ఎల్ఐసీ న‌వ‌జీవ‌న్ ఎండోమెంట్ ప్లాన్

పన్ను ప్రయోజనాలతో పాటు పొదుపు, పాలసీదారుల జీవిత భద్రతను దృష్టిలో పెట్టుకొని నవజీవన్‌ పాలసీని రూపొందించారు.

ఎల్ఐసీ న‌వ‌జీవ‌న్ ఎండోమెంట్ ప్లాన్

ఎల్ఐసీ న‌వ‌జీవ‌న్ పొదుపుతో పాటు భ‌ద్ర‌త క‌లిగిన ఎండోమెంట్ ప్లాన్ . ఈ పాల‌సీలో సింగిల్‌ ప్రీమియం లేదా ఐదేళ్ల వరకు ప్రీమియం చెల్లించే వెసులుబాటు కల్పించింది .

ఫీచ‌ర్లు

 • ఆన్‌లైన్‌లో www.licindia.in ద్వారా న‌వ‌జీవ‌న్ ప్లాన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు
 • ఇది ఎండోమెంట్ ప్లాన్‌. సింగిల్ ప్రీమియం లేదా ఐదేళ్ల కాల‌వ్య‌వ‌దిలో లిమిటెడ్ పేమెంట్ ఆప్ష‌న్ క‌లిగి ఉంటుంది.
 • 90 రోజుల వ‌య‌సు నుంచి 65 సంవ‌త్స‌రాల వ‌య‌సు గ‌ల వారికి అందుబాటులో ఉంటుంది.
 • దీనిపై రుణ స‌దుపాయం ఉంటుంది.
 • సెక్ష‌న్ 80 సీ కింద ప‌న్ను మిన‌హాయింపులు ల‌భిస్తాయి.
 • లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్ష‌న్‌లో 45 సంవ‌త్స‌రాలు లేదా అంత‌కంటే ఎక్కువ వ‌య‌సు ఉన్న‌వారికి రెండు ర‌కాల బీమా హామీ ఆప్ష‌న్లు ఉంటాయి. దీంతో పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే ఎంత మొత్తం హామీ కావాల‌నుకుంటున్నారో ముందే ఎంచుకోవ‌చ్చు.
  ఆప్ష‌న్ 1: వార్షిక ప్రీమియం కంటే ప‌ది రెట్లు
  ఆప్ష‌న్ 2 :వార్షిక ప్రీమియం కంటే ఏడు రెట్లు
 • 45 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సు వారికి ఒకే ఆప్ష‌న్ ఉంటుంది. అది వార్షిక ప్రీమియం కంటే ప‌ది రెట్లు

పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే…
పాల‌సీ తీసుకున్ త‌ర్వాత మెచ్యూరిటికీ ముందు పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే బీమా హామీ ల‌భిస్తుంది

పాల‌సీ తీసుకున్న మొద‌టి ఐదేళ్ల‌లో మ‌రణిస్తే

 • రిస్క్ పీరియ‌డ్‌ ప్రారంభం కాక‌ముందు అయితే ప్రీమియంలు వ‌డ్డీ లేకుండా చెల్లిస్తారు.
 • రిస్క్ ప్ర‌క‌టించిన త‌ర్వాత మ‌ర‌ణిస్తే, బీమా హామీ ఇస్తారు.
 • ఐదు సంవ‌త్స‌రాలు పూర్త‌యిన త‌ర్వాత , మెచ్యూరిటీకి ముందు మ‌ర‌ణిస్తే బీమా హామీతో పాటు కంపెనీ విధానాల ప్ర‌కారం అద‌న‌పు లాయ‌ల్టీ చెల్లింపులు కూడా ఉంటాయి.

మెచ్యూరిటీ త‌ర్వాత ప్ర‌యోజ‌నాలు
పాల‌సీ ట‌ర్మ్ ముగిసేంత‌వ‌ర‌కు జీవించి ఉంటే, అన్ని ప్రీమియంలు చెల్లించి ఉంటే , మెచ్యూరిటీ హామీ, లాయ‌ల్టీతో క‌లిపి చెల్లిస్తారు.

రైడ‌ర్ ఆప్ష‌న్లు
ఎల్ఐసీ యాక్సిడెంట‌ల్ డెత్ అండ్ డిజ‌బిలిటీ బెనిఫిట్ రైడ‌ర్‌
ప్ర‌మాదవ‌శాత్తు మ‌ర‌ణం సంభ‌విస్తే , పాల‌సీ ప్ర‌కారం బీమా హామీ, రైడ‌ర్ మొత్తం ఒకేసారి చెల్లిస్తారు. గ‌రిష్ఠ‌ ప‌రిమితి రూ.100 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది.

అర్హ‌త‌
క‌నిష్ఠ హామీ: ల‌క్ష రూపాయలు
గ‌రిష్ఠ హామీ : ప‌రిమితి లేదు
క‌నీస వ‌య‌సు : సింగిల్ ప్రీమియం అయితే 90 రోజుల వ‌య‌సు ఉండాలి
ప‌రిమిత ప్రీమియం ఆప్ష‌న్ 1 : 90 రోజుల వ‌య‌సు ఉండాలి
ప‌రిమిత ప్రీమియం 2 : 45 సంవ‌త్స‌రాల వ‌య‌సుండాలి.
గ‌రిష్ఠ వ‌య‌సు : సింగిల్ ప్రీయంలో 44 సంవ‌త్స‌రాలు
లిమిటెడ్ ప్రీమియం 2 : 65 సంవ‌త్స‌రాలు

గ‌రిష్ఠ మెచ్యూరిటీ వ‌య‌సు
సింగిల్ ప్రీమియం: 62 సంవ‌త్స‌రాలు
లిమిటెడ్ ప్రీమియం: 75 సంవ‌త్స‌రాలు
లిమిటెడ్ ప్రీమియం 2 : 80 సంవ‌త్స‌రాలు
పాల‌సీ కాల‌వ్య‌వ‌ధి: 10 నుంచి 18 సంవ‌త్సరాలు
చెల్లింపు విధానం: సింగిల్ ప్రీమియం (లంప్‌స‌మ్‌), ఏడాదికి, ఆరు నెల‌ల‌కు, మూడు నెల‌ల‌కు, నెల‌కు ఆన్‌లైన్ చెల్లింపులు చేయాలి.

చివ‌ర‌గా

 • ఎండోమెంట్ పాల‌సీలో బీమా హామీ త‌క్కువ‌, ప్రీమియం ఎక్కువ‌గా ఉంటుంది. రాబ‌డి 4-5 శాతం వ‌ర‌కు మాత్ర‌మే ఉంటుంది. అందువ‌ల‌న ఇలాంటి పాల‌సీలకు ప్రాధాన్యం ఇవ్వ‌కుండా బీమా కోసం అయితే ట‌ర్మ్ పాల‌సీ, పెట్టుబ‌డుల కోసం పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్, మ్యూచువ‌ల్ ఫండ్ల వంటివి ఎంచుకోవ‌డం మేలు.
 • ట‌ర్మ్ పాల‌సీలో బీమా హామీ ఎక్కువ‌గా ఉంటుంది. ప్రీమియం త‌క్కువ‌గా ఉంటుంది. మీ వార్షికాదాయానికి 10 నుంచి 15 రెట్లు జీవిత బీమా పాల‌సీని తీసుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly