ పొందుతారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

(Source: Livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly