ఎల్ఐసీ టెక్ ట‌ర్మ్ ప్లాన్..వివ‌రాలు

దీని ప్రీమియం ఇత‌ర ప్రైవేటు జీవిత బీమా ప్లాన్‌ల ప్రీమియంల‌కు స‌మానంగా లేదా అంత‌కంటే త‌క్కువ‌గానూ ఉండ‌నుంది.

ఎల్ఐసీ టెక్ ట‌ర్మ్ ప్లాన్..వివ‌రాలు

చాలా రోజుల త‌ర్వాత ఎల్ఐసీ కొత్త ఆన్‌లైన్ పాల‌సీ టెక్ ట‌ర్మ్ ప్లాన్ (ప్లాన్ నం.854)ని అందుబాలోకి తీసుకురానుంది. అయితే ఇప్పుడు ఉన్న‌ ఈ-ట‌ర్మ్ ప్లాన్ కూడా కొన‌సాగిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ-ట‌ర్మ్ ప్లాన్‌లో ఇత‌ర కంపెనీలు అందించే పాల‌సీల‌తో పోలిస్తే ప్రీమియం రెట్టింపుగా ఉంటుంది.

ఎల్ఐసీ కొత్త ఆన్‌లైన్ ట‌ర్మ్ ప్లాన్ ఎందుకు ప్రారంభిస్తుంది?
బీమా రంగంలో ఎల్ఐసీకి ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. ఇది ప్ర‌జ‌ల్లో ఎన‌లేని విశ్వాసం ఏర్ప‌రుచుకుంది. ఈ కార‌ణంగానే ఎల్ఐసీ ఈ-ట‌ర్మ్ ప్లాన్‌కు ఎక్కువ ప్రీమియం విధిస్తుంది. ఇత‌ర బీమా సంస్థ‌లు కోటి రూపాయ‌ల ట‌ర్మ్ పాల‌సీకి రూ.9 వేల నుంచి రూ.10 వేల వార్షిక ప్రీమియం ఉండ‌గా, ఎల్ఐసీ ప్రీమియం రూ.18,000-20,000 వ‌ర‌కు ఉంది.

ఎల్ఐసీ క్లెయిమ్‌ల నిష్ప‌త్తి కూడా ఎక్కువ‌గా ఉండ‌టంతో త‌మ ప్లాన్‌నే ఎంచుకుంటార‌ని న‌మ్ముతోంది. అయితే గ‌త సంవ‌త్స‌రం మ్యాక్స్ లైఫ్ ఎల్ఐసీ కంటే మెరుగైన క్లెయిమ్‌ల నిష్ప‌త్తి న‌మోదైంది. అయితే దీంతో ఎల్ఐసీ కొంత రూటు మార్చింది. ప్రీమియం త‌గ్గించాల‌ని భావించింది. అందుకే దానిని ఎల్ఐసీ టెక్-ట‌ర్మ్ ప్లాన్ రూపంలో తీసుకురానుంది.

ఎల్ఐసీ కొత్త ట‌ర్మ్ ప్లాన్ వివ‌రాలేంటీ తెలుసుకుందాం…

 • క‌నిష్ఠ‌ ప్ర‌వేశ వ‌య‌సు 18 సంవ‌త్స‌రాలు గ‌రిష్ఠం 65 సంవ‌త్స‌రాలు
 • గ‌రిష్ఠ మెచ్యూరిటీ వ‌య‌సు 80 సంవ‌త్స‌రాలు
 • క‌నీస హామీ రూ.50 ల‌క్ష‌లు గ‌రిష్ఠ హామీకి ప‌రిమితి లేదు
 • ట‌ర్మ్ పాలసీ వ్య‌వ‌ది గరిష్ఠంగా 40 సంవ‌త్స‌రాలు

ఎల్ఐసీ టెక్ ట‌ర్మ్ పాల‌సీ ఫీచ‌ర్లు

 • ఇది ఆన్‌లైన్ ట‌ర్మ్ ప్లాన్‌. పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే కుటుంబ స‌భ్యుల‌కు హామీ ల‌భిస్తుంది. ఒక‌వేళ పాల‌సీ గ‌డువు ముగిసినంత వ‌ర‌కు జీవించి ఉంటే ఎటువంటి హామీ ల‌భించ‌దు. మెచ్యూరిటీ ప్ర‌యోజ‌నాలు అంద‌వు.
 • ఈ పాల‌సీకి 3 పేమెంట్ ఆప్ష‌న్లు ఉన్నాయి. సింగిల్, లిమిటెడ్‌, రెగ్యుల‌ర్‌
 • హామీ మొత్తంలో కూడా రెండు ఆప్ష‌న్లు ఉన్నాయి. లెవ‌ల్‌, ఇంక్రీసింగ్ స‌మ్ అష్యూర్‌డ్
 • లెవ‌ల్ అంటే ట‌ర్మ్ ముగిసేవ‌ర‌కు హామీ మొత్తం అంతే స‌మానంగా ఉంటుంది.
 • ఇంక్రీసింగ్ స‌మ్ అష్యూర్‌డ్ లో ఐదేళ్ల వ‌ర‌కు హామీ స‌మానంగా ఉంటుంది. త‌ర్వాత ప‌దేళ్ల‌కు ప్ర‌తి సంవ‌త్స‌రం 10 శాతం పెరిగి , 15 ఏళ్ల‌కు రెట్టింపుగా ఉంటుంది. ఆ త‌ర్వాత చివ‌రి వ‌ర‌కు అంతే కొన‌సాగుతుంది
 • హామీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా వాయిదాల్లో అంటే ఐదేళ్లు, ప‌దేళ్లు, ప‌దిహేనేళ్లు తీసుకునే అవ‌కాశం కూడా ఉంది.
 • గ‌రిష్ఠ క‌వ‌రేజ్ 80 సంవ‌త్స‌రాలు
 • ఈ ప్లాన్‌లో యాక్సిడెంట‌ల్ రైడ‌ర్ కూడా ల‌భిస్తుంది.
 • మ‌హిళ‌ల‌కు, దూమ‌పానానికి దూరంగా ఉండేవారికి త‌క్కువ రేట్లు ఉంటాయి.
 • ఇత‌ర ప్రైవేటు బీమా సంస్థ‌ల ట‌ర్మ్ ప్లాన్‌లతో స‌మానంగా ఉంటుంది.

ఎల్ఐసీ టెక్ ట‌ర్మ్ ప్లాన్ ప్రీమియం
దీని ప్రీమియం ఇత‌ర ప్రైవేటు జీవిత బీమా ప్లాన్‌ల ప్రీమియంల‌కు స‌మానంగా లేదా అంత‌కంటే త‌క్కువ‌గానూ ఉండ‌నుంది. చూస్తుంటే ప్ర‌వేటు కంపెనీల‌ను ఎల్ఐసీ గ‌ట్టి పోటీనివ్వ‌నుంది. దీంతో ప్రైవేటు కంపెనీలు కూడా ప్రీమియం త‌గ్గించే అవ‌కాశం లేక‌పోలేదు. పాల‌సీ బ‌జార్‌, క‌వ‌ర్ ఫాక్స్ వంటి ఆన్‌లైన్ పోర్ట‌ల్స్ ద్వారా ప్రీమియం పోల్చుకొని చూసుకోవాలి.

ఎల్ఐసీ టెక్ ట‌ర్మ్ కొనుగోలు చేయ‌వ‌చ్చా?
ఎల్ఐసీ, ఐసీఐసీఐ, మ్యాక్స్ లైఫ్, ఎస్‌బీఐ అందిస్తున్న పాల‌సీలను పోల్చిచూసుకోవాలి. మీ అవ‌స‌రానికి, ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఉన్న పాల‌సీని ఎంచుకోవాలి.

ఇంత‌కుముందు ఉన్న ట‌ర్మ్ పాల‌సీని స‌రెండ‌ర్ చేసి ఎల్ఐసీ టెక్ ట‌ర్మ్ ప్లాన్‌ను ఎంచుకోవ‌చ్చా?
ఇత‌ర పాల‌సీల‌తో పోల్చుకున్న‌ప్పుడు మీ పాల‌సీ ప్రీమియం రూ.1000-2000 ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ అదే పాల‌సీని కొన‌సాగించ‌డం మంచిది. ఏ కంపెనీ 100 శాతం క్లెయిమ్ సెటిల్‌మెంట్ గ్యారంటీని ఇవ్వ‌దు. ఎల్ఐసీ పాల‌సీ తీసుకుంటే క‌చ్చితంగా క్లెయిమ్ సెటిల్ చేస్తార‌ని అనుకునే అవ‌కాశం లేదు. పాల‌సీ తీసుకున్నమూడేళ్ల‌ త‌ర్వాత ఏ కంపెనీ క్లెయిమ్‌ను తిర‌స్క‌రించే అవ‌కాశం లేదు.

ఎల్ఐసీ కొత్త ట‌ర్మ్ ప్లాన్ తీసుకునేముందు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

 • సింగిల్ లేదా లిమిటెడ్ ప్రీమియం కంటే రెగ్యుల‌ర్ ప్రీమియం ఎంచుకోవ‌డం మేలు
 • ఇక హామి విష‌యానికొస్తే లెవ‌ల్ స‌మ్ హామీని ఎంచుకోవాలి. మీ అవ‌స‌రాలను Life Insurance Need Calculator పై క్లిక్ చేసి తెలుసుకోవాలి.
 • 5,10,15 సంవ‌త్సరాల వాయిదాల‌తో కూడిన చెల్లింపుల కంటే ఒకేసారి చెల్లించే (లంప్‌స‌మ్‌) హామీ మొత్తాన్ని ఎంచుకోవాలి
 • 60 సంవత్స‌రాల వ‌య‌సు వ‌ర‌కు ట‌ర్మ్‌ పాల‌సీని తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు. 80 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ట‌ర్మ్ పాల‌సీని తీసుకోకూడ‌దు.
 • రైడ‌ర్‌గా కాకుండా యాక్సిడెంట‌ల్ క‌వ‌ర్‌ను సాధార‌ణ బీమా సంస్థ నుంచి కొనుగోలు చేయాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly