క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే రుసుములు లేవు

ప్రీమియం, రినీవ‌ల్, రుణం, వ‌డ్డీ చెల్లింపులు కూడా క్రెడిట్ కార్డుతో చేస్తే ఎలాంటి అద‌న‌పు ఛార్జీలు ఉండ‌వు

క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే రుసుములు లేవు

డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించేందుకు ఎల్ఐసీ క్రెడిట్ కార్డుతో చేసే లావాదేవీల‌పై రుసుముల‌ను ర‌ద్దు చేసింది. డిసెంబ‌ర్ 1 నుంచి ఇది వ‌ర్తిస్తుంది. పాల‌సీ రినీవ‌ల్, ప్రీమియం, రుణం, వ‌డ్డీ చెల్లింపుల‌ను క్రెడిట్ కార్డుతో చేస్తే ఎలాంటి రుస‌ములు వ‌ర్తించ‌వు. ఇక నుంచి ఆన్‌లైన్‌లో, పాయింట్ ఆఫ సేల్స్ యంత్రాల వ‌ద్ద లావాదేవీలు నిర్వ‌హించే పాల‌సీదారుల‌కు అద‌న‌పు ఛార్జీలు ఉండ‌వ‌ని పేర్కొంది.

ఇక‌ ర‌ద్దు అయిన పాల‌సీలను రెండేళ్ల త‌ర్వాత కూడా పునరుద్ధ‌ర‌ణ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు ఇటీవ‌లే ఎల్ఐసీ ప్ర‌క‌టించింది. ఇంత‌కుముందు ఈ అవ‌కాశం లేక ఆపేసిన పాల‌సీల‌ను కూడా తిరిగి కొన‌సాగించ‌వ‌చ్చు. జీవిత‌ బీమా ప్ర‌యోజ‌నాల‌ను విస్త‌రించాల‌నే ఉద్దేశ్యంతో ఎల్ఐసీ ఐఆర్‌డీఏఐను సంప్ర‌దించి, జ‌న‌వ‌రి1, 2014 త‌రువాత కొనుగోలు చేసిన పాల‌సీల‌కు కూడా ఎక్కువ పున‌రుద్ధ‌ర‌ణ కాలం ఇవ్వాల‌ని కోరింది. ఫ‌లితంగా జ‌న‌వ‌రి1, 2014 త‌రువాత కొనుగోలు చేసిన నాన్ లింక్డ్ పాలసీలను ప్రీమియం చెల్లించ‌ని మొద‌టి వాయిదా నుంచి ఐదేళ్లలోపు, అదే విధంగా యూనిట్ లింక్డ్ పాలసీలను మూడేళ్లలోపు పునరుద్ధరించుకోవ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly