ఇక‌పై సుల‌భంగా ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపులు

'ఇన్‌స్టాపే సర్వీస్' ఆప్షన్ ఎంచుకోవ‌డం ద్వారా మీ అకౌంట్‌లోంచి ఆటోమెటిక్‌గా ప్రీమియం చెల్లింపు చేయ‌వ‌చ్చు.

ఇక‌పై సుల‌భంగా ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపులు

మీరు ఎల్‌ఐసీ పాలసీదారులా? ప్రీమియం చెల్లించాల్సిన తేదీని తరుచూ మర్చిపోతున్నారా? అయితే మీకు ఒక శుభ‌వార్త‌. ఇకపై ప్రీమియంలు చెల్లించ‌డానికి మీరు ఇబ్బందిప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఇందుకోసం క్యూ లైన్లలో నిలబడి స‌మ‌యం వెచ్చించాల్సిన‌ అవసరం కూడా ఉండదు. ఇకపై పాలసీదారులు తమ ఇన్సూరెన్స్‌ సంస్థను నెట్‌ బ్యాంకింగ్‌కు అనుసంధానం చేసుకునే స‌దుపాయాన్ని ఎల్ఐసీ క‌ల్పిస్తుంది. ఆటో పేమెంట్ ద్వారా భవిష్యత్తుల్లో చెల్లించాల్సిన ప్రీమియంను కూడా సెట్‌ చేసుకోవచ్చు. నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా అందనున్న ఈ సేవలకు అదనపు లావాదేవీల ఛార్జీలేమీ ఉండవు. అయితే, ఒక లావాదేవీలో రూ.50,000 వరకు (జీఎస్టీ, ఆలస్య రుసుములతో కలిపి) మాత్రమే చెల్లించే అవకాశం ఉంటుంది.

ఎల్ఐసీ పాల‌సీదారులు ప్రీమియం చెల్లింపులు, పాల‌సీ పున‌రుద్ద‌ర‌ణ వంటి విష‌యాల‌లో ఆన్‌లైన్ సేవ‌ల‌ను విస్త‌రించేంద‌ర‌కు ‘ఇన్‌స్టాపే సర్వీస్‌’ అనే ఆప్షన్‌ను తీసుకొచ్చారు. దేశంలోని దాదాపు అన్ని బ్యాంకుల ఖాతాదారులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. బిల్‌డెస్క్‌ ప్లాట్‌ఫార్మ్‌ ద్వారా ఈ సేవలను అందిస్తున్న‌ట్లు ఎల్ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది.

వివిధ ర‌కాల బిల్లులు చెల్లించేంద‌కు బ్యాంకు ఖాతాదారులు ఉప‌యోగిస్తున్న బ్యాంకింగ్ అప్లికేష‌న్ ద్వారా ఎల్ఐసీ పాల‌సీదారులు ఈ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు.

ఈ స‌దుపాయాన్ని ఎలా ఉప‌యోగించుకోవాలి:

 • ముందుగా మీ మొబైల్‌లో బ్యాంక్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని లాగ్ అవ్వాలి.
 • అందులో పేబిల్స్ ఆప్ష‌న్‌లో ఇన్సురెన్స్ కేట‌గిరిని ఎంచుకోవాలి.
 • ఇన్సురెన్స్‌పై క్లిక్ చేస్తే, ఇన్సురెన్స్ కంపెనీ జాబితా వ‌స్తుంది.
 • ఈ జాబితా నుంచి లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ఆప్ష‌ను ఎంచుకోవాలి.
 • ఇందులో మీ పాల‌సీ నెంబ‌రు, పేరు, ప్రీమియం మొత్తం, ఈమెయిల్ అడ్ర‌స్‌, మొబైల్ నెంబ‌రు వంటి వివ‌రాల‌ను ఎంట‌ర్ చేస్తే, ప్రీమియం చెల్లించ‌వ‌ల‌సిన తేదీ, మొత్తం చెల్లించ‌వ‌ల‌సిన మొత్తం(జీఎస్‌టీ, ఆల‌స్య రుస‌ముల‌తో స‌హా) మొద‌లైన వివ‌రాల‌ను స్క్రీన్‌పైన క‌నిపిస్తాయి.
 • ప్ర‌తీసారి ప్రీమియం చెల్లించ‌వ‌ల‌సిన తేదీ గుర్తించుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేకుండా ‘ఆటో పే’ ఆప్ష‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు.
 • ప్రీమియం చెల్లించ‌న ర‌శీదు ఎల‌క్ట్రిక్ మోడ్ లేదా ఫిజిక‌ల్ మోడ్‌లో… ఏవిధంగా కావాలి అనేది కూడా ఎంపిక చేసుకోవ‌చ్చు.
 • నెట్ బ్యాంకింగ్ ఖాతా ద్వారా స‌బ్మిట్ క్లిక్ చేయ‌డం ద్వారా త‌క్ష‌ణ‌మే ప్రీమియంల‌ను చెల్లించ‌వ‌చ్చు.
 • ఒక లావాదేవీలో రూ.50,000 వరకు (జీఎస్టీ, ఆలస్య రుసుములతో కలిపి) వ‌ర‌కు చిల్లించ‌వ‌చ్చు
 • లావాదేవీల‌పై ఎటువంటి రుస‌ములు ఉండ‌వు
 • లావాదేవీలు ప్రారంభించే స‌మ‌యంలో ఇచ్చిన ఈ-మెయిల్ అడ్ర‌స్‌కి ఈ-ర‌శీదును పంపిస్తారు. ఖాతాదారులు ఈ-ర‌శీదును పీడీఎఫ్ ఫార్మెట్‌లో కూడా పొంద‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly