పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాల‌పై కొత్త‌ వ‌డ్డీ రేట్లు

పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాల‌ లేటెస్ట్ వ‌డ్డీ రేట్ల వివ‌రాల‌ను తెలుసుకుందాం

పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాల‌పై కొత్త‌ వ‌డ్డీ రేట్లు

డిపాజిటర్ల‌కు ప‌న్ను, పొదుపు ప్ర‌యోజ‌నాలు క‌ల్పించేందుకు పోస్ట‌ల్ శాఖ తొమ్మిది పోస్ట్ ఆఫీస్ పొదుపు ప‌థ‌కాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పోస్ట్ ఆఫీసు పొదుపు ఖాతా, 5 ఏళ్ల పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ ఖాతా, పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ ఖాతా, పోస్టాఫీసు నెల‌వారీ ఆదాయ‌ ఖాతా, వ‌యోధికుల పొదుపు ఖాతా , 15 ఏళ్ల ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా, జాతీయ పొదుపు ప‌త్రాల పేరిట తొమ్మిది ప‌థ‌కాల‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప‌థ‌కాల‌లో చాలా వాటిపై ప్రతీ మూడు నెల‌ల‌కోసారి వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రిస్తారు.

ఇండియాపోస్ట్‌.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్ ప్రకారం ఈ తొమ్మిది ప‌థ‌కాల‌పై ల‌భిస్తున్న వ‌డ్డీ రేట్ల‌ను ఒక‌సారి ప‌రిశీలించండి.

1. పోస్టాఫీస్ పొదుపు ఖాతా

వ్య‌క్తిగ‌త‌/ఉమ‌్మ‌డి ఖాతాదారుల‌కు ఈ ప‌థ‌కంలో ఏటా 4 శాతం వడ్డీ ల‌భిస్తుంది.

2. 5-ఏళ్ల పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ ఖాతా

జ‌న‌వ‌రి 1, 2018 నుంచి పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాల‌పై ల‌భిస్తున్న వ‌డ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.

వీటిపై ఏటా 6.9 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది(మూడు నెల‌ల‌కోసారి స‌వ‌రిస్తారు). ఖాతాలో ప్ర‌తీ నెలా రూ.10 జ‌మ చేస్తే మెచ్యూరిటీ అయ్యే స‌మ‌యానికి రూ.717.43 పొందుతారు. వార్షిక ప్రాతిప‌దిక‌న‌ ఇది మ‌ళ్లీ ఐదు సంవ‌త్స‌రాల‌కు కొన‌సాగించ‌బ‌డుతుంది.

3. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా

ఈ ప‌థ‌కంలో అందించే వ‌డ్డీ రేట్ల‌ను ఏటా చెల్లిస్తారు. అయితే ప్ర‌తీ మూడు నెల‌ల‌కోసారి లెక్కించ‌డం జ‌రుగుతుంది.
జ‌న‌వ‌రి 1, 2018 నుంచి వ‌డ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

4. పోస్టాఫీసు నెల‌వారీ ఆదాయ ఖాతా

ఈ ప‌థ‌కంలో జ‌న‌వ‌రి 1, 2018 నుంచి ఏటా 7.3 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. అయితే చెల్లింపులు మాత్రం నెల‌వారీగా ఉంటాయి.

5. వ‌యోధికుల పొదుపు ఖాతా

జులై 1, 2017 నుంచి ఈ ప‌థ‌కంలో ఏటా 8.3 శాతం వ‌డ్డీ ఇస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

6. 15-ఏళ్ల ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా

జ‌న‌వ‌రి 1. 2018 నుంచి ఈ ప‌థ‌కంలో ఏటా 7.6 శాతం వ‌డ్డీ ఇస్తున్నారు.( ఏటా చ‌క్రవ‌డ్డీని జ‌మ చేస్తారు)

7. జాతీయ పొదుపు ప‌త్రాలు

జ‌న‌వ‌రి 1, 2018 నుంచి ఈ ప‌థ‌కంలో ఏటా 7.6 శాతం వ‌డ్డీ అందిస్తున్నారు. ప్ర‌తీ ఏడాది చ‌క్ర‌వ‌డ్డీని జ‌మ చేస్తారు, అయితే మెచ్యూరిటీ తీరాకే చెల్లింపులు ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు వంద రూపాయ‌లు 5 ఏళ్ల తర్వాత 144.23 అవుతాయి.

8. కిసాన్ వికాస్ ప‌త్రాలు

జ‌న‌వ‌రి 1, 2018 నుంచి ఈ ప‌థ‌కంలో ఏటా 7.3 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ఏటా చ‌క్ర‌వ‌డ్డీని జ‌మ చేస్తారు. పెట్టుబ‌డులు 9 సంవ‌త్స‌రాల 10 నెల‌ల‌కు రెట్టింపు అవుతాయ.(118 నెల‌లు)

9. సుక‌న్య స‌మృద్ధి ఖాతా

ఈ ప‌థ‌కంలో జ‌న‌వ‌రి 1, 2018 నుంచి ఏటా 8.1 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ప్ర‌తీ ఏడాదికోసారి లెక్కిస్తారు. చ‌క్ర‌వ‌డ్డీ కూడా ఏటా జ‌మ చేస్తారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly